‘ఆచారి అమెరికా యాత్ర‌’ TJ రివ్యూ

April 27, 2018 at 2:41 pm

టైటిల్‌: ఆచారి అమెరికా యాత్ర‌

బ్యాన‌ర్‌: ప‌ద్మ‌జ పిక్చర్స్‌

జాన‌ర్‌: క‌ంప్లీట్ కామెడీ డ్రామా

న‌టీన‌టులు: మ‌ంచు విష్ణు, ప్ర‌గ్యా జైశ్వాల్‌

మ్యూజిక్‌: ఎస్ఎస్‌.థ‌మ‌న్‌

నిర్మాత‌లు: కీర్తి చౌద‌రి, కిట్టు

ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్‌రెడ్డి

ర‌న్ టైం : 135 నిమిషాలు

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

రిలీజ్ డేట్‌: 27 ఏప్రిల్‌, 2018

 

కెరీర్ ప‌రంగా ఇటీవ‌ల స‌రైన స‌క్సెస్‌లు లేక డీలాప‌డుతోన్న మంచు వార‌బ్బాయ్ మంచు విష్ణు న‌టించిన తాజా చిత్రం ఆచారి అమెరికా యాత్రం. విష్ణుకు గ‌త కొన్నేళ్ల‌లో చూస్తే జి.నాగేశ్వ‌ర్‌రెడ్డితోనే రెండు హిట్లు వ‌చ్చాయి. ఈడోర‌కం ఆడోర‌కం సినిమాతో పాటు దేనికైనా రెడీ సినిమాలు రెండూ వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌వే. ఈ రెండు సినిమాలు కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడు ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందిస్తుంద‌ని సినిమా టైటిల్‌, ట్రైల‌ర్లే చెప్పేశాయి. బ్ర‌హ్మానందం – విష్ణు కాంబినేష‌న్లో కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. విష్ణు స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మ‌రి ఈ ఆచారి ఎలా ఆక‌ట్టుకున్నాడో ?  TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

క‌థ‌, క‌థ‌నం – పాజిటివ్‌లు :

చ‌క్ర‌పాణి (కోట శ్రీనివాస‌రావు)కు వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. మ‌న‌వ‌రాలు రేణుక (ప్ర‌గ్యా జైశ్వాల్‌) అంటే ప్రాణం. ఆమె కోసం చ‌క్ర‌పాణి 9 రోజులు హోమం చేయాల‌ని ప్లాన్ చేస్తాడు. ఈ హోమం బాధ్య‌త‌లు అప్పలాచారి (బ్రహ్మానందం) ఆయన శిష్యుడు కృష్ణమాచారి (మంచు విష్ణు)లకు అప్పగిస్తారు. హోమం చేసే క్ర‌మంలో రేణుక‌, కృష్ణ‌మాచారి ప్రేమ‌లో ప‌డ‌తారు. హోమం క్లైమాక్స్‌లో చ‌క్ర‌పాణి చ‌నిపోతాడు. హోమం పొగ కారణంగానే చక్రపాణి చనిపోయాడని ఆయన అల్లుడు సుబ‍్బరాజు ( ప్రదీప్‌ రావత్‌).. అప్పలాచారి, కృష్ణమాచారిలను చంపాలనుకుంటాడు. అక్క‌డ నుంచి వాళ్లు అమెరికా పారిపోతారు. కృష్ణ‌మాచారి అమెరికా ఎందుకు వెళ్లాల‌నుకున్నాడు. చ‌క్ర‌పాణి అస‌లు ఎలా చ‌నిపోయాడు ?  ఫైన‌ల్‌గా రేణుక‌, కృష్ణ‌మాచారి ఎలా ఒక్క‌ట‌య్యారు ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

 

మంచు విష్ణు గ‌తంలో దేనికైనా రెడీ సినిమాలో చేసిన క్యారెక్ట‌ర్‌నే అటూ ఇటూ తిప్పి చేశాడా ? అన్న‌ట్టుగా ఉన్న ఉన్నంత‌లో కామెడీ పండించే ప్ర‌య‌త్నం చేశాడు. యాక్ష‌న్ సీన్స్‌లో విష్ణు న‌ట‌న బాగుంది. ప్ర‌గ్య జైశ్వాల్ అందంతో క‌ట్టిప‌డేసే ప్ర‌య‌త్నం చేసింది. అభిన‌యంతో మెప్పించి… గ్లామ‌ర్‌తో ఫిదా చేసింది. అనూప్‌సింగ్ ఠాకూర్‌కు తెర‌మీద క‌న‌ప‌డేందుకు ఎక్కువ స్కోప్ లేక‌పోయినా ఉన్నంత‌లో మంచి విల‌నిజం పండించాడు. మిగిలిన వాళ్లు పాత్ర‌ల వ‌ర‌కే పాస్ మార్కులేయించుకున్నారు. సినిమాటోగ్రఫి బాగుంది. అమెరికా లోకేషన్లతో పాటు పాటలు విజువల్‌గా బాగున్నాయి. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

 

మ‌రికొన్ని ప్ల‌స్‌లు (+) :

– అక్క‌డ‌క్క‌డా కొన్ని న‌వ్వులు

– మంచు విష్ణు న‌ట‌న‌

– ప్ర‌గ్య జైశ్వాల్ అందాలు

 

నెగిటివ్‌లు :

నాగేశ్వ‌ర్‌రెడ్డి చివ‌రి రెండు సినిమాలు ప్లాప్ కావ‌డంతో ప్ర‌యోగాలు చేయ‌కుండా ఓ పాత క‌థ‌ను తీసుకుని దానికి పాత క‌థ‌నం, కామెడీ ట‌చ్ ఇచ్చి సినిమా తీసేశాడు. పాత క‌థ‌ను తీసుకున్న‌ప్పుడు కొత్త‌గా ప్ర‌జెంట్ చేయాల‌న్న విష‌యాన్ని ద‌ర్శ‌కుడు మ‌ర్చిపోవ‌డంతో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి పెద్ద ప‌రీక్షే పెట్టాడు. ఎప్పుడో మూడు నెల‌ల క్రింద‌ట రావాల్సిన ఈ సినిమాను కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్‌ చేసినా.. సినిమాలో ఆ స్థాయి కామెడీ ఎక్కడా కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. బ్ర‌హ్మానందం సినిమా మొత్తం ఉన్నా ఆ పాత్ర న‌వ్వు తెప్పించ‌లేదు. 

 

ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌ర్ రెడ్డి ఫ‌స్టాఫ్ ఏదోలా న‌డిపించినా సెకండాఫ్ పూర్తిగా విసుగు తెప్పించాడు. పాటల ప్లేస్‌మెంట్ మిస్‌, క‌థ‌నంలో ద‌మ్ములేదు. కామెడీ పండ‌లేదు. కొద్ది రోజులుగా వాయిదాలు ప‌డుతూ వ‌స్తోన్న ఈ సినిమా చివ‌ర‌కు ఆడియెన్స్ ఆశ‌ల‌ను కామెడీ చేసింది. 

 

మ‌రికొన్ని మైన‌స్‌లు (-):

– రొటీన్ క‌థ‌, క‌థ‌నాలు

– లాజిక్ లేని సీన్లు

– డైరెక్ష‌న్‌

– కామెడీ అని చెప్పి అది మిస్ చేయ‌డం

 

ఫైన‌ల్‌గా…

ఆచారి అదే సేమ్ ఓల్డ్ కామెడీ

 

ఆచారి అమెరికా యాత్ర TJ రేటింగ్ : 2 / 5

 

‘ఆచారి అమెరికా యాత్ర‌’ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts