గురి చూసి మోడీని కొట్టిన కొర‌టాల‌

March 8, 2018 at 1:19 pm

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో భ‌ర‌త్ అను నేను సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ టీజ‌ర్ రిలీజ్ అయిన రెండో రోజే ఏపీ రాజ‌కీయాలు మారిపోయాయి. దీంతో కొర‌టాల త‌న భ‌ర‌త్ అను నేను సినిమాకు, రాజ‌కీయాల‌కు లింక్ పెడుతూ క‌రెక్ట్ టైమింగ్‌తో రియాక్ట్ అయ్యాడు. 

 

భ‌ర‌త్ అను నేను టీజ‌ర్‌లో ఓ డైలాగ్ ఉంది. “చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒక్కసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే అతడ్ని మనిషి అనరు.” మహేష్ నటించిన భరత్ అనే నేను టీజర్ లో డైలాగ్ ఇది. ఇప్పుడీ డైలాగ్ ను తాజా రాజకీయాలకు వాడేశాడు కొరటాల. ఏపీకి గ‌తంలో న‌రేంద్ర మోడీ చేసిన ప్రామిస్‌ను గుర్తు చేసి అత‌డిని మ‌నిషిగా మారుద్దాం.. తెలుగు రాష్ట్రాలు రెండూ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే అని మీరు మ‌న‌స్ఫూర్తిగా న‌మ్ముతున్నారా ?  మోడీజీ అని కొర‌టాల ట్వీట్ చేశాడు.

 

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌ని కేంద్రం తేల్చి చెప్ప‌డంతో కొర‌టాల ఈ ట్వీట్ చేశాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై ఎందుకింత వివ‌క్ష‌, ఏపీని ఎందుకు చిన్న‌చూపు చూస్తున్నారంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏదేమైనా కొర‌టాల క‌రెక్టు టైమ్‌తో త‌న సినిమా డైలాగ్‌ను మోడీకి గురి చూసి కొట్టాడు. గతంలో అవినీతి, మాదక ద్రవ్యాల వాడకంపై సూటిగా స్పందించాడు. అప్పటి రాజకీయ పరిస్థితులపై సెటైర్లు కూడా వేశాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం ప్రకటించిన నేప‌థ్యంలో భ‌ర‌త్ అను నేను టీజ‌ర్‌ను క‌రెక్టుగా వాడాడు. దీంతో కొర‌టాల టైమింగ్ అదిరింద‌న్న ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గురి చూసి మోడీని కొట్టిన కొర‌టాల‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts