‘సైరా’టీజర్ ఇలా ఉండబోతుందా!

August 20, 2018 at 2:56 pm

అవును ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’కి సంబంధించిన టీజర్ ఎప్పుుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు..అభిమానులు..సైలబ్రెటీలు. బ్రిటీష్ వారిని గజ గజలాడించిన మహానాయకుడు..స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.

DlBaU-OX4AAdQw1

ఈ సినిమా టీజర్ మరో కొద్దిగంటల్లో బయటకు రాబోతోంది. ఎలా వుంటుంది అన్న ఆసక్తి మెగాభిమానుల్లో వుంది. అయితే నరసింహారెడ్డి లుక్ ఎలా ఉండబోతుందో అన్న టెన్షన్ అప్పట్లో ఉండేది..కానీ అమితాబచ్చన్ కొన్ని లుక్స్ రిలీజ్ చేయడంతో చిరు ఇలా ఉండబోతున్నాడా అన్న క్లారిటీ వచ్చింది. అయినా కూడా సైరా టీజర్ ఎలా వుంటుంది అన్న ఆసక్తి అయితే వుంది. ఇక టీజర్ పై టాలీవుడ్ లో వస్తున్న సమాచారం మేరకు నిడివి 60సెకెండ్ల వరకు వుండబోతోంది. టీజర్ లో కేవలం ఒక్క డైలాగ్ మాత్రమే ఉన్నటుందట..

_61769b0e-940a-11e8-bd6f-c32900bc590c

అంతే కాదు కేవలం ఈ టీజర్ లో చిరంజీవి లుక్ మాత్రమే చూపించబోతున్నారు..బ్యాగ్ గ్రౌండ్ మాత్రం బ్రిటిష్ జనాలు, ఇతరత్రా వ్యవహారాల మీదుగా కోట మీదకు ఫోకస్ చేసి సినిమా పై మరింత ఉత్కంఠత పెంచేలా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సైరా పై ఎలాంటి అప్ డేట్స్ రాలేదు..అందుకే టీజర్ రిలీజ్ చేసి సినిమా విడుదల వచ్చే ఏడాది సమ్మర్ లో ప్లాన్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఇక ఇది టీజర్ అనేకన్నా ఫస్ట్ లుక్ ను ఇలా ఇచ్చారని అనుకోవాలి. ఏమైనా ఈ లుక్ సోషల్ నెట్ వర్క్ లో ఎంత సందడి చేస్తుందో చూడాలి.

‘సైరా’టీజర్ ఇలా ఉండబోతుందా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts