క‌ళ్యాణ్ వెనుక‌డుగు… రీజ‌న్ ఇదే

May 19, 2018 at 1:29 pm

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ఈ యేడాది ఇప్ప‌టికే ఎమ్మెల్యే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మార్చి నెల‌లో రిలీజ్ అయిన ఆ సినిమా జ‌స్ట్ బిలో యావ‌రేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇక క‌ళ్యాణ్ ఇప్పుడు తాజాగా న‌టిస్తోన్న సినిమా నా నువ్వే. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి దింపుతామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. ఆడియోకు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు మంచి టాక్ రావ‌డంతో సినిమాపై అంద‌రిలోనూ అంచ‌నాలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్ర‌కారం నా నువ్వే వాయిదా ప‌డింది.

 

అస‌లే క‌ళ్యాణ్‌రామ్ త‌న ఇమేజ్‌కు భిన్నంగా చేసిన ప్రయోగాత్మక చిత్రం. ఆపై కూల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. మరోవైపు బాక్సాఫీస్ చూస్తే బిజీబిజీగా ఉంది. ఈ టైంలో ఈ సినిమాను రిలీజ్ చేసి రిస్క్ చేయ‌డం అన‌వ‌స‌రం అన్న ఆలోచ‌న‌తోనే నా నువ్వేను వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే  థియేట‌ర్లు రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను, మ‌హాన‌టి సినిమాల‌తో బిజీగా ఉన్నాయి. 

 

ఇక వ‌చ్చే శుక్ర‌వార‌మే ర‌వితేజ నేల టిక్కెట్ వ‌స్తోంది. ఆ సినిమాకు ఏ సెంట‌ర్ల‌తో పాటు బీ, సీ సెంట‌ర్ల‌లోనూ ఎక్కువ థియేట‌ర్లే ఇస్తున్నారు. ఇక అదే రోజు రావాల‌నుకున్న రాంగోపాల్ వ‌ర్మ – నాగార్జున ఆఫీస‌ర్‌ను వాయిదా వేసేశారు. ఈ టైంలో ప్ర‌యోగాత్మ‌క క‌థ‌తో క‌ళ్యాణ్‌రామ్ ఇమేజ్‌కు భిన్నంగా చేసిన నా నువ్వేను పోటీకి పోయి త‌క్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. సోలోగా మంచి డేట్ చేసుకుని జూన్‌లో రావ‌డానికి డిసైడ్ అయ్యార‌ట‌.

 

ఇక విశాల్ ఇరుంబు తురై (తెలుగులో అభిమన్యుడు), నాగ‌శౌర్య అమ్మమ్మగారిల్లు సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అభిమ‌న్యుడుకు త‌మిళ్‌లో మంచి టాక్ వ‌చ్చింది. స‌మంత హీరోయిన్. ఈ సినిమాను ఈ నెల 31కు వాయిదా వేయాల‌ని చూస్తున్నారు. అదే జ‌రిగితే నెల టిక్కెట్‌కు సోలోగా మంచి డేట్ దొరికిన‌ట్టే.

క‌ళ్యాణ్ వెనుక‌డుగు… రీజ‌న్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts