మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది : ఎన్టీఆర్

July 14, 2018 at 3:51 pm

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోష్ లో ఉన్నాడు.  టెంపర్ సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకువెళ్తున్నాడు.  ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమాలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఈ సినిమా పూర్తి కాగానే దర్శకధీరుడు రాజమౌళి తో మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పి షాక్ ఇచ్చారు.   

 

నేను రభస షూటింగ్‌లో స్విట్జర్లాండ్‌లో ఉన్నా. ప్రణతికి డెలివరీ టైమ్. ఎప్పుడు ఏం జరిగినా హాస్పిటల్‌కు వచ్చేయండి అని చెప్పా. ఒకరోజు షూటింగ్ గ్యాప్‌లో మా ఆవిడతో మాట్లాడుతుంటే తేడాగా ఉంది. వెంటనే నిన్ను నేను చంపేస్తాను. నేనిక్కడ ఉన్నాను. నువ్వు అప్పుడే కనేయకు నేనొచ్చేవరకూ ఆగు అన్నాను.  షూటింగ్ మద్యలో ఆపేసి వెంటనే ఇక్కడ ఉదయం ల్యాండ్ అయ్యాను.  ఇంటికి వెళ్తున్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది..ఎక్కడున్నావ్ అంటే..హాస్పిటల్ వెళ్తున్నా అని చెప్పడంతో నా గుండె ఆగినంత పనైంది.  

 

అదేంటీ హాస్పిటల్ కి అని ఆశ్చర్యంగా అడిగాను..లేదు చిన్న చెకప్ అంటూ అబద్దం చెప్పింది ప్రణతి.  ఆ సమయంలో నా భార్యతో మా అమ్మ ఉన్నారు.  ఒకే నువ్వు వెళ్లు నే ఇంటికి వెళ్లి వస్తానని చెప్పా.  నేను ఇంటికెళ్లి కాఫీ తాగుతుంటే మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది.  ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అమ్మా ఎంతసేపట్లో వచ్చేయాలి అన్నాను..ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అని చెప్పింది.  వెంటనే బయల్దేరి అలా వెళ్లాను అప్పుడే మా పెద్దబ్బాయి పుట్టాడు. కొంచెం ఏమాత్రం లేటయినా ఆ సమయానికి నేను లేకపోయేవాడిని. అదంతా ఫోన్ కారణంగానే అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది : ఎన్టీఆర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts