ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్ర‌వుతున్నాడు… ఫ్రూప్స్ ఇవిగో

March 3, 2018 at 10:25 am

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త ఇటీవల బాగా స్ప్రెడ్ అయిన సంగ‌తి తెలిసిందే. 2011లో ఎన్టీఆర్ – ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు పెళ్లి అవ్వ‌గా ఈ దంప‌తుల‌కు ఇప్ప‌టికే నాలుగేళ్ల అభ‌య్‌రామ్ అనే కుమారుడు ఉన్నారు. ఇక ఇప్పుడు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి ఈ దంప‌తులు మ‌ళ్లీ పిల‌ల కోసం చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త్వరలో వారింట మరో చిన్నారి అడుగు పెట్టనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. 

 

అయితే దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయే సరికి అభిమానులు ఈ వార్తని లైట్ గా తీసుకున్నారు. కాని తాజాగా ఓ ఫంక్షన్ లో బేబి బంప్ తో మెరిసింది ప్రణతి. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్రజిని ‘కాలా’ టీజర్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మురిసిపోయారు. నందమూరి ప్యామిలీలోకి మరో ఆణిముత్యం రాబోతుందంటూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. 

 

ఎన్టీఆర్ – ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు ముందు అభ‌య్‌రామ్ కుమారుడు కావ‌డంతో ఇప్పుడు రెండో సంతానంగా అభ‌య్‌కు త‌మ్ముడు పుడ‌తాడా ?  లేదా ?  చెల్లి పుడుతుందా ? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. మే నెల‌లో ల‌క్ష్మి ప్ర‌ణ‌తి మ‌రో బేబీకి జ‌న్మ‌నివ్వ‌నుంద‌ని స‌మాచారం. ఎన్టీఆర్ ఈ నెలలో త్రివిక్రమ్ తో కలిసి తన సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.  ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ఈ యేడాది చివ‌ర నుంచి రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తాడు.ntr-wife

ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్ర‌వుతున్నాడు… ఫ్రూప్స్ ఇవిగో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts