చిరంజీవి ‘సైరా’టీజర్

August 21, 2018 at 11:24 am

టాలీవుడ్ లో మెగాస్టార్ గా కోట్ల మంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన హీరో చిరంజీవి. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `సైరా`. రామ్‌చ‌ర‌ణ్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ రోజు చిత్ర యూనిట్ అట్టహాసంగా టీజర్‌ను రిలీజ్ చేసింది, కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దశాబ్దం కిందట్నుంచో చర్చల్లో ఉన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చిరు రాజకీయాల్లోకి వెళ్లకముందే పరుచూరి సోదరులు ఆయనకు ఈ కథ చెప్పారు. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినపుడు కూడా ముందు ఈ చిత్రమే చేయాలని కూడా చూశాడు చిరు. కానీ రీఎంట్రీలో తొలి సినిమాతోనే ఇలాంటి రిస్కీ ప్రాజెక్టు వద్దనుకుని వెనక్కి తగ్గాడు. ‘ఖైదీ నంబర్ 150’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో తన 151వ చిత్రంగా ‘సైరా’ను మొదలుపెట్టాడు. గ‌త ఏడాది చిరు పుట్టిన రోజున నాడే మోష‌న్ పోస్ట‌ర్ ను హైద‌రాబాద్ సంధ్య క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు. కానీ ఈసారి కొన్ని కార‌ణాల వ‌ల్ల ముందుగానే టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు చేస్తోన్న ఈ హ‌డావుడి మామూలుగా ఉండ‌ద‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈ టీజర్ హడావిడి ఏంటో మీరు చూడండి..

చిరంజీవి ‘సైరా’టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts