లాభాల్లోకి ‘ జై సింహా ‘ … 5 డేస్ క‌లెక్ష‌న్స్‌

January 17, 2018 at 10:52 am

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో బాల‌కృష్ణ జై సింహా ఒక్క‌టి మాత్ర‌మే దూసుకుపోతోంది. మిగిలిన మూడు సినిమాలు ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి – సూర్య డబ్బింగ్ సినిమా గ్యాంగ్ – రాజ్ త‌రుణ్ రంగుల‌రాట్నం సినిమాలు వీక్ అవ్వ‌డంతో పాటు పండ‌గ మూడు రోజుల పాటు ఈ సెల‌వులు స‌ద్వినియోగం చేసుకున్న జై సింహా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది.

ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా, బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌తో పాటు బాల‌య్య ఫ్యాన్స్‌ను మెప్పించేదిగా ఉండ‌డంతో బీ, సీ సెంట‌ర్ల‌లో వ‌సూళ్ల‌కు డోకా అయితే లేదు. ఇక తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 8.25 కోట్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా నాలుగు రోజుల‌కు రూ.20 కోట్ల షేర్‌కు చేరువైంది. ఇక ఈ సినిమా ఐదు రోజుల‌కు చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌రైన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

జై సింహాకు రూ.27 కోట్లే బిజినెస్ జ‌ర‌గ‌డంతో బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేందుకు ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఏపీలో బాల‌య్య సినిమాల‌కు మంచి మార్కెట్ ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జై సింహా దూసుకుపోతోంది. కృష్ణా జిల్లాలో 3 రోజులకు రూ.79.73 లక్షల్ని వసూలు చేసిన ఈ సినిమా 5వ రోజు కూడా అదే జోరు కొనసాగించి రూ.27.91 లక్షలు రాబట్టి 5 రోజులకుగాను రూ.1.68 కోట్లను ఖాతాలో వేసుకుంది. 

ఇక గుంటూరు జిల్లాలో ఐదో రోజు జై సింహా రూ.22.3 లక్షలు వసూలు చేసి మొత్తంగా రూ.2.06 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా చూస్తే ఈ రెండు జిల్లాల్లోనూ జై సింహా దూసుకుపోతోంది. ఇంకా పండ‌గ సెల‌వులు మ‌రో నాలుగు రోజులు ఉండ‌డంతో పాటు జ‌న‌వ‌రి 26 వ‌ర‌కు మంచి సినిమాలు లేక‌పోవ‌డం కూడా జై సింహాకు క‌లిసి రానుంది.

 

లాభాల్లోకి ‘ జై సింహా ‘ … 5 డేస్ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts