TJ రివ్యూ: ఇంద్ర‌సేన‌

November 30, 2017 at 5:00 pm

TJ రివ్యూ: ఇంద్ర‌సేన‌

టైటిల్‌: ఇంద్ర‌సేన‌

బ్యాన‌ర్‌: ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్‌, ఆర్‌.స్టూడియోస్‌, విజ‌య్ ఆంటోని ఫిలిం కార్పొరేష‌న్‌

న‌టీన‌టులు: విజ‌య్ ఆంటోని, డ‌యానా చంపిక‌, మహిమా, జ్వెల్ మారీ, రాధా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్, రింధు రవి మ్యూజిక్‌: విజయ్ ఆంథోని

సినిమాటోగ్ర‌ఫీ: కె.దిల్ రాజ్

నిర్మాతలు: రాధిక శ‌ర‌త్‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని, నీలం కృష్ణారెడ్డి

దర్శకత్వం: జి.శ్రీనివాసన్

రిలీజ్ డేట్‌: 30 న‌వంబ‌ర్‌, 2017

డాక్ట‌ర్ స‌లీమ్ – బిచ్చగాడు – బేతాళుడు – య‌మున్ లాంటి వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ విజ‌య్ ఆంటోనీ న‌టించిన లేటెస్ట్ మూవీ ఇంద్ర‌సేన‌. ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ  స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :

ఇంద్ర‌సేన‌, రుద్ర‌సేన (విజయ్ ఆంటోనీ) ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు. క‌వ‌ల‌పిల్ల‌లు. పెద్ద‌వాడు అయిన ఇంద్ర‌సేన ప్రేమించిన అమ్మాయి ఎలిజిబెత్ ఓ యాక్సిడెంట్‌లో చ‌నిపోవ‌డంతో మ‌నోడు డ్రింక్‌కు బానిసై ఆమె ఊహ‌ల్లో బ‌తికేస్తుంటాడు. త‌మ్ముడు రుద్ర‌సేన టీచ‌ర్‌గా ప‌నిచేస్తూ కుటుంబాన్ని చూస్తుంటాడు. రుద్ర‌సేన‌కు మామ‌య్య కూతురు రేవ‌తి (డ‌యానా చంపిక‌)తో పెళ్లి కుదురుతుంది. ఈ లోగా ఇంద్ర‌సేన ఓ హ‌త్య కేసులో ఏడేళ్లు జైలుశిక్ష అనుభ‌వించి భ‌య‌ట‌కు వ‌స్తాడు. ఈ లోగా త‌మ్ముడు రుద్ర‌సేన పెద్ద రౌడీగా మారాల్సి వ‌స్తుంది. రుద్ర‌సేన రౌడీగా మార‌డానికి కార‌ణ‌మేంటి? ఇంద్ర‌సేన త‌మ్ముడిని ఎలా కాపాడుకుంటాడు ? ఇంద్ర‌సేన త‌మ్ముడిని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో ఎలాంటి త్యాగానికి సిద్ధప‌డ‌తాడ‌నేదే ఇంద్ర‌సేన సినిమా.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & TJ  విశ్లేష‌ణ :

రెండు పాత్ర‌ల్లో విజ‌య్ ఆంటోనీ న‌ట‌న మెప్పించింది. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో క‌ట్టిప‌డేశాడు. త‌మ్ముడి కోసం అన్న ప‌డే త‌ప‌న‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. ఇక రుద్ర‌సేనగా పీఈటీ టీచ‌ర్‌గాను, రౌడీగాను బాగా న‌టించాడు. రొమాన్స్ సీన్ల‌లో మాత్రం కాస్త టెన్ష‌న్ ప‌డ్డ‌ట్టు క‌నిపించింది. హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే డ‌యానా, మ‌హిమాలు చ‌క్క‌గా న‌టించారు. ఇద్ద‌రు బొద్దుగానే క‌న‌ప‌డ్డారు. సినిమా క‌థ‌నం విష‌యానికి వ‌స్తే ప‌స్టాఫ్‌లో కుటుంబం, ప్రేమ‌, అన్న‌ద‌మ్ముల గొడ‌వ నేప‌థ్యంలో ఉంటుంది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ బాగుంది. సినిమా ఒక పాయింట్ మీద మొద‌లై ఆ త‌ర్వాత ఎక్క‌డికో ఎటో అన్న‌ట్టు పోతుంటుంది. సెకండాఫ్‌లో కాసేపు ప్రేమ – కాసేపు యాక్ష‌న్ – కాసేపు బ్ర‌ద‌ర్‌ సెంటిమెంట్స్ అంటూ అటూ ఇటూ తిరిగేస్తుంటుంది. 

ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌న్ అతి స్వేచ్ఛ తీసుకుని లాజిక్‌లు మిస్ అయ్యాడు. ఎన్‌కౌంట‌ర్ తర్వాత పోలీసులకు చ‌నిపోయింది ఇంద్ర‌సేన అని తెలియ‌కుండా ఎలా ఉంటుందో అర్థం కాదు. ఇలాంటి లాజిక్స్ ద‌ర్శ‌కుడు మిస్ అయ్యాడు. ఎమోష‌న‌ల్‌గా సినిమా క‌నెక్ట్ అయినా కంటెంట్ ప‌రంగా మాత్రం వీక్ అయ్యింది. ఇక టెక్నిక‌ల్‌గా విజ‌య్ ఆంటోనీ పాట‌ల విజువ‌ల్స్ బాగున్నా ట్యూన్స్ వీక్‌. డ‌బ్బింగ్ పాట‌లు విన‌డానికి చాలా చికాకుగా ఉన్నాయి. ఆర్ ఆర్ సూప‌ర్‌. విజ‌యే చేసిన ఎడిటింగ్ బాగున్నా సెకండాఫ్‌లో చాలా సీన్లు ట్రిమ్ చేయాల్సిన‌వి ఉన్నాయి. దిల్ రాజు సినిమాటోగ్ర‌ఫీ నీట్‌గా ఉంది. 

ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ సకండాఫ్ క‌థ‌లోని టెంపోను మిస్ చేశాడ‌నిపించింది. ఒకే మెయిన్ క‌థ‌ను రాసుకోకుండా ప‌లు ఉప‌క‌థ‌లు సినిమాలో కుక్కేయ‌డంతో క‌థ‌లో క్లారిటీ, స్పీడ్ మిస్ అయ్యింది. సినిమా మొత్తంగా పావు శాతం మెప్పిస్తే, ముప్పావు శాతం బోర్ కొట్టిస్తుంది. ఎమోష‌న‌ల్ కంటెంట్ మాత్ర‌మే క‌నెక్ట్ అయితే కంటెంట్ మాత్రం బోర్ బోర్‌. బిచ్చ‌గాడు సినిమా చూసిన జ‌నాలు ఇంద్ర‌సేన‌పై ఎన్నో ఆశ‌ల‌తో థియేట‌ర్‌కు వెళితే బొక్క‌బోర్లాప‌డ‌డం ఖాయం.

 

ఇంద్ర‌సేన సినిమా TJ రేటింగ్‌: 2 / 5

TJ రివ్యూ: ఇంద్ర‌సేన‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts