పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఎన్టీఆర్ డైరెక్టర్

May 25, 2018 at 12:13 pm

సినిమారంగానికి చెందిన వాళ్లు తాగి రాష్ డ్రైవింగ్ చేయ‌డం.. రోడ్డుపై నానా హంగామా చేయ‌డం.. ట్రాఫిక్ పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం హైద‌రాబాద్‌లో కామ‌నైపోయింది. మ‌ద్యంసేవించి కార్లు న‌డుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయి ప‌రువుపోగుట్టుకుంటూనే ఉన్నారు. ఇలా నిత్యం ఎవ‌రో ఒక‌రు ఏదోఒక‌చోట దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా.. ఓ యువ ద‌ర్శ‌కుడు కూడా మ‌ద్యం సేవించి, కారును రాష్‌గా డ్రైవింగ్ చేస్తూ మ‌రో కారును ఢీకొట్టి అక్క‌డి నుంచి పారిపోయాడు. చివ‌ర‌కు బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో స్టేష‌న్‌లో లొంగిపోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక‌రోజంతా ప‌రారీలోఉండి.. బుధ‌వారం రాత్రి పోలీసుల ఎదుటలొంగిపోవ‌డం సినీ ఇండ‌స్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…. జైల‌వ‌కుశ సినిమా డైరెక్ట‌ర్ బాబీ గ‌త‌ ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 33లో కారులో వేగంగా వెళ్తూ ఎదురుగా ఉన్న హర్మేందర్‌ అనే వ్యాపారి కారును ఢీకొట్టాడు. తాను ప్రశ్నిస్తే మద్యం మత్తులో ఉన్న బాబీ మర్యాద లేకుండా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయాడంటూ హర్మేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయ‌న ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక‌ అప్పటి నుంచి పరారీలో డైరెక్ట‌ర్ బాబీ ఎట్ట‌కేల‌కు ఉండగా బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో మ‌రోసారి సినిమా రంగానికి చెందిన వారు మ‌ద్యం సేవించి, రాష్ డ్రైవింగ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సామాజిక ద‌`క్కోణంతో, మంచి విలువ‌ల‌తో సినిమాలు తీసి, స‌మాజంలో స్ఫూర్తి నింపేందుకు క‌`షి చేయాల్సిన ద‌ర్శ‌కులు కూడా ఇలా మ‌ద్యం సేవించి, రాష్ డ్రైవింగ్ చేయ‌డంపై అన్నివ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతోమంది ప్ర‌తిభావంతులు కూడా త‌మ కెరీర్‌ను నాశ‌నం చేసుకుంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంతేగాకుండా.. ఇటీవ‌ల ఇత‌ర‌రంగాల‌కు చెందిన వారు, ముఖ్యంగా ఈమ‌ధ్య అమ్మాయిలు కూడా మ‌ద్యం సేవించి కార్లు న‌డ‌ప‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం కారు న‌డుపుతూ రోడ్డుప‌క్క‌న ఉన్న‌వారిని ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే మ‌`తి చెందిన విష‌యం తెలిసిందే.

పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఎన్టీఆర్ డైరెక్టర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts