ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

March 8, 2018 at 3:00 pm

2018-19 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సమాజంలో అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరిచేలా కొత్త పథకాలతో.. భారీ కేటాయింపులతో బ‌డ్జెట్ ఉంది. గురువారం ఉదయం రూ.1 లక్ష 91 వేల 063 కోట్ల‌తో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

 

అమరావతిలో వరుసగా రెండో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు.  అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని మంత్రి తెలిపారు.. రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గిపోయిందని, సమస్యల వలయంలో కూడా రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేశామని చెప్పారు. కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 10.96 శాతం వృద్ధిరేటు సాధించామని యనమల పేర్కొన్నారు.

 

బ‌డ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి….

– మొత్తం బడ్జెట్‌ రూ.లక్షా 91 వేల 63 కోట్లు

– రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు

– మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు

– ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు

– వృద్ధిరేటు : 10.96శాతం

– గ్రామీణాభివృద్ధికి రూ.20,815 కోట్లు

– సాగునీటి రంగానికి రూ.16,978 కోట్లు

– ఇరిగేషన్‌ విభాగం కింద పోలవరానికి రూ.9వేల కోట్లు

– సాంఘిక సంక్షేమ రంగానికి రూ.13,722 కోట్లు

– వ్యవసాయానికి రూ.12వేల 355 కోట్లు

– విద్యుత్‌ రంగానికి రూ.5వేల 52 కోట్లు

– పరిశ్రమలకు రూ.3వేల 78 కోట్లు

– రవాణా రంగానికి రూ.4వేల 653 కోట్లు

– పర్యావరణ రంగానికి రూ.4వేల 899 కోట్లు

– వెనుకబడిన వైశ్యులకు రూ. 35 కోట్లు

– కాపులకు రూ.వెయ్యి కోట్లు

– కాపు సామాజిక విద్యార్థులకు రూ.750 కోట్లు

– దూదేకులవారికి కేటాయింపులు.. 40 కోట్లు

– నాయీ బ్రాహ్మణులకు 30 కోట్లు

– వెనుకబడిన తరగతుల సంస్థకు 100 కోట్లు

– వాల్మీకీ బోయిలకు 50 కోట్లు

– విద్యారంగానికి రూ.24,180 కోట్లు

– సాంకేతిక విద్యకు రూ.818 కోట్లు

– క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1,635 కోట్లు

– వైద్యరంగానికి రూ.8,463 కోట్లు

– మంచినీరు, పారిశుద్ధ్యానికి రూ.2,623 కోట్లు

– గృహనిర్మాణానికి రూ.3,679 కోట్లు

– పట్టణాభివృద్ధికి రూ.7,740 కోట్లు

– సాంఘిక సంక్షేమానికి రూ.13,722 కోట్లు

– కార్మిక ఉపాధి కల్పలనకు రూ.902 కోట్లు

– సామాజిక భద్రతకు రూ.3వేల 29 కోట్లు

– సమాచార శాఖకు రూ.224 కోట్లు

– రుణమాఫీకి రూ.4100 కోట్లు

– వివిధ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు రూ.20 కోట్లు

– సాంస్కృతిక రంగం రూ.94.98 కోట్లు

– ఎన్టీఆర్‌ వైద్య సేవలు రూ.1000 కోట్లు

– స్టార్ట్‌ అప్‌లకు రూ.100 కోట్లు

– సామాజిక భద్రతకు రూ.3029 కోట్లు

– గృహ నిర్మాణానికి స్థలం సేకరింపునకు రూ.575 కోట్లు

– చంద్రన్న పెళ్లి కానుకల కింద బీసీలకు, ఎస్సీలకు చెరో రూ.100 కోట్లు

– మున్సిపల్‌ శాఖకు రూ.7,761 కోట్లు

– నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు

– ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.200 కోట్లు

– పారిశ్రామిక వాణిజ్య విభాగానికి రూ.3,075 కోట్లు

– ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కింద రూ.1000 కోట్లు

– రవాణా మరియు రోడ్డు భవనాల శాఖకు రూ.4,300 కోట్లు

– చేనేతల సంక్షేమానికి రూ.250 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts