విజయ్ దేవరకొండ సినిమాకు భారీ దెబ్బ

August 21, 2018 at 11:10 am

ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లీకేజ్ లతో దర్శక, నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ వారం ముందు నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే లీక్ చేసిన వారిని పట్టుకున్నా..జైల్లో పెట్టిన అప్పటికే జరిగే నష్టం జరిగిపోతుంది. ఇదిలా ఉంటే ‘అరవింద సమేత వీర రాఘవ’ సంబంధించి కొన్ని సీన్లు, ఫోటోలో సోషల్ మీడియాలో లీక్ కావడం పై చిత్ర యూనిట్ అలర్ట్ అయ్యారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాల’ వంతు వచ్చింది.

ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ దృశ్యాలు లీక్‌ కాగా… ఈ సినిమా ఎడిటిం గ్‌ సైతం కాకముందే హెచ్‌డీ ప్రింట్‌ నెట్‌కెక్కింది. దాంతో నిర్మాణ సంస్థ సీరియస్ గా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా చిత్ర యూనిట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

taxiwala-et00070814-12-02-2018-11-11-47

ఇదిలా ఉంటే ట్యాక్సీవాలా సినిమా పూర్తి అయినా కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తుంది. ఇక గీతాగోవిందం సూపర్ హిట్ నేపథ్యంలో వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, హెచ్‌డీ ప్రింట్‌తో పూర్తి సినిమాను యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేశారని నిర్మాణ సంస్థ గుర్తించింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన సానం నాగ అశోక్‌కుమార్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌బాషా దర్యాప్తు చేపట్టారు.

గూగుల్‌ డ్రైవ్‌ల నుంచి ఈ సినిమా షేర్‌ అవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రెల్ల కమల్, భార్గవ్‌కుమార్, బీఆర్‌ పేర్లతో ఉన్న జీ–మెయిల్‌ ఐడీలకు సంబంధించిన డ్రైవ్‌ అకౌంట్ల ద్వారా లింకులు షేర్‌ అవుతున్నాయంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ లీకేజీలతో నెటిజన్లు ఏం సంతోపడతారో కానీ..సినిమా తీసే వారి జీవితం పై విరక్తి పుట్టించేలా ఉన్నాయి. దాని వల్ల తమ కెరీర్ కి ఇబ్బంది కలుగుతుందని హీరో, హీరోయిన్లు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నిర్మాతలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీయాలంటే భయపడే పరిస్థి ఉందని..దాని వల్ల ఎంతో మంది ఉపాది కోల్పోతారని సినీ వర్గాలు పేర్కొంటున్నారు.

విజయ్ దేవరకొండ సినిమాకు భారీ దెబ్బ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts