క‌ళ్యాణ్‌రామ్ ‘ ఎమ్మెల్యే ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌

March 23, 2018 at 9:48 am

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ లేటెస్ట్ సినిమా ఎమ్మెల్యే. ఇజం త‌ర్వాత గ్యాప్ తీసుకున్న క‌ళ్యాణ్‌రామ్ కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేశాడు. ల‌క్ష్మీక‌ళ్యాణం త‌ర్వాతబ్రేకింగ్‌: ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ బ్రేకా… క్యాన్సిలా…! ప‌దేళ్ల గ్యాప్ తీసుకుని క‌ళ్యాణ్‌రామ్ – కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌లిసి న‌టించారు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఆల్బ‌మ్ ఇప్ప‌టికే హైలెట్ అయ్యింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. మ‌రి ప్రీమియ‌ర్ల టాక్ ప్ర‌కారం ఎమ్మెల్యే ఎలా ఉందో చూద్దాం.

 

క‌థ ప‌రంగా చూస్తే ఇది ఓ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో ఉన్న‌దే. రెగ్యుల‌ర్ స్టోరీకి కొంచెం డిఫ‌రెంట్ యాంగిల్ ట‌చ్ చేశారు. ద‌ర్శ‌కుడిగా ఉపేంద్ర మాధ‌వ్ తొలి సినిమాతోనే స‌క్సెస్ అయ్యాడు. అయితే కొన్ని రొటీన్ సీన్ల‌ను మాత్రం కాస్త కొత్త‌గా ట్రై చేసి ఉంటే బాగుండేద‌నిపించింది. ద‌ర్శ‌కుడు స్క్రీన్ ప్లేలో కామెడీ, ఎమోష‌న‌ల్ ల‌వ్ ట్రాక్ హెచ్చు త‌గ్గుల‌ను మేనేజ్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

 

ఫ‌స్టాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో క‌ళ్యాణ్‌రామ్ కామెడీ స‌న్నివేశాలు బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ సీన్లు మాత్రం అద్భుతంగా క్లిక్ అయ్యాయి. విలన్ ఫ్యాక్టరీలో ఉన్న పిల్లలు హీరో కాపాడడం వంటి సీన్స్ అందరికి నచ్చుతాయి. సినిమా టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగా ఎమ్మెల్యే, రాజ‌కీయాలు అన్ని సెకండాఫ్‌లోనే ఉంటాయి. ఈ సీన్ల‌న్ని ఆక‌ట్టుకుంటాయి.

 

ఇక హీరో క‌ళ్యాణ్‌రామ్ – విల‌న్ ర‌వికిష‌న్ మ‌ధ్య సీన్లు కూడా సినిమా గ్రాఫ్ పెంచాయి. విలన్ రవి కిషన్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కాజల్ కూడా తన గ్లామర్ తో చాలానే ఆకట్టుకుంది. బ్రహ్మానందం – పృథ్వీ కామెడీ సీన్లు, యాక్ష‌న్ పార్టు కూడా హైలెట్‌. కళ్యాణ్ రామ్ తన గ్రాండ్ ఫాదర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలను అనుకరించ‌డం సిచ్యువేష‌న‌ల్‌గా బాగుంది. 

 

ఓవ‌రాల్‌గా నిర్మాణ విలువ‌లు, కామెడీ ఎపిసోడ్‌, యాక్ష‌న్ పార్ట్ హైలెట్లుగా నిలిస్తే రొటీన్ స్టోరీ, సాంగ్స్ మిస్ ప్లేస్‌మెంట్ మైన‌స్ అయ్యాయి. ఓవ‌రాల్‌గా మాత్రం ఎమ్మెల్యే మాస్ ప్రేక్ష‌కుల‌ను, నంద‌మూరి అభిమానుల‌ను మెప్పిస్తుంది. ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నంలోనే ఉపేంద్ర మాధ‌వ్ స‌క్సెస్ అయిన‌ట్టే. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి TJ 

క‌ళ్యాణ్‌రామ్ ‘ ఎమ్మెల్యే ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts