
మనం ఎప్పుడు క్రికెటర్స్ ఆట వాళ్ళ ఫన్నీ ఇంటర్వూస్ మాత్రమే చూస్తుంటాం కానీ కొత్తగా వాళ్ళ భార్యలతో క్రికెట్ గురించి వాటి నిబంధనలు ఎంతవరకు తెలుసు .అదే క్రికెటర్స్ మరియు అభిమానులు గూగ్లీ, ఫ్రీ హిట్, నకుల్ బాల్, సూపర్ ఓవర్… గురించి చెప్పమని అడిగితే తడుముకోకుండా టక టకా సమాధానాలు చెప్పేస్తారు. మరి ఇవే ప్రశ్నలు క్రికెటర్ల భార్యలకు ఎదురైతే? ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతారు దానికి సరైన సమాధానం చెప్పుతారా ఒకవేళ అలాంటిది జరిగితే ఎలావుంటది. సరిగ్గా ఇదే జరిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల భార్యలకు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ నిర్వాహకులు తమ ట్విటర్ ద్వారా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
క్రికెటర్ల భార్యల కోసం ప్రత్యేకకంగా ఫ్రాంఛైజీ నిర్వాహకులు ఓ గేమ్ షో నిర్వహించారు. శిఖర్ ధావన్, టామ్ మూడీ, ముత్తయ్య మురళీధరన్, భువనేశ్వర్ కుమార్ తదితరుల భార్యలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రాంఛైజీ నిర్వాహకులు వారిని పలు ప్రశ్నలు అడిగారు. గల్లీ, గూగ్లీ, ఫ్రీహిట్, నకుల్ బాల్, సూపర్ ఓవర్, డాట్ బాల్ అంటే ఏమిటని అడిగారు. అవేకాకుండా ఈ ఏడాది ఐపీఎల్లో ఎన్ని జట్లు ఆడుతున్నాయని కూడా అడిగారు. ఇందులో కొన్నింటికి వారు సమాధానాలు కూడా చెప్పారు. మరికొన్నింటికి మాత్రం కొంచెం కష్టపడుతూ సమాధానంచెప్పారు .. భువనేశ్వర్ కుమార్ భార్య నుపూర్ నగర్ ఈ గేమ్‌షోలో చాలా యాక్టివ్‌గా పాల్గొంది. ఎక్కువ ప్రశ్నలకు ఆమే సమాధానాలు ఇచ్చింది.
నిర్వాహకులు ఇంకా ఏమి ప్రశ్నలు అడిగారు.. వారిమేమి సమాధానాలు చెప్పారు అని తెలియాలంటే మాత్రం ఈ కింది వీడియోను క్లిక్ చేసి చూడాల్సిందే .అంతే కాకుండా టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ ఈ రోజు క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తే వారే ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడతారు.