మామ అల్లుళ్లు ‘కాలా’కు అడ్డంగా దొరికారు

June 14, 2018 at 12:16 pm

సౌత్‌సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా అంటే గ‌త మూడేళ్లుగా పెద్ద జూదం అయిపోయింది. రోబో సినిమా త‌ర్వాత ర‌జ‌నీ సినిమాలు కొన్న బ‌య్య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు నిండా మునిగిపోతున్నారు. ర‌జ‌నీ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే రికార్డుల దుమ్ము రేగుతోంది. ఇక యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా ఓకే. అయితే గ‌త మూడేళ్లుగా ర‌జ‌నీ సినిమాలు కొచ్చ‌డ‌యాన్‌, లింగా, క‌బాలి, తాజాగా కాలా ఈ సినిమాల‌కు డిజాస్ట‌ర్ టాకే వ‌స్తోంది. సినిమా ప్లాప్ అవ్వ‌డంతో భారీ న‌ష్టాలు త‌ప్ప‌ట్లేదు.

ర‌జ‌నీ గ‌త నాలుగు సినిమాల‌ను భారీ రేట్ల‌కు కొన్న బ‌య్య‌ర్లు కోలుకోలేని విధంగా మునిగిపోతున్నారు. రజనీ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన ప్రతిసారీ బయ్యర్లకు.. ఆయనకు మధ్య రగడ మొదలవుతుంది. లింగ దెబ్బ‌తో ఆ సినిమా కొన్న బ‌య్య‌ర్లు ఏకంగా టెంట్లు వేసుకుని మ‌రీ రోడ్లెక్కి ధ‌ర్నాలు చేశారు. గ‌తంలో త‌న సినిమాలు ప్లాప్ అయితే ఆదుకునే ర‌జ‌నీ ఆ త‌ర్వాత సైలెంట్‌గా ఉండ‌డంతో చాలా చెడ్డ‌పేరే వ‌చ్చింది.

ఇక తాజాగా కాలాకు ముందు నుంచి బ‌జ్ లేక‌పోవ‌డంతో పేల‌వ‌మైన ఓపెనింగ్స్ వ‌చ్చాయి. మామ క్రేజ్ క్యాష్ చేసుకుని భారీ లాభాలు వేన‌కేసుకోవాల‌ని ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ వేసిన ప్లాన్లు వ‌ర్క‌వుట్ కాలేదు. త‌మిళ‌నాడు వ‌రకు ఈ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయినా మిగిలిన చోట్ల బాగా దెబ్బ‌ప‌డింది. ఏపీ, తెలంగాణ‌, ఓవ‌ర్సీస్‌లో ఓన్ రిలీజ్‌కు వెళ్లారు. కర్ణాటకలో సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురై.. అక్కడి బయ్యర్ ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులివ్వలేదు.

ఇక త‌మిళ‌నాడులో బ‌య్య‌ర్లు న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాల‌ని ధనుష్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఏదేమైనా ర‌జ‌నీ క్రేజ్ మ‌రోసారి క్యాష్ చేసుకోవాల‌ని నాసిర‌కం బ‌డ్జెట్‌తో సినిమా తీసిన మామఅల్లుళ్ల ప్లాన్లు అయితే వ‌ర్క‌వుట్ కాలేదు.

మామ అల్లుళ్లు ‘కాలా’కు అడ్డంగా దొరికారు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts