ఒక్క క్ష‌ణం TJ రివ్యూ

December 28, 2017 at 1:43 pm

టైటిల్ : ఒక్క క్షణం

జానర్: సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్

న‌టీన‌టులు : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్

మ్యూజిక్‌ : మణిశర్మ

నిర్మాత : చక్రి చిగురుపాటి

దర్శకత్వం : విఐ.ఆనంద్

రిలీజ్ డేట్‌: 28 డిసెంబ‌ర్‌, 2017

 

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అల్లు అర‌వింద్ త‌న‌యుడు శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్ విఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క క్ష‌ణం అనే థ్రిల్ల‌ర్ సినిమాలో న‌టించాడు. ఎక్కడిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ థ్రిల్లర్ ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సంబంధం లేని ఇద్ద‌రు వ్య‌క్తుల జీవితాల్లో ఒకే సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం అనే కొత్త కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కింది. ఈ రోజు రిలీజ్ అయిన ఒక్క క్ష‌ణం అంచ‌నాలు అందుకుందా ?  లేదా ? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

 

స్టోరీ :

మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన జీవా (అల్లు శిరీష్‌) జ్యోత్స్న (సుర‌భి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. వీరి ప్రేమ‌కు పెద్ద‌లు ఓకే చెపుతారు.  జ్యోతికి త‌మ ప‌క్క అపార్ట్‌మెంట్‌లోని ఉంటోన్న శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుందో తెలుసుకునే క్ర‌మంలో జీవా, జ్యోత్స్న‌ల‌కు షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. త‌మ జీవితంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయో… అవే సంఘ‌ట‌న‌లు వారి జీవితంలో కూడా జ‌రుగుతున్నాయ‌న్న విష‌యం తెలుస్తుంది. ఓ ప్రొఫెస‌ర్ ద్వారా ప్యార‌ల‌ల్ లైఫ్ గురించి తెలుసుకున్న జ్యోత్స్న త‌న జీవితం కూడా స్వాతిలాగే అవుతుంద‌న్న భయంతో ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా స్వాతి హ‌త్య‌కు గురి కావ‌డం, ఆ హ‌త్య శ్రీనివాసే చేశాడ‌ని పోలీసులు అరెస్టు చేస్తారు. జీవా కూడా త‌న‌ను చంపేస్తాడేమోన‌ని జ్యోత్స్న మరింత భయపడుతుంది జ్యో.. స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా..? ఆత్మహత్య చేసుకుందా..? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా..? అస‌లు ఈ రెండు జంట‌ల జీవితాల్లో సంఘ‌ట‌న‌లు ఒకేలా ఎందుకు జ‌రుగుతుంటాయి ?  ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌రే ఒక్క క్ష‌ణం.

 

విశ్లేష‌ణ :

న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో శిరీష్ న‌ట‌న మెప్పించింది. తాను ప్రేమించిన అమ్మాయి చనిపోతుంద‌ని ఆమెను కాపాడుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నం బాగుంది. అయితే న‌ట‌నా ప‌రంగా మాత్రం శిరీష్ తేలిపోయాడు. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో అత‌డి ఎక్స్‌ప్రెష‌న్స్ వీక్‌. కొన్ని సీన్ల‌లో అన్న అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేసిన‌ట్టే ఉంది. సుర‌భి అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. క‌థ‌కు కీల‌క‌మైన రోల్‌లో మ‌రో జంట అయిన అవ‌స‌రాల శ్రీనివాస్‌, శీర‌త్ క‌పూర్ మెప్పించారు. ప్లాస్ బ్యాక్‌లో శీర‌త్ న‌ట‌న సూప‌ర్‌. క‌థంతా ఈ న‌లుగురి పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంది. ఇక చివ‌ర్లో ఎంట్రీ ఇచ్చిన దాస‌రి అరుణ్‌కుమార్ విల‌నిజాన్ని పండించాడు. 

తెలుగు సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రాని ప్యార‌ల‌ల్ లైఫ్ (స‌మాంత‌ర జీవితాలు) కాన్సెఫ్ట్‌ను ద‌ర్శ‌కుడు ఆనంద్ చ‌క్క‌గా డీల్ చేశాడు. రెండు జంట‌ల జీవితాలు కాస్త టైం గ్యాప్‌తో ఒకేలా ఎలా జ‌రుగుతుంటాయ‌న్న‌ది చాలా ఆస‌క్తితో లింకుల‌ను సెట్ చేస్తూ సినిమాను ప్ర‌జెంట్ చేసిన తీరు ఎక్స్‌లెంట్‌. ఇంట‌ర్వెల్ ట్విస్టులు, సెకండాఫ్ ట్విస్టులు అదిరిపోయాయి. సినిమాలో స్లో నెరేష‌న్‌, సాగ‌దీత స‌న్నివేశాలు, రొటీన్ క్లైమాక్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక‌పోవ‌డం, స‌న్నివేశాలు రిపీట్ అవుతున్న‌ట్టు అనిపించ‌డం సినిమాకు మైన‌స్‌. 

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…

శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సినిమా మూడ్‌ను క్యాప్చ‌ర్ చేసింది. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్‌లో సాంగ్స్ వీక్‌, నేప‌థ్య సంగీతం మాత్రం బాగుంది. చోటా కె.ప్ర‌సాద్ క్లీయ‌ర్‌గా, క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు ఆనంద్ తెలుగు సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రాని ప్యార‌ల‌ల్ లైఫ్ బేస్ చేసుకుని రాసుకున్న కథ, కథనం చాలా బాగున్నాయి. అయితే వాటికి తగిన సపోర్ట్ ఇవ్వగల బలమైన సన్నివేశాలు లేకపోవడం ఫలిత ప్రభావాన్ని కొంత తగ్గించాయి. క‌థనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం లోపించింది. ఫస్ట్ హాప్ స్లోగా నడిచినా ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కథనం వేగం పుంజుకుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంకాస్త వేగంగా నడిచుంటే బాగుండనిపిస్తుంది.

 

ఫైన‌ల్‌గా…

తెలుగు తెరపై ఇప్పటి వ‌ర‌కు చూడని ప్యార్లల్ లైఫ్ అనే కొత్త కథాంశంతో రూపొందిన ఒక్క క్షణం సినిమా కొత్తదనం పరంగా మంచి మార్కులనే దక్కించుకుంది. థ్రిల్ల‌ర్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారిని బాగా మెప్పిస్తుంది. కొత్త‌ద‌నం, ఉత్కంఠ భ‌రిత స‌న్నివేశాలు ర‌క్తి క‌ట్టించాయి.

 

TJ ఫైన‌ల్ పంచ్‌: ఉత్కంఠ క్ష‌ణం

 

TJ సూచ‌న‌: థ‌్రిల్లింగ్‌ ఎంజాయ్‌మెంట్‌

 

TJ ఒక్క క్ష‌ణం రేటింగ్‌: 3 / 5 

 

 

ఒక్క క్ష‌ణం TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts