నా నువ్వే TJ రివ్యూ

June 14, 2018 at 12:36 pm

టైటిల్‌: నా నువ్వే
స‌మ‌ర్ప‌ణ‌: మ‌హేశ్ కోనేరు
బ్యాన‌ర్‌: కూల్ బ్రీజ్ సినిమాస్‌
న‌టీన‌టులు: న‌ంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, త‌మ‌న్నా, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల‌కిశోర్, త‌నికెళ్ల‌భ‌ర‌ణి
మ్యూజిక్‌: శ‌ర‌త్‌
సినిమాటోగ్ర‌ఫీ: పి.సి.శ్రీరామ్‌
ఎడిటింగ్‌: టి.ఎస్‌.సురేశ్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే: జ‌యేంద్ర శుభ‌
నిర్మాత‌లు: కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి
ద‌ర్శ‌క‌త్వం: జ‌యేంద్ర‌
ర‌న్ టైం: 125 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 14 జూన్‌, 2018

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌కు ప‌టాస్ సినిమా త‌ర్వాత స‌రైన హిట్ లేదు. ప‌టాస్ త‌ర్వాత హ్యాట్రిక్ ప్లాపుల్లో ఉన్న క‌ళ్యాణ్ ఈ యేడాది స్టార్టింగ్‌లో వ‌చ్చిన ఎమ్మెల్యే సినిమాతో నిరాశ‌ప‌రిచాడు. ఇక ఇప్పుడు వెంట‌నే కెరీర్‌లో తొలిసారి భిన్నంగా ట్రై చేసిన సినిమా నా నువ్వే. క‌ళ్యాణ్ కంప్లీట్ రొమాంటిక్ హీరోగా మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో జోడీక‌ట్టిన ఈ సినిమాకు సిద్ధార్థ్ 180 సినిమా ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర ద‌ర్శ‌కత్వం వ‌హించారు. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆస‌క్తి రేపిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌, క‌థ‌నం :
రేడియో జాకీ అయిన మీరా (త‌మ‌న్నా) ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా ఏకంగా 36 గంట‌ల పాటు ఓ మ‌ర‌థాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న ప్రేమ‌క‌థ చెపుతుంది. వ‌రుణ్ (నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌) త‌న స్నేహితులు అయిన వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌తో క‌లిసి అమెరికా వెళ్లే ప్ర‌య‌త్నంలో ప్ర‌తిసారి ఏదో కార‌ణంతో ఫ్లైట్ మిస్ చేసుకుంటుంటాడు. ఇదిలా ఉంటే వ‌రుణ్ బామ్మ మ‌నోడికి పెళ్లి చేయాల‌ని ల‌వ్ సైన్ పుస్త‌కం కొంటుంది. దానిని వ‌రుణ్ ట్రైన్‌లో మ‌ర్చిపోతే అది మీరాకు దొరుకుతుంది. ఆ పుస్త‌కం మీరా ఎవ‌రికి ఇచ్చినా అది అటు తిరిగి ఇటు తిరిగి చివ‌ర‌కు మీరా ద‌గ్గ‌ర‌కే చేరుతుంది.

ఏదో బ‌ల‌మైన కార‌ణంతోనే ఆ పుస్త‌కం ప‌దే ప‌దే త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంద‌ని న‌మ్మే మీరా ఈ పుస్త‌కంలో వ‌రుణ్ ఫొటో చూస్తుంది. ఆ వెంట‌నే ఆమె ఎప్ప‌ట‌కీ పూర్తి చేయ‌లేని ప‌నులు చ‌క‌చ‌క‌గా జ‌రిగిపోతుంటాయి. ఆమె పాస్ కాని ప‌రీక్ష‌లు కూడా సులువుగానే పాస్ అయిపోతుంటుంది. వ‌రుణ్‌ను త‌న ల‌క్కీ అని భావించి అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. అయితే వీరిద్ద‌రు ఒక‌రిని మ‌రొక‌రు క‌లుసుకునే క్ర‌మంలో చిత్ర విచిత్రాలు జ‌రుగుతుంటాయి. చివ‌ర‌కు త‌న ప్రేమ‌ను అంగీక‌రించేందుకు వ‌రుణ్ మీరాకు ఎలాంటి ప‌రీక్ష పెట్టాడు ? ఈ ప‌రీక్ష‌లో మీరా గెలిచిందా ? లేదా ? వరుణ్, మీరాలు ఎందుకు దూరమయ్యారు..? చివరకు ఎలా కలిశారు..? అన్నదే మిగతా కథ.

పాజిటివ్‌లు :
ఇన్నాళ్లు మాస్ యాక్షన్ రోల్స్‌ లో కనిపించిన క‌ళ్యాణ్ ఇప్పుడు చాలా కొత్త‌గా సాఫ్ట్, స్టైలీష్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. మీరా పాత్ర‌లో త‌మ‌న్నా గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ ఫుల్ మార్కులు వేయించుకుంది. రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ తమన్నా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాట‌ల‌తో పాటు కొన్ని ఎమోష‌న‌ల్ సీన్లు బాగున్నాయి. పోసాని కృష్ణమురళీ తెర మీద కనిపించింది తక్కువ సేపే అయిన ఉన్నంతలో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. హీరోయిన్‌ తండ్రి తనికెళ్ల భరణీ తనకు అలవాటైన రొటీన్ పాత్రలో కనిపించారు. ప్రవీణ్‌, వెన్నెల కిశోర్‌, సురేఖ వాణి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు. శ‌ర‌త్ పాట‌లు ఓకే. నేప‌థ్య సంగీతంతో ప్రేక్ష‌కుడి మూడ్‌ను బాగా క‌నెక్ట్ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కంప్లీట్‌ క్లాస్ సినిమా చూసే వారికి నా నువ్వే బాగా క‌నెక్ట్ అవుతుంది.

నెగిటివ్‌లు :
సినిమాలో పాత్ర‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ల్లోని ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌డంతో సినిమా మెయిన్ పాయింట్‌ను సాగ‌దీసేసిన‌ట్లు అయ్యింది. ఇక క‌ళ్యాణ్‌రామ్ – త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవ్వ‌క‌పోగా కృతికంగా ఉంది. కొన్ని స‌న్నివేశాల్లో అయితే త‌మ‌న్నా ఎక్స్‌ప్రెష‌న్స్ మ‌రీ ఓవ‌ర్ అయిన‌ట్టు ఉన్నాయి. ఫన్ పార్ట్ కూడా పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్ రామ‌లింగ్వేర స్వామి కామెడీ మెప్పించ‌లేదు. బిత్తిరి స‌త్తిని కూడా బాగా యూజ్ చేసుకోలేదు. ఇక దీనికి తోడు జ‌యేంద్ర క‌థ‌, క‌థ‌నాలు స్లోగానే ఉంటాయి. ఈ సినిమా కూడా చాలా స్లో నెరేష‌న్‌తో మూవ్ అవ్వ‌డం, ఇక క‌థ‌నం కూడా అంత ఎంగేజింగ్‌గా లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుడికి నిరాశ క‌లుగుతుంది. డైరెక్ట‌ర్ జ‌యేంద్ర సినిమాను గ్రిప్పింగ్‌గా హ్యాండిల్ చేయ‌డంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఇక మాస్ ప్రేక్ష‌కులకు ఈ సినిమా కనెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే.

ఫైన‌ల్‌గా…
క‌నెక్ట్ కాని క్లాస్ మూవీ నా నువ్వే

TJ సూచ‌న‌: ఓన్లీ ఫ‌ర్ హై క్లాస్ ల‌వ్‌స్టోరీ

నా నువ్వే TJ రేటింగ్‌: 2.25 / 5

నా నువ్వే TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts