కాజ‌ల్‌పై మ‌న‌సు ప‌డ్డ టాప్ ప్రొడ్యుస‌ర్ కొడుకు..!

February 8, 2018 at 5:48 pm

టాలీవుడ్‌లో ముదురు ముద్దుగుమ్మ‌ల్లో ఒక‌రైన కాజ‌ల్ అగ‌ర్వాల్‌పై ఇప్పుడు ఓ స్టార్ ప్రొడ్యుస‌ర్ కొడుకు మ‌న‌సుప‌డ్డాడ‌ట‌. మ‌రి ఆ స్టార్ ప్రొడ్యుస‌ర్ కొడుకు ఎవ‌రు ? ఆ క‌థేంటో చూద్దాం. టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాల నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్ ఒక‌రు. బెల్లంకొండ సురేష్ త‌న‌యుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ హీరోగా నిలదొక్కుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అటు సురేష్ కూడా త‌న త‌న‌యుడిని స్టార్‌గా నిల‌బెట్టేందుకు ప్ర‌తి సినిమాకు భారీగా ఖ‌ర్చు చేయిస్తున్నారు. సురేష్ ప్ర‌తి సినిమాకు భారీ బ‌డ్జెట్టే పెట్టారు. ప్ర‌తి సినిమాలోనూ స్టార్ హీరోయిన్ల‌తోనే ఆడిపాడాడు.

 

తొలి సినిమా అల్లుడుశీనులో స‌మంత హీరోయిన్ అయితే, త‌మ‌న్నా ఐటెం సాంగ్ చేసింది. రెండో సినిమా మీడియం రేంజ్ బ‌డ్జెట్‌ది. ఇక జ‌య జాన‌కీ నాయ‌క సినిమాలో ర‌కుల్‌ప్రీత్‌తో ఆడిపాడాడు. ఇక త‌న తాజా సినిమా సాక్ష్యంలో పూజా హెగ్డే హీరోయిన్‌. త‌న ప్ర‌తి సినిమాలోనూ స్టార్ హీరోయిన్ ఉండేలా, టాప్ టెక్నీషియ‌న్లు ప‌నిచేసేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నూతన దర్శకుడు నాని డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. 

 

ఈ సినిమాలో సురేష్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. త‌న సినిమాల్లో స్టార్ హీరోయిన్ల విష‌యంలో రాజీప‌డ‌ని సురేష్ తాజా సినిమా కోసం కాజ‌ల్‌ను కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆమెనే ఎంపిక చేయించిన‌ట్టు తెలుస్తోంది. అంత‌కు ముందు వ‌రుస ప్లాపుల‌తో ఉన్న కాజ‌ల్ ఖైదీ నెంబ‌ర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాల‌తో ఫామ్‌లోకి రావ‌డంతో ఇప్పుడు ఆమె భారీ రేటు డిమాండ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే సురేష్ సినిమాకు కూడా పారితోషికం భారీగా ముట్టచెబుతుండటంతో కాజల్ కూడా సరే అనేసిందట.  

 

కాజ‌ల్‌పై మ‌న‌సు ప‌డ్డ టాప్ ప్రొడ్యుస‌ర్ కొడుకు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts