‘నా పేరు సూర్య’ TJ రివ్యూ

May 4, 2018 at 9:11 am

టైటిల్‌: నా పేరు సూర్య‌

బ్యాన‌ర్‌:  రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: స‌్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌, అనూ ఎమ్యాన్యుయేల్‌, శ‌ర‌త్‌కుమార్‌, అర్జున్‌, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ:  రాజీవ్ ర‌వి

మ్యూజిక్‌:  విశాల్ శేఖ‌ర్‌

ఎడిటింగ్‌:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాత‌లు: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీథ‌ర్ – బ‌న్నీ వాస్‌

ద‌ర్శ‌క‌త్వం: వ‌క్కంతం వంశీ

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

ర‌న్ టైం : 167 నిమిషాలు

వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ :  రూ. 75 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ :  రూ. 111 కోట్లు

రిలీజ్ డేట్‌: 04 మే, 2018

 

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ గ‌త నాలుగేళ్ల‌లో సౌత్ ఇండియాలోనే టాప్ సూప‌ర్ పాపుల‌ర్ హీరోల‌లో ఒక‌రిగా ఎదిగాడు. రేసుగుర్రం నుంచి రేసులో గుర్రంలా దూసుకుపోతోన్న బ‌న్నీ యావ‌రేజ్ సినిమాల‌తో కూడా సులువుగానే రూ.100 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొడుతున్నాడు. డీజే త‌ర్వాత బ‌న్నీ తాజాగా న‌టించిన సినిమా నా పేరు సూర్య‌. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల‌కు స్టోరీలు ఇచ్చి స్టార్ స్టోరీ రైట‌ర్‌గా పేరు తెచ్చుకున్న వ‌క్కంతం వంశీ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ల‌గ‌డ‌పాటి శ్రీథ‌ర్ – బ‌న్నీ వాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించింది. బ‌న్నీ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం సీరియ‌స్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మ‌రి ఈ సూర్య ఎంత వ‌ర‌కు అంచ‌నాలు అందుకున్నాడో TJ  స‌మీక్ష‌లో చూద్దాం.

 

స్టోరీ :

ఆర్మీలో ప‌నిచేసే సూర్య (బ‌న్నీ) అక్క‌డ ఓ సీనియ‌ర్ ఆఫీస‌ర్ లంచం అడిగాడ‌ని అత‌డిని కొట్ట‌డంతో క‌ల్న‌ల్ అత‌డిని ఆర్మీ నుంచి స‌స్పెండ్ చేస్తాడు. బోర్డ‌ర్‌కు వెళ్లాల‌న్న అత‌డి ఏడేళ్ల కోరిక తీరాలంటే సూర్య తండ్రి సైన్ చేసిన‌ స‌ర్టిఫికెట్ 

కావాని కండీష‌న్ పెడ‌తారు. ప‌దేళ్ల క్రిత‌మే సూర్య బిహేవియ‌ర్ న‌చ్చ‌క అత‌డిని టోట‌ల్‌గా ఫ్యామిలీ దూరం పెట్టేస్తుంది. ప్ర‌పంచంలోనే టాప్ సైకాల‌జీ ప్రొఫెస‌ర్ అయిన సూర్య తండ్రి రామ‌కృష్ణంరాజు (అర్జున్‌) సూర్య‌కు సంత‌కం పెట్ట‌డానికి ఎలాంటి కండీష‌న్లు పెట్టాడు ? ఈ క్ర‌మంలోనే సూర్య తాను ఎంత‌గానో ప్రేమించిన వ‌ర్ష (అను ఎమ్మాన్యుయేల్‌)కు ఎందుకు దూర‌మ‌య్యాడు ? ఈ జ‌ర్నీలో చ‌ల్లా (శ‌ర‌త్‌కుమార్‌)తో అత‌డికి ఎందుకు వైరం వ‌చ్చింది ?  చివ‌ర‌కు ఏ మాత్రం కోపం అణుచుకోలేని సూర్య ప్ర‌వ‌ర్త‌న మార్చుకున్నాడా ? వ‌ర్ష ప్రేమ‌ను గెలుచుకున్నాడా ?   మ‌రి దేశం కోసం సూర్య ఏం చేశాడు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌రే ఈ సినిమా.

 

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

న‌టీన‌టుల్లో బ‌న్నీ పుల్ సీరియ‌స్ రోల్‌లో కెరీర్‌లోనే కొత్త‌గా ట్రై చేశాడు. క్యాప్ ట్రిక్స్ లాంటి కొత్త స్టెప్పులు వేశాడు. బ‌న్నీ ఎంత బాగా చేసినా ద‌ర్శ‌కుడు అత‌డిని వాడుకోలేదు. హీరోయిన్ అను ప‌ట్టుమ‌ని ఏడెనిమిది సీన్ల‌లో కూడా లేదు. అస‌లు ఆమె సినిమాలో పాట‌ల కోస‌మే ఉంది. ఇక హీరో తండ్రిగా అర్జున్ బాగానే చేసినా హీరోకు, అర్జున్‌కు మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్ల‌ను ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయ్యేలా లేవు. ద‌ర్శ‌కుడి అవగాహ‌నా, అనుభ‌వ రాహిత్యం పెద్ద మైన‌స్‌. మిగిలిన వాళ్ల‌లో విల‌న్‌గా చ‌ల్లా రోల్‌లో శ‌ర‌త్‌కుమార్‌, అత‌డి కొడుకుగా అనూప్‌సింగ్ ఠాకూర్‌, వీళ్లింట్లో బ‌క‌రాగా ఉండే ప్ర‌దీప్‌సింగ్ రావ‌త్‌, హీరో త‌ల్లిగా న‌దియా, వెన్నెల కిషోర్, పోసాని ఇలా వీళ్లంద‌రి కేరెక్ట‌ర్‌ల గురించి చెప్పుకోవ‌డానికి, మాట్లాడుకోవ‌డానికి ఏం లేదు.

 

విశ్లేష‌ణ :

ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు క‌థ ఇచ్చిన వ‌క్కంతం వంశీ మెగా ఫోన్ ప‌డుతున్నాడు అన‌గానే ఎన్నో అంచ‌నాలు ప్రేక్ష‌కుల్లో ఉన్నాయి. బ‌న్నీ హీరో కావ‌డంతో బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఉన్న సినిమాను ప్రేక్ష‌కులు ఊహించుకున్నారు. ఓ వీక్ క‌థ‌తో మెగాఫోన్ ప‌ట్టిన వంశీ ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ ఎస్టాబ్లిష్ చేసేందుకే 45 నిమిషాలు వేస్ట్ చేసేశాడు. ఇక సినిమా ఏం ఉంటుందో ఊహించుకోవ‌చ్చు… సినిమా స్టార్ట్ అయ్యాక 50 నిమిషాల‌కు కాని హీరోయిన్ ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌దు. ఆర్మీలో ప‌నిచేసే హీరో అక్క‌డ లంచం అడిగాడ‌ని ఓ సీనియ‌ర్ ఆఫీస‌ర్‌ను కొట్ట‌డంతో స‌స్పెండ్ చేస్తారు. అప్ప‌టికే ఏడేళ్లుగా ఎన్నో త‌ప్పులు చేస్తుండ‌డంతో చివ‌ర‌కు హీరో తండ్రి అయిన అర్జున్ హీరో కేరెక్ట‌ర్ గురించి కండ‌క్ట్ స‌ర్టిఫికెట్ ఇచ్చేలా సైన్ చేస్తేనే హీరో కోరిక అయిన బోర్డ‌ర్‌కు పంపుతాన‌ని క‌ల్న‌ల్ ఆదేశాల‌తో ఇంటికి వ‌స్తాడు. హీరోకు చిన్న‌ప్ప‌టి నుంచే ప్ర‌తి చిన్న విష‌యానికి ప‌ట్ట‌రాని కోపం.. ఫైట్లు, గొడ‌వ‌లు చేస్తుండ‌డంతో ఈ క్ర‌మంలోనే ఫ్యామిలీకి దూరంగా 10 ఏళ్లుగా ఉంటాడు. తండ్రి సంత‌కం కోసం అత‌డు పెట్టిన ప‌రీక్ష ప్రేక్ష‌కుల పాలిట పెద్ద స‌హ‌నంగా మారుతుంది. హీరోయిన్ హీరోను చూసి తొలి చూపులోనే ల‌వ్‌లో ప‌డే సీన్ చూస్తే ఎంత బోరింగ్‌గా ఉందో అస‌లు ద‌ర్శ‌కుడు ఏ కాలంలో ఉన్నాడో అనిపించ‌క‌మాన‌దు. హీరోకు తండ్రికి మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లు కూడా క‌నెక్ట్ కాలేదు. హీరో – హీరోయిన్ల మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ అందులోనూ బ‌న్నీ ఉంటే మామూలు ద‌ర్శ‌కుడు కూడా ఓ రేంజ్‌లో ల‌వ్ సీన్లు రాసుకుంటాడు. వంశీ మ‌రీ తుప్పుప‌ట్టిపోయిన క‌థ‌నంతో ప్ర‌జెంట్ చేశాడు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కూడా ఏమంత ఆస‌క్తిగా లేదు.

 

ఇక సెకండాఫ్ అయినా ఏదో ఉంటుంద‌ని ఆశించిన ప్రేక్ష‌కుడికి మ‌రింత త‌ల‌నొప్పి స్టార్ట్ అవుతుంది. ఫ‌స్టాఫ్ వ‌ర్సెస్ సెకండాఫ్‌లో ఏదీ చెత్త‌గా ఉంది అనే విష‌యంలో ఈ రెండూ హాఫ్‌లు పోటీ ప‌డ్డాయంటే సినిమా ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. అక్క‌డ‌క్క‌డా కొన్ని ఎమోష‌న‌ల్ సీన్లు ఉన్నా ప్రేక్ష‌కుడు ఏమాత్రం క‌నెక్ట్ అయ్యేలా లేవు. అస‌లు ద‌ర్శ‌కుడు క‌నెక్ట్ చేయ‌లేక‌పోయాడు. ముస్తాఫా ఫ్యామిలీని విల‌న్ల నుంచి కాపాడే ఫైట్ సీన్ ఓ రేంజ్‌లో ఉండాలి… ఆ సీన్ పూర్తిగా తేలిపోయింది. సెకండాఫ్ చాలా వ‌ర‌కు అయ్యాక సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడు హీరోయిన్ ఉంద‌న్న విష‌యం మ‌ర్చిపోయాక ఆమె రావ‌డం సాంగేసుకుని మ‌ళ్లీ వెళ్లిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. సెకండాఫ్ స‌గం దాటాక ప్రేక్ష‌కుడు తెర‌మీద క‌దులుతున్న సీన్లు చూస్తూ త‌ల‌ప‌ట్టుకుంటాడు. అస‌లు క‌థ ఎక్క‌డ స్టార్ట్ అయ్యి ఎటు మ‌లుపులు తిరిగి ఎలా పోతుందో ?  కూడా అర్థం కాదు. అస‌లు ఇది బ‌న్నీ సినిమాయా అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. చివ‌ర‌కు తండ్రిని చంపేశార‌ని ఈ దేశం నాది కాదు అని బ‌య‌ట‌కు వెళ్లి ఉగ్ర‌వాదుల్లో చేరిన ముస్త‌ఫా తిరిగి ఇంటికి వ‌చ్చేందుకు బ‌న్నీ వేసిన ఎత్తులు చాలా చెత్త‌గా ఉన్నాయి. అప్ప‌టికే స‌హ‌నం కోల్పోయి నీర‌సించిన ప్రేక్ష‌కుడు ఈ క్లైమాక్స్ చూశాక త‌ల ప‌ట్టుకుని ఏంట్రా బాబు ఇంత రాడ్ వేశాడు అని బ‌య‌ట‌కు వ‌చ్చారు. నిజంగా దేశ‌భ‌క్తిని మేళ‌వించిన సినిమా తీయాలంటే కృష్ణ‌వంశీ ఎప్పుడో 17 ఏళ్ల క్రితం తీసిన ఖ‌డ్గం సినిమా చూడాల్సిందే. ఆ సినిమాలో ప‌దో వంతు కూడా ఈ సినిమా స‌రిపోదు.

 

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :

టెక్నిక‌ల్‌గా చూస్తే ఈ సినిమాలో విశాల్  – శేఖ‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు క‌లిసి అందించిన నేప‌థ్య సంగీతం సూప‌ర్‌. టెక్నిక‌ల్ వాల్యూస్‌లో ఫ‌స్ట్ ర్యాంకు దీనికే ప‌డుతుంది. పాట‌ల క‌న్నా నేప‌థ్య సంగీతం చ‌క్క‌గా కుదిరింది. మ‌నం ఇటీవ‌ల తెలుగు సినిమాల్లో దేవిశ్రీ, థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం చూసి ప‌ర‌మ రొటీన్‌గా ఫీల్ అవుతున్నాం… వీళ్ల నేప‌థ్యంతో కంపేరిజ‌న్ చేస్తే మ‌నం సూర్య నేప‌థ్య సంగీతంతో కొత్త అనుభూతికి లోన‌వుతాం. ఫైట్స్ బాగున్నాయి. ఆర్మీ క్యాంప్‌లో ఫ‌స్ట్ ఫైట్ బాగా డిజైన్ చేశారు. సినిమాకు యాక్ష‌నే ప్ర‌ధాన బ‌లం. ఇటీవ‌ల చిన్న సినిమాల‌కు కూడా సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటోంది. నా పేరు సూర్య సినిమాకు రాజీవ్ ర‌వి అందించిన కెమేరా వ‌ర్క్ ఏ మాత్రం చూడాల‌నిపించ‌లేదు. అన్ని క్లోజ‌ఫ్ షార్ట్‌లే అయినా చాలా సీన్ల‌కు లైటింగ్ డ‌ల్ అయ్యింది. ఒక్క మంచి ఫ్రేమ్ కూడా లేదంటే సినిమాటోగ్రాఫ‌ర్ ఎలా తీశాడో అర్థ‌మ‌వుతోంది. అస్స‌లు నిండుగా ఉన్న ఒక్క క‌ల‌ర్‌ఫుల్ సీన్ కూడా లేదు. సినిమాలో ఆర్ట్ వ‌ర్క్‌కు స్కోప్ లేదు.. ఉన్న చోట్ల కూడా వాడ‌లేదు. సీనియ‌ర్ ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావుకే ఈ సినిమాను ఎటు నుంచి ఎలా క‌ట్ చేయాలో అర్థం కాలేదంటే ద‌ర్శ‌కుడు వంశీ ఎంత పేల‌వ‌మైన సీన్లు ఆయ‌న టేబుల్ మీద పెట్టాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక బ‌డ్జెట్ చాలా త‌క్కువ‌లో లాంగిచేశార‌ని ఓపెన్‌గానే తెలిసిపోతుంది. ఒక‌టి రెండు సాంగ్‌ల‌కు త‌ప్ప ఖ‌ర్చు పెట్టేందుకు నిర్మాత‌ల‌కు మ‌న‌స్సు ఒప్ప‌లేదు. 

 

వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్ క‌ట్స్ :

ఎన్నో హిట్ సినిమాల‌కు స్టోరీలు ఇచ్చిన వంశీ మెగా ఫోన్ ప‌డుతున్నాడు అంటే ఎంతో బ‌ల‌మైన క‌థతో సినిమా తీస్తాడ‌ని అనుకున్న వాళ్లు బొక్క బోర్లా ప‌డ్డారు. అత‌డు ఆర్మీ ఆఫీస‌ర్ నేప‌థ్యంలో ఎంచుకున్న క‌థ చాలా వీక్. బ‌న్నీ ఆర్మీలో దేశంకోసం ఏదేదో చేస్తాడ‌నుకుంటే అక్క‌డా చేసిందేమి లేదు.. ఇక్క‌డ ఇంటికి వ‌చ్చాక ఇక్క‌డ స‌మాజంలో మార్పు కోసం చేసిందేమి లేదు. 168 నిమిషాల క‌థ‌నంలో హీరో కేరెక్ట‌ర్ ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్ష‌కుడికి చెప్పేందుకే ఏకంగా 40 నిమిషాల టైం వేస్ట్‌. అస‌లు హీరో, హీరోయిన్ల మ‌ధ్య పేల‌వ‌మైన ల‌వ్ ట్రాక్‌, హీరోకు తండ్రి అర్జున్‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బ‌లంగా ఉంటే చాలు సినిమా రేంజ్ మారేది… అక్క‌డ కూడా ద‌ర్శ‌కుడు ప‌నిత‌నం ఏమంత గొప్ప‌గా లేదు. అస‌లు క‌థా ర‌చ‌యిత అయిన వంశీ ఈ సినిమాకు క‌థా ర‌చ‌యిత‌గానే ముందు ఫెయిల్ అయ్యాడు. ఇక స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్‌. ఎక్క‌డా ఆస‌క్తిగా లేదు. డైరెక్ష‌న్ అయితే అత‌డి రాలేద‌ని… బ‌న్నీ లాంటి హీరోను అత‌డు హ్యాండిల్ చేయ‌లేడ‌ని అర్థ‌మైపోయింది. అయితే మాట‌ల ర‌చ‌యిత‌గా మాత్రం కొన్ని మెరుపులు మెరిపించాడు. మంచి మాట‌లు రాసుకున్నాడు. ఇక ఈ సినిమా క‌థ‌ను ముందుగా ఎన్టీఆర్ చేయాల‌నుకుని జ‌న‌తా గ్యారేజ్ హిట్ అయ్యాక ఈ క‌థ త‌న‌కు స‌రిపోద‌ని త‌ప్పుకున్నాడు. ఎన్టీఆర్ చాలా తెలివిగా త‌ప్పించుకుని ఓ ప్లాప్ నుంచి ఎస్కేప్ అయ్యాడ‌ని సినిమా చూశాక తెలుస్తుంది. 

 

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– ఓన్లీ హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, డ్యాన్సులు

– యాక్ష‌న్ ఎలిమెంట్స్‌

– విశాల్ – శేఖ‌ర్ ద్వ‌యం నేప‌థ్య సంగీతం

 

మైన‌స్ పాయింట్స్ (-):

– ఫ‌స్టాఫ్‌

– వీక్ స్టోరీ

– ప్లాట్ నెరేష‌న్‌

– ప‌డుతూ ప‌డుతూ లేచి కింద ప‌డిన క‌థ‌నం

– సినిమాను ఎలివేట్ చేయ‌ని డైరెక్ష‌న్‌

– సోది క‌థ‌నంతో 168 నిమిషాల ర‌న్ టైం

– న‌వ్వు రాని కామెడీ

– హీరోయిన్ ఉందా అన్న సందేహం వ‌చ్చేలా ఉన్న ఆమె క్యారెక్ట‌ర్‌

– విల‌నిజం వీక్‌

 

ఫైన‌ల్‌గా….

అల్లు అర్జున్ – వంశీ కాంబినేష‌న్ అన‌గానే ఎన్నో ఆశ‌ల‌తో థియేట‌ర్ల‌కు వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు చుక్క‌లు క‌న‌ప‌డ్డాయ్‌. ఓ నిరుత్సాహం క‌లిగించే సినిమాగా వంశీ సూర్య‌ను మ‌లిచాడు. బ‌న్నీ చివ‌రి సినిమా డీజే బిలో యావ‌రేజ్ అయినా మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. బ‌న్నీ కెరీర్‌లో చాలా రోజుల త‌ర్వాత ఓ ప్లాప్ వ‌చ్చింద‌నుకోవాలి. బ‌న్నీ స్టామినా కూడా ఈ సినిమాను నిల‌బెట్ట‌లేదు.

 

TJ పంచ్‌: నా పేరు గుర్తులేదు

 

TJ సూచ‌న :  సూర్య‌కు దూరంగా ఉండ‌డ‌మే బెట‌ర్ 

 

నా పేరు సూర్య TJ రేటింగ్ : 2.25 / 5

 

 

‘నా పేరు సూర్య’ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts