కలెక్షన్ల పరంగా ‘సాక్ష్యం’షాకింగ్ రిపోర్ట్!

July 28, 2018 at 11:05 am

అల్లుడుశీను, జయజానకి నాయక చిత్రాలతో మాస్ ప్రేక్షకులకు చేరువయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. తన గత చిత్రాలకు భిన్నంగా కథను నమ్మి ఆయన నటించిన తాజా చిత్రం సాక్ష్యం. పంచభూతాలు, కర్మ సిద్ధాంతానికి వాణిజ్య హంగులను మిళితం చేసి దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తున్న రోజులివి. ఇలాంటి త‌రుణంలో హీరోలంద‌రూ కొత్త త‌ర‌హా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అలాంటి ఆస‌క్తితో.. ముందు మూడు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేసిన కొత్త ప్ర‌య‌త్నం `సాక్ష్యం`.

సృష్టిలో జ‌రిగేదానికి నాలుగు దిక్కులే కాదు.. ప్ర‌కృతి కూడా సాక్ష్యం. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌కృతే ప్ర‌క్షాళ‌న చేస్తుంద‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన సాక్ష్యం ట్రైల‌ర్, మేకింగ్ వేల్యూస్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పూజ హెడ్గే హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ సాక్ష్యం. విడుదలకు ముందునుండే భారీ అంచనాలు ఉన్నా ఓపెనిగ్స్ పరంగా భారీ లెవల్లో సాధించింది.

37825331_1839881452766052_872497356069666816_n

రెండు తెలుగు రాష్ట్రాలలో 600 లకు పైగా థియేటర్స్ లో విడుదలయిన సాక్ష్యం సినిమా ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ఉదయం మొదటి షో కాస్త ఇబ్బంది పడినా తర్వాత షోస్ అంతా సెట్ అయ్యిందని టాక్. మొదటి రోజు మొత్తం మీద 60% ఆక్యుపెన్సీతొ మంచి ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదనిపించుకుంది.

ఇప్పటి వరకు సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం సాక్ష్యం సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ బరిలో 5కోట్ల వరకూ వసూలు చేసే ఆవకాశముందట. వీక్ ఎండ్ కావడం..అందులోనూ ఈ రోజు కొణిదెల నిహారిక నటించిన ‘హ్యపీ వెడ్డింగ్’ సినిమా రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఈ సినిమా టాక్ పాజిటీవ్ వస్తే..‘సాక్ష్యం’పై కాస్త ప్రభావం పడుతుందని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా “సాక్ష్యం” చెప్పుకోవచ్చు.

37860294_1839881466099384_3875577582225195008_n

కలెక్షన్ల పరంగా ‘సాక్ష్యం’షాకింగ్ రిపోర్ట్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts