రూమర్లకు చెక్..స్వాతికి ఆ వరుడే ఫిక్స్

August 13, 2018 at 10:35 am

మాటీవిలో కలర్స్ ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిని కుర్రది తర్వాత వెండితెరపై హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..అష్టాచమ్మతో మహేష్ ఫ్యాన్ గా తెగ సందడి చేసిన కలర్స్ స్వాతి. తర్వాత స్వామిరారా, కార్తికేయ ఇలా కొన్ని సినిమాల్లో నటించిన స్వాతి ఆ మద్య తమిళ , మళియాళ భాషల్లోకూడా నటించి తన సత్తా చాటింది.

అయితే గత కొంత కాలంగా స్వాతిపై రక రకాల రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా స్వాతి పెళ్లి విషయంపై రూమర్లకు చెక్ పడింది. వాస్తవానికి ఆ మద్య తెలుగు హీరో, మళియాళం హీరోలతో లవ్ లో ఉన్నట్లు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి..కానీ వాటన్నింటి స్వాతి ఖండించింది..పైగా మీడియాపై ఇలాంటి చెత్త వార్తలు ఎలా రాస్తారని స్వాతి సీరియస్ కూడా అయ్యింది.

Colors-swathi-wedding-1

తాజాగా వికాస్ అనే పైలెట్ ను ఆమె పెళ్లాడనుంది. వీళ్లిద్దరి వివాహం ఈనెల 30న హైదరాబాద్ లో జరగనుంది. అయితే ఈ విషయంపై కొంత క్లారిటీ వచ్చింది..వాస్తవానికి స్వాతి పెళ్లి చేసుకోయే భర్త పేరు వికాస్..పైలెట్ గా పనిచేస్తున్నాడు. ఇండోనేషియాలోని జకార్తాలో ఉంటున్నాడు. అయితే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కావడం విశేషం. అయితే వివాహం జరిగిన తర్వాత కూడా స్వాతి సినిమాల్లో కంటిన్యూ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

రూమర్లకు చెక్..స్వాతికి ఆ వరుడే ఫిక్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts