TJ రివ్యూ: మ‌హాన‌టి

May 9, 2018 at 1:39 pm

TJ రివ్యూ: మ‌హాన‌టి

 

టైటిల్‌: మ‌హాన‌టి

నిర్మాణ సంస్థలు: వైజ‌యంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌

జాన‌ర్‌:  దిగ్గ‌జ న‌టి సావిత్రి బ‌యోపిక్‌

న‌టీన‌టులు: కీర్తి సురేశ్‌, మోహ‌న్‌బాబు, నాగ‌చైత‌న్య‌, ప్రకాశ్‌రాజ్‌, క్రిష్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, దుల్కర్ స‌ల్మాన్‌, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, భానుప్రియ‌, మాళ‌వికానాయ‌ర్‌, షాలిని పాండే, తుల‌సి, దివ్యవాణి, తరుణ్ భాస్కర్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: మిక్కీ జే మేయ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ: డానీ షాంజెక్ లోఫెజ్

ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వర రావు

నిర్మాత‌: ప్రియాంక ద‌త్‌

ద‌ర్శ‌క‌త్వం:  నాగ్ అశ్విన్‌

సెన్సార్ రిపోర్ట్‌:  క్లీన్ యు 

రిలీజ్ డేట్‌: 9 మే, 2018

 

తెలుగు ప్రేక్షకులు దాదాపు రెండు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘మహానటి’. తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే  మ‌ర‌పురాని మ‌హాన‌టి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించగా ముఖ్య పాత్రలో సమంత నటించింది. ఈ చిత్రంలో ఇంకా దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, మోహన్‌బాబు, క్రిష్‌, షాలిని పాండే ఇంకా ప్రముఖ నటీనటులు నటించారు. రిలీజ్‌కు ముందే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని… భారీ హైప్‌తో ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా అంచ‌నాలు ఎంత వ‌ర‌కు అందుకుంది ?  మ‌హాన‌టి మ‌న‌ల‌ను సావిత్రి జీవితాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించిందా ?  అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

క‌థ‌, క‌థ‌నం & విశ్లేష‌ణ‌ :

బెంగళూరులోని చాళుక్య హోటల్‌లో తీవ్ర అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లిపోయిన సావిత్రి (కీర్తి సురేష్‌)  కోమాలోకి వెళ్ల‌డంతో క‌థ స్టార్ట్ అవుతుంది. అక్క‌డ జ‌నాలు అంద‌రూ ముందుగా ఆమెను సాధార‌ణ మ‌హిళ‌గానే చూసినా త‌ర్వాత ఆమె సావిత్రి అని తెలియ‌డంతో ఆమెను చూసేందుకు ఆసుప‌త్రికి జ‌నాలు తండోప‌తండాలుగా వ‌స్తారు. అదే టైంలో ప్ర‌జావాణి ప‌త్రిక‌లో మ‌ధుర‌వాణి (స‌మంత‌) జ‌ర్న‌లిస్టుగా చేరుతుంది. ఆమె సావిత్రి క‌థ రాస్తుంటుంది. ఆమెకు తోడుగా ఫొటో జ‌ర్న‌లిస్టు విజ‌య్ ఆంటోనీ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) సాయం చేస్తుంటాడు. ఇక సావిత్రి కోమాలోకి వెళ్లే ముందు క‌లిసి శంక‌ర‌య్య అనే వ్య‌క్తి ఎవ‌రు ?  ఆమె బాల్య ద‌శ నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎలా ఎదిగింది ? అప్ప‌టికే రెండు పెళ్లిళ్లు అయిన జెమినీ గ‌ణేష‌న్‌ను ఆమె ఎందుకు పెళ్లాడింది ?  చివ‌ర‌కు ఆమె కెరీర్ ఎలా ప‌త‌న‌మైంది ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ మ‌హాన‌టి.

 

విశ్లేష‌ణ ప‌రంగా చూస్తే అతి సామాన్య కుటుంబం నుంచి ఎన్నో కష్టనష్టాలను అధిగమించి సినీ పరిశ్రమలో అడుగుపెడుతుంది. అంచెలంచెలుగా స్టార్ హీరోయిన్ అయిన ఆమె అప్పటికే పరిశ్రమలో హీరోగా ఉన్న జెమిని గణేషన్ తో ప్రేమలో పడుతుంది. ఆ వెంటనే పెళ్ళి కూడా చేసుకుంటుంది. అయితే అప్పటికే జెమిని గణేషన్ కు పెళ్ళి అయి పిల్లలు కూడా ఉంటారు. ఈ విషయం తెలిసి కూడా సావిత్రి పెళ్ళి చేసుకుంటుంది. ఆ తర్వాత జెమిని గణేషన్ సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతుండం జ‌రుగుతాయి. ఓ వైపు ఆయ‌న‌కు అవ‌మానాలు…ఇటు సావిత్రికి స‌న్మానాలు దీంతో జెమినీ సావిత్రిని చూసి ఓ విధంగా ఈర్ష్య‌కు గుర‌వ్వ‌డం చివ‌ర‌కు వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు ఇలా ఈ సినిమా కంటిన్యూ అవుతుంది. 

 

చివ‌ర‌కు జెమినీ గ‌ణేష‌న్ మ‌రో అమ్మాయితో ఉండ‌డాన్ని చూసిన సావిత్రి తీవ్రంగా బాధ‌ప‌డుతుంది. అంతే సావిత్రికి..జెమిని గణేషన్ కు అప్పటి నుంచి సంబంధాలు తెగిపోతాయి. ఆ క్రమంలో మందుకు బానిసగా మారిన సావిత్రి తన కెరీర్ ను…జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుంది. సినీ రంగంలో ఎంతోమందికి విరివిగా గుప్త‌దానాలు చేసిన ఆమెను చివ‌రి క్ష‌ణాల్లో ఎవ్వ‌రూ ఆదుకోరు. ఈ లైన్‌తో ద‌ర్శ‌కుడు సినిమాను మ‌న‌స్సును హ‌త్తుకునేలా, ఆమె జీవితం ఇలా ముగిసిందా ?  అని ఎంతో బాధ‌ప‌డేలా ప్ర‌జెంట్ చేశాడు.

 

పాజిటివ్‌లు :

ఆ పాత్రలో కీర్తిసురేష్‌ ఒదిగిపోయింది. కీర్తి తెరపై కనపడిన ప్రతీ సన్నివేశంలో మనకు సావిత్రి కనిపిస్తారు. అంత చక్కగా నటించింది. మధురవాణిగా సమంత నటన ఆకట్టుకుంది. సావిత్రి జీవిత విశేషాలను పరిశోధించే వ్యక్తిగా ఆ పాత్రలో జీవించింది. ఫొటో జర్నలిస్ట్‌గా విజయ్‌ అలరిస్తాడు. ఆ కాలం నాటి పరిస్థితులను పునః సృష్టించేందుకు చిత్ర బృందం చాలా కష్టపడింది. ప్రతి సన్నివేశంలో ఆ కష్టం కనిపిస్తుంది. మిక్కీ జె.మేయర్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్‌.. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య.. ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు.. జర్నలిస్ట్ మధురవాణిగా సమంత.. ఫోటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీగా విజయ్ దేవకొండ.. ఎస్వీఆర్‌గా మోహన్ బాబు.. సుశీలగా శాలినీ పాండే.. మాలివికగా అలమేలు… కెవి రెడ్డిగా క్రిష్.. కెవి చౌదరిగా రాజేంద్రప్రసాద్.. ఆలూరి చక్రపాణిగా ప్రకాష్ రాజ్ తదితర భారీ తారాగణం ఈ సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యారు.

 

సాంకేతికంగా ఈ సినిమా కోసం అశ్వ‌నీద‌త్ ఫ్యామిలీ ఆయ‌న కుమార్తెలు ఎక్క‌డా రాజీప‌డ‌లేదు. చాలా హై లెవ‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో మ‌హాన‌టిని తెర‌కెక్కించారు. 1940, 60, 80 కాలం నాటి సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా గురించి చాలా రీసెర్చ్ చేసి మరి సినిమా తీశారు. మిక్కి జే మేయర్ సంగీతం బాగుంది. నేప‌థ్య సంగీతం సినిమాను మ‌రో మెట్టు ఎక్కించింది. సినిమాటోగ్రఫీ అద్భుతం.

 

నెగిటివ్‌లు :

సినిమా సెకండాఫ్‌లో కొన్ని చోట్ల లాగ్ అయ్యింది. అయినా ప్రేక్ష‌కుడు క‌థ‌నంతో ఎక్క‌డా డిస్‌క‌నెక్ట్ అవ్వ‌డు. హెవీ స్టోరీ నేప‌థ్యంలో క‌థ‌నం కాస్త స్లో అయ్యిందంతే. ఇక రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కోరుకునే వారికి ఈ సినిమా ఎంత వ‌ర‌కు న‌చ్చుతుందో ?  చూడాలి. నాలుగు హాట్ హాట్ పాటలు..జోకుల కోసం సినిమాకు పోతే నిరాశ తప్పదు 

 

నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ క‌ట్స్ :

సావిత్రి జీవితాన్ని తెర‌కెక్కించాల‌నుకోవ‌డ‌మే పెద్ద సాహ‌సం. అది నాగ్ అశ్విన్ లాంటి జూనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఈ ప్ర‌య‌త్నం చేశాడంటే చాలా పెద్ద రిస్క్ చేసిన‌ట్టే. మహానటి  స్క్రిప్ట్‌ వర్క్‌ను దాదాపు మూడు సంవత్సరాల పాటు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేయడం జరిగింది. సావిత్రిపై అభిమానంతో ఆమె జీవిత చరిత్ర సినిమాను తెరకెక్కించాలని చాలా రిస్క్ చేశాడు. ఆమె గురించి ఎంతోమందిని క‌లిసి ఎన్నో విష‌యాలు తెలుసుకుని రంగంలోకి దిగాడు. 

 

ఇక సినిమా చూస్తే న‌టీన‌టుల ఎంపిక ద‌గ్గ‌ర ఎంత జాగ్ర‌త్త వ‌హించాడో తెలుస్తోంది. పాత్ర‌ల‌కు న‌టీన‌టుల‌ను ఎంపిక చేయ‌డంలోనే నాగ్ స‌గం స‌క్సెస్ అయ్యాడు. తెలిసిన కథను సంపూర్ణంగా సినిమాగా చెప్పడంలో చాలా తెలివితేటలు ఉండాలి. సావిత్రిగా తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న మహానటి జీవిత కథను సినిమాగా తెరకెక్కించిన తీరు అద్బుతమని చెప్పొచ్చు. దర్శకుడు సావిత్రి జీవితంలో ముఖ్య ఘట్టాలను చాలా క్లారిటీతో తెరకెక్కించాడు.

 

ఫైన‌ల్‌గా…

మ‌న‌స్సును క‌దిలించే మ‌హా ప్ర‌య‌త్న‌మే మ‌హాన‌టి

 

TJ సూచ‌న‌:  సావిత్రి కోసం ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా చూసే మ‌హాన‌టి

 

మ‌హాన‌టి TJ  రేటింగ్‌: 3.5 / 5

TJ రివ్యూ: మ‌హాన‌టి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts