రాజేంద్రప్రసాద్ కి మరో గొప్ప అవార్డ్

May 29, 2018 at 9:08 am

తెలుగు సినిమా కామెడీ హీరోలని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు . అలాంటి వాళ్లలో మొదటిస్థానం రాజేంద్ర ప్రసాద్ అనే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే .రాజేంద్ర ప్రసాద్ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డ్స్ ఆయనని వరించాయి .   అయితే అయన ఖాతాలో మరొక అవార్డు చేరిపోయింది .

 

మైసూరు ద‌త్త పీఠంలో స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డా.రాజేంద్ర ప్ర‌సాద్‌కి క‌ళానిధి అవార్డుని అందించారు. నాలుగు ద‌శాబ్దాలు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న న‌టుడు డా.రాజేంద్ర ప్ర‌సాద్‌.

 

డా.రాజేంద్ర ప్ర‌సాద్‌కు క‌ళానిధి అవార్డును బ‌హూక‌రించిన అనంతరం గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి మాట్లాడుతూ.. ‘‘నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. హాస్యానికి కిరీటాన్ని పెట్టిన న‌ట‌కిరీటికి ఈ క‌ళానిధి అవార్డు ఇవ్వ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు.

 

డా.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ‘‘నాలుగు ద‌శాబ్ధాలుగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాను. న‌టుడిగా ఎన్నో అవార్డుల‌ను అందుకున్న‌ప్ప‌టికీ స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా క‌ళానిధి అవార్డును స్వీక‌రించ‌డం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.

రాజేంద్రప్రసాద్ కి మరో గొప్ప అవార్డ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts