అదంతా అబద్దం ..ఆ వార్తలలో నిజం లేదు

June 14, 2018 at 8:38 pm

మహేష్ బాబు భ్రామ్మోత్సవం , స్పైడర్ మూవీస్ తో ఘోరపరాజయం మూటకట్టుకొన్నారు . తరువాత మహేష్ బాబుకి బిగెస్ట్ హిట్ మూవీ అందించిన డైరెక్టర్ కొరటాల శివతో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నాడు .‘భరత్‌ అనే నేను’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు మహేశ్‌బాబు. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్  ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో మహేశ్ ‌సరికొత్త లుక్‌తో దర్శనమివ్వనున్నారు అనేది పబ్లిక్ టాక్. అప్పుడు నుండి మహేష్ కొత్త లుక్ లో ఎలా ఉంటాడు అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవల మహేష్ బాబు  ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ‘మహేశ్‌ కొత్త లుక్‌’ చూశారా? అంటూ పలు ఫొటోలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి.  సుధీర్ బాబు హీరోగా నటించిన ‘సమ్మోహనం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు కొత్తలుక్‌తోనే మహేష్ వచ్చారు . గడ్డం, మీసాలతోనే మహేశ్‌ భలే ఉన్నారంటూ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

 

ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు పలు మార్లు ముంబయి వెళ్తుండటంతో ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టింది. ఆయన బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్నారని, అందుకే ముంబయి వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ, అది నిజం కాదు అని తేలిపోయింది. వంశీ పైడిపల్లి సినిమాకు సంబంధించి ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌‌ హకీమ్‌ అలీమ్‌ను కలవడానికే వెళ్లారని సమాచారం. అంతేకానీ, బాలీవుడ్‌ సినిమా చేయడానికి కాదని అంటున్నారు. తన దృష్టి అంతా తెలుగు చిత్ర పరిశ్రమపైనేనని మహేశ్‌ గతంలోనే పలుమార్లు చెప్పారు.

 

మహేశ్‌ ఇప్పుడు వరుకు కథానాయకుడిగా 24 చిత్రాలలో నటించారు .అయితే మహేష్  25వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. జూన్‌ రెండో వారంలో ఈ ‌ సినిమా సెట్‌కు వెళ్లనుంది. వ్యవసాయం, రైతులు నేపథ్యంలో సినిమాను తీస్తున్నారని, ‘రైతు బిడ్డ’ అనే టైటిల్‌ను సినిమాకు అనుకుంటున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం ఉంది. ఇందులో మరొక హీరో అల్లరి నరేష్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మహేష్ కు మరొక భారీ బ్లాక్ బస్టర్ మూవీ రావాలని అభిమానులు కోరుకొంటున్నారు

అదంతా అబద్దం ..ఆ వార్తలలో నిజం లేదు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts