ప‌వ‌న్‌.. కేరాఫ్‌..ఓ వాయిదాల యాత్ర‌..!

June 11, 2018 at 9:39 am

ప్ర‌శ్నించ‌డంలో ఇప్ప‌టికే విఫ‌ల‌మైన జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. ప్ర‌జ‌ల్లో ప‌ర్య‌టించ‌డంలోనూ విఫ‌ల‌మ‌వుతున్నాడ‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నా యి. ఆయ‌న ఉత్త‌రాంధ్ర నుంచి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన పోరు యాత్ర‌.. వాయిదాల ప‌ర్వంలో కొన‌సాగుతూ.. వాయిదాల యాత్ర‌గా మారిపోయింది. ఏ చిన్న ఇబ్బంది వ‌చ్చినా.. ఆయ‌న యాత్రకు బ్రేక్ చెబుతున్నారు. నిజానికి ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌కు.. ఇప్పుడు చేస్తున్న యాత్ర‌కు మధ్య ఎలాంటి సంబంధం క‌నిపించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తొలుత ప‌వ‌న్ ఈ యాత్ర విష‌యంలో చాలా ఆర్భాటంగా ప్ర‌క‌ట‌న చేశాడు. నలభై రోజుల పాటు ‘సుధీర్ఘ’ యాత్రను చే్స్తాన‌ని, ప్ర‌జ‌ల కోసం అవ‌స‌ర‌మైతే.. ప్రాణాలు సైతం ఇచ్చేందుకు తాను మ‌డ‌మ తిప్పేది కూడా లేద‌ని ఆయ‌న వెల్ల‌డించి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచారు. 

 

కానీ, ఇప్పుడు మాత్రం యాత్ర ప్రారంభించిన నాటి నుంచి విరామాల ప‌ర్వంతో ముందుకు సాగుతున్నారు. పక్షం రోజులకే పూర్తి విరామాన్ని ప్రకటించడం విశేషం. ఈ పక్షం రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ పలు విరామాలను తీసుకున్నాడు. గెస్ట్ హౌస్‌లకు పరిమితం అయ్యాడు. గ‌త వీకెండ్ లీవ్ మూడు రోజుల పాటు తీసుకున్నాడు. అయితే, ఈ విరామాలకు కారణాలు ఏమిటో ఎవ‌రికీ తెలియ‌క పోవ‌డం మ‌రో చిత్రం. అంతకు ముందు కూడా పవన్ యాత్ర విరామాలతో సాగింది. వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారని.. ఇలాంటి రీజన్లతో పవన్ యాత్రకు విరామాలు వచ్చాయి. 

 

ఇలా వరస విరామాలతో సాగుతున్న పవన్ కళ్యాణ్ యాత్ర.. ఈ సారి రంజాన్ వరకూ ఆగిపోయింది. ఈ విరామం ఎందుకు అంటే.. పవన్ కళ్యాణ్ సిబ్బందిలో ముస్లింలు ఉన్నారని, వారి కోసం యాత్రకు విరామాన్ని ఇస్తున్నట్టుగా జనసేన పార్టీ ప్రకటించింది. నిజానికి ఫాలోయ‌ర్ల‌లో అంతగా ముస్లింలు ఉంటే.. వాళ్లకు సెలవు ఇచ్చి పంపించవచ్చు. 

కానీ, రంజాన్ అని చెప్పి యాత్రకే విరామం ఇవ్వడం ప‌వ‌న్ పేరును చెడ‌గొడుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌నే తీసుకుంటే.. గ‌త ఏడాది న‌వంబ‌రులో ప్రారంబించిన పాద‌యాత్ర‌.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస పెట్టి ఆపిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. 

 

కోర్టు ఆదేశాల‌తో శుక్ర‌వారం ఒక్క‌రోజు మాత్ర‌మే ఆయ‌న విరామం ఇస్తున్నారు. అంత‌కు మించి ఆయ‌న ఏపీ కోసం విప‌క్షాలు చేసే ఉద్య‌మాల నేప‌థ్యంలోనే యాత్ర‌కు విరామం ప్ర‌క‌టిస్తున్నారు. అంతేకానీ, భ‌ద్ర‌త లేద‌ని, పండ‌గ‌ల‌ని ఆయ‌న ఎక్క‌డా కూడా సెల‌వులు పెడుతున్న దాఖ‌లా క‌నిపించ‌దు. ఏదైనా కుటుంబ కార్య‌క్ర‌మం ఉన్నా.. జ‌గ‌న్ నేరుగా త‌న కుటుంబ స‌భ్యులనే.. తాను పాద‌యాత్ర చేస్తునన్న ప్రాంతానికి పిలిపించుకుంటున్నారు త‌ప్ప‌.. ప‌వ‌న్ మాదిరిగా ఎక్క‌డా సుదీర్గ విరామం ప్ర‌క‌టించ‌డం లేదు. మ‌రి ప‌వ‌న్ ఈ విష‌యాన్ని ఎప్ప‌టికి గుర్తిస్తాడో చూడాలి. 

ప‌వ‌న్‌.. కేరాఫ్‌..ఓ వాయిదాల యాత్ర‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts