హ‌లో TJ రివ్యూ

December 22, 2017 at 1:10 pm

టైటిల్‌: హ‌లో

నటీనటులు: అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ , రమ్య కృష్ణ , జగపతిబాబు 

ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి 

సినిమాటోగ్రఫీ:  పి.ఎస్. వినోద్ 

మ్యూజిక్ : అనూప్ రూబెన్స్ 

నిర్మాత: నాగార్జున అక్కినేని

దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ 

సెన్సార్ రిపోర్ట్‌: క‌్లీన్ యూ

ర‌న్ టైం: 131 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 22 డిసెంబ‌ర్‌, 2017

 

తొలి సినిమాతోనే అక్కినేని అఖిల్ అభిమానులను నిరాశపర్చాడు. దీంతో రెండవ సినిమా ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆలశ్యం అయినా సరే ‘మనం’ వంటి సూపర్ హిట్ అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘హలో’ అంటూ ముందుకొచ్చాడు. అఖిల్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. మ‌రి హ‌లోతో అయినా అఖిల్ హిట్ కొట్టాడా ? అత‌డికి తొలి స‌క్సెస్ వ‌చ్చిందా ? అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

స్టోరీలోకి వెళితే….

సినిమా అసలు కథ విషయానికి వస్తే శ్రీను(అఖిల్), జును (కళ్యాణి) చిన్నప్పుడే ఓ పానీపూరి బండి దగ్గర స్నేహితులు అవుతారు. వారిద్ద‌రూ అదే బండి ద‌గ్గ‌ర రోజూ క‌లుసుకుని, స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటుంటారు. జును తండ్రికి ఢిల్లీ ట్రాన్స్‌ఫ‌ర్ అవ‌డంతో వాళ్ల ఫ్యామిలీ ఢిల్లీకి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఫియానో వాయిస్తూ త‌న‌ను ఆనంద‌ప‌రిచే శ్రీనుకు జును ప్ర‌తి రోజు రూ.100 ఇస్తుంటుంది. ఆమె ఢిల్లీ వెళ్లిపోయేట‌ప్పుడు చివ‌రి రోజు ఇచ్చిన నోటు మీద ఆమె ఫోన్ నెంబ‌ర్ రాసి ఇస్తుంది. ఆ నోటును వేరే వ్యక్తి దొంగిలించటంతో…అప్పటి నుంచి ఎలాగైనా జునును కలవాలనే ప్రయత్నంలో ఉంటాడు. ఈ స్టోరీ ఇలా ఉంటే ఓ క్యాబ్ డ్రైవ‌ర్ రాంగ్ కాల్ చేసిన టైంలో శ్రీను తాను ఫియానోలో ట్యూన్ చేసిన పాట విన్పిస్తుంది. అది ఎక్కడ నుంచి విన్పిస్తుంది తెలుసుకునే సమయంలో శ్రీను  ఫోన్ ఓ దొంగ ఎత్తుకెళతాడు. అంతే ఫోన్ ను దక్కించుకునే క్రమంలో ఫైట్లు..స్టంట్స్. అనాథగా ఉన్న శ్రీను ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడతాడు. అప్పటి నుంచే జగపతిబాబు, రమ్యకృష్ణలు శ్రీను ను పెంచి పెద్ద చేస్తారు. మరి శ్రీను, జును ప్రేమ సక్సెస్ అయిందా ? లేదా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే హ‌లో.

 

TJ విశ్లేష‌ణ :

హ‌లో సినిమాలో అఖిల్ న‌ట‌నా ప‌రంగా నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. కొట్టినా, పాడినా, డ్యాన్సులు చేసినా క‌ళ్ల ముందే క‌దిలిన‌ట్టు అనిపిస్తుంది. అఖిల్ ఎక్క‌డా ఎన‌ర్జీ డ్రాఫ్ కాకుండా బాగా న‌టించాడు. హీరోయిన్ క‌ళ్యాణి న‌ట‌న చాలా స‌హ‌జంగా ఉంది. అఖిల్‌, క‌ళ్యాణి జంట తెరపై అందంగా ఉంది. క‌ళ్యాణి పాత్ర మ‌న ప‌క్కింటి అమ్మాయిని పోలిన‌ట్టు అనిపిస్తుంది. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ప‌ద్ధ‌తైన దంప‌తులుగా ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు జంట బావుంది. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ గ‌తంలో కొన్ని సినిమాల్లో వ‌చ్చిన పాత క‌థ‌నే తీసుకుని త‌న మెస్మ‌రైజ్ మార్క్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాల‌ని చూసినా అది కొన్ని సీన్ల‌కే ప‌రిమిత‌మైపోయింది. కథలో దమ్ము లేకపోవటంతో అనుకున్న రేంజ్‌లో సినిమా ఎలివేట్ కాలేదు. చిన్న‌ప్పుడు ఒక‌మ్మాయి, ఒక‌బ్బాయి ప‌రిచ‌యం కావ‌డం, వారి మ‌ధ్య స్నేహం చిగురించ‌డం, అనుకోని కార‌ణాల వ‌ల్ల వారు విడిపోయి తిరిగి క‌లుసుకోవ‌డ‌మే ఈ సినిమా. ఇది పాత క‌థే. సినిమాలో అఖిల్ స్టంట్స్, పాటల్లో డ్యాన్స్ బాగున్నాయి. సినిమాలో కామెడీ ట్రాక్ ఎక్కడా లేదు. ఫస్టాఫ్ మరీ డల్ గా ముందుకు సాగుతుంది. సెకండాఫ్ కొంతలో కొంత పర్వాలేదన్పిస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండవ సినిమాతోనూ అఖిల్ అంచ‌నాల‌ను కొంచెం మాత్ర‌మే అందుకున్నాడు.

 

ఫ్ల‌స్‌లు (+) :

– అఖిల్ ఫైట్స్‌, అదిరిపోయే డ్యాన్సులు

– అఖిల్ – క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌ని జోడీ

– అక్కినేని నాగార్జున నిర్మాణ విలువ‌లు

– మ్యూజిక్‌

– రిచ్ విజువ‌ల్స్‌

– సెకండాఫ్‌

 

మైన‌స్‌లు (-):

– ప్లాట్ న‌రేష‌న్‌

– సినిమా అప్ డ‌న్ ర‌న్నింగ్ 

– బోరింగ్ ఫ‌స్టాఫ్‌

– విక్ర‌మ్ కుమార్ మ్యాజిక్ మిస్‌

 

ఫైన‌ల్‌గా….

లాజిక్‌లు వ‌దిలేస్తే హ‌లో ఓ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ

 

క‌మ‌ర్షియ‌ల్ హిట్‌: ఎస్ 

TJ సూచ‌న‌:  ఓ సారి చూడొచ్చు

బోరింగ్‌: 40 % – ఎంజాయింగ్‌: 60 %

 

TJ రేటింగ్‌: 2.75 / 5

 

హ‌లో TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts