బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌కు చెర్రీ హ్యాండ్‌..!

November 22, 2017 at 9:48 pm

టాలీవుడ్ లో తక్కువ సినిమాలు తీసి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించిన కొరటాల ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ తో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేశారు.  ఆ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాడు.  ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న దర్శకులు కొరటాల ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు.  

అయితే ‘ధృవ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగా అబ్బాయి రాంచరణ్‌తో ఓ సినిమా తీయబోతున్నట్లు ఇటీవ‌ల‌ వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  

ఈ సినిమాతో తర్వాత కొరటాలతో ఓ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మరో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వాస్తవానికి ‘మిర్చి’ తరువాతనే చరణ్ తో కొరటాల ఓ సినిమా చేయవలసి ఉంది. స్క్రిప్ట్ విషయంలో చరణ్ అసంతృప్తి కారణంగా ఆ ప్రాజెక్టు  రిజెక్ట్ చేశాడు. దాదాపు  ప్రారంభోత్సవం కూడా అయిన తర్వాత కొరటాలను పక్కనపెట్టాడు చెర్రీ. 

ఇప్పుడు మరోసారి అదే విధంగా కొరటాలకు రామ్ చరణ్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడా..? అవుననే అంటున్నారు చాలామంది. చరణ్ తన నెక్స్ట్ మూవీని బోయపాటి శ్రీనుతో చేయనున్నట్టుగా తాజాగా ఒక టాక్ వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో బోయపాటి సినిమాకు మూహర్తం షాట్ కూడా ఫిక్స్ చేశారట. మరి ఇదే కనుక జరిగితే..ఇప్పట్లో చెర్రీతో కొరటాల సినిమా లేనట్లే లెక్క.

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌కు చెర్రీ హ్యాండ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts