భానుప్రియ జీవితంలో విషాదం

February 3, 2018 at 11:12 am

టాలీవుడ్‌లో 1980-90 ద‌శ‌కంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న భానుప్రియ జీవితంలో ఓ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. భానుప్రియ మాజీ భ‌ర్త ఆద‌ర్శ్ కౌశ‌ల్ గుండెపోటుతో మృతిచెందారు. నాటి త‌రం సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్ లాంటి వాళ్ల‌తో ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించిన ఆమె 1998లో ఆద‌ర్శ్ కౌశ‌ల్‌ను వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు వీరి వైవాహిక బంధం స‌జావుగానే సాగింది. 

అయితే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో 2005లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి అభిన‌య అనే కుమార్తె ఉంది. విడాకులు త‌ర్వాత భానుప్రియ చెన్నైలో త‌న కుమార్తెతో క‌లిసి ఉంటున్నారు. ఇక ఆద‌ర్శ్ మాత్రం ప్రస్తుతం అమెరికాలో సింగిల్ గానే ఉంటున్నారు. ఈ షాకింగ్ న్యూస్ తెలిసిన వెంటనే ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న భానుప్రియ అమెరికాకు బయలుదేరి వెళ్లింది. 

11

విడాకుల త‌ర్వాత భానుప్రియ చెన్నైలోనే ఉండ‌డం. అప్పుడ‌ప్పుడు తెలుగు సినిమాల్లో మాత్ర‌మే క‌నిపిస్తుండ‌డంతో ఆమె గురించి పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌లేదు. ఆమె టాలీవుడ్ కు దూరంగా చెన్నైలో ఉండిపోవడంతో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలేవీ ఇక్కడ మీడియాకు… సినిమా జనాలకు పెద్దగా తెలియలేదు. 

భానుప్రియ జీవితంలో విషాదం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts