‘సాక్ష్యం’ ఆఫీసియల్ టీజర్

April 18, 2018 at 2:55 pm

గ‌తేడాది జయ జానకి నాయక సినిమాతో హిట్ కొట్టిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్‌ సినిమా ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రకృతిలోని పంచభూతాలు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. అందుకే సినిమాపై అంద‌రిలోనూ మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. సినిమా టీజ‌ర్‌లో ప‌ల్లెటూరి నేప‌థ్యంతో పాటు కాశీలో ఉండే మునులు క‌నిపిస్తున్నారు. ఓవ‌రాల్‌గా చూస్తుంటే పంచ‌భూతాల స్టోరీతో పాటు సినిమాలో యాక్ష‌న్‌కు తిరుగు ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

1.44 నిమిషాల నిడివి ఉన్న టీజ‌ర్‌లో సినిమాటోగ్ర‌ఫీతో పాటు ఆర్ట్ వ‌ర్క్ బాగుంది. యాక్ష‌న్ షాట్లు కూడా అద‌రగొట్టాయి. ఓవ‌రాల్‌గా సాక్ష్యం టీజ‌ర్ ఫుల్ మంచి క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండ‌డంతో పాటు సినిమాపై హైప్ పెంచింది. ఇక ప్ర‌స్తుతం సాక్ష్యం చివ‌రి షెడ్యూల్ యూఎస్‌లో జ‌రుపుకుంటోంది. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ నామా అభిషేక్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 

డిక్టేట‌ర్ త‌ర్వాత శ్రీవాస్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. జూన్ 14న విడుదలకానున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా నటిస్తుండగా శరత్ కుమార్, జగపతిబాబు, వెన్నెల కిశోర్ లు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 

‘సాక్ష్యం’ ఆఫీసియల్ టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts