రాజ‌మౌళి కాంపౌండ్లో మంచు విష్ణు

February 6, 2018 at 4:01 pm

ఈ వార్త నిజంగానే పెద్ద షాకింగ్ లాంటిది. రాజ‌మౌళితో సినిమాలు చేసేందుకు ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలు క్యూలో ఉంటున్నారు. ఈ టైంలో మంచు ఫ్యామిలీ వార‌సుడు మంచు విష్ణు రాజ‌మౌళి కాంపౌండ్‌లో ఉండ‌డం ఏంట‌న్న పెద్ద స‌స్పెన్స్ అంద‌రిలోనూ నెల‌కొంటుంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే మంచు వార‌సుడు మంచు విష్ణుకు కొద్ది రోజులుగా స‌రైన హిట్ లేదు.

Achari-America-Yatra-Trailer-Talk-Weary-And-Jaded-Vibes-

‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకురాబోతున్న మంచు విష్ణు త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆచారి అమెరికా యాత్రం త‌ర్వాత విష్ణు త‌న సొంత బ్యాన‌ర్ అయిన ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్చ్ బ్యాన‌ర్లో తెర‌కెక్కుతోన్న సినిమాలో న‌టించ‌డంతో పాటు అతడే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించ‌నున్నాడు.

ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రి, బాహుబ‌లి స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కథను అందిస్తుండటం విశేషం. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌థా మార్పులు, చేర్పులు వ్య‌వ‌హారాల‌న్ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ & రాజ‌మౌళి కాంపౌండ్లు న‌డుస్తున్నాయ‌ట‌. అది అస‌లు సంగ‌తి. ఇక హీరో విష్ణు మెగా ఫోన్ ప‌ట్టాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. 

1431057974-1697

ఇక ఇప్పుడు త‌న సొంత బ్యాన‌ర్‌లో తెర‌కెక్కే సినిమాతో తానే మెగా ఫోన్ ప‌డుతున్నాడు. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో ఆ కథతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట విష్ణు. ఈ సినిమాతో పాటు ‘భక్త కన్నప్ప’ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్న ఆలోచనలో విష్ణు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ను తనికెళ్ళ భరణి పూర్తి చేసినట్లు సమాచారం.

 

రాజ‌మౌళి కాంపౌండ్లో మంచు విష్ణు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts