‘శైల‌జారెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ & రేటింగ్

September 13, 2018 at 2:53 pm

న‌టీనటులు: నాగచైతన్య, అను ఇమ్మానుయేల్‌, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్‌, త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం: నిజార్ ష‌ఫీ
సంగీతం: గోపీసుంద‌ర్‌
నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: మారుతి
విడుద‌ల‌: 13 సెప్టెంబ‌రు 2018

తెలుగు తెర‌ను అల‌రించిన క‌థ‌ల్లో అత్తాఅల్లుళ్ల‌ది ప్ర‌త్యేక‌మైన స్థాన‌మే.. ఇందులో ఈ క‌థాంశాల‌తో అగ్ర‌హీరోలు బిగ్‌హిట్‌ల‌నే అందుకున్నారు. నిజానికి ఒక ద‌శ‌లో 90వ ద‌శ‌కాన్ని ఊపేశారు. మ‌ళ్లీ ఆ ట్రాక్ రికార్డునే న‌మ్ముకుని ఈ త‌రం ద‌ర్శ‌కుడు మారుతి ముందుకు వ‌చ్చాడు. ఆయ‌న తీసిన శైల‌జారెడ్డి అల్లుడు సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఇందులో ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో అత్త‌గా న‌టించి మెప్పించిన ర‌మ్య‌క‌`ష్ణ పాత్ర పేరు మీద‌నే సినిమా ఉండ‌డం.. నాగ‌చైత‌న్య‌, అనుఇమ్మానుయేల్ హీరోహీరోయిన్లుగా న‌టించ‌డం.. విల‌క్ష‌ణ కామెడియ‌న్‌ వెన్నెల కిశోర్ ఉండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే… ఇంత‌కు ముందు వ‌చ్చిన సినిమాల్లోలాగా.. అత్తాఅల్లుళ్లు.. మ‌ధ్య‌లో కూతుళ్లు.. వీళ్ల మ‌ధ్య ప‌ర‌మ రోటీన్‌ స‌న్నివేశాలే వ‌చ్చాయా..? లేక మారుతి ఏమైనా త‌న‌దైన మార్క్ చూపించారా అంటే మాత్రం .. ఒక‌సారి క‌థాగ‌మ‌నంలోకి తొంగి చూడాల్సిందే మ‌రి.

Shailaja-Reddy-Alludu-LP

క‌థ ఎలా ఉందంటే…: సాధార‌ణంగా.. అత్తాఅల్లుడు అన‌గానే.. అహం.. పొగ‌రు క‌ల‌గ‌లిసి అత్తా.. వాటిని పోగ‌ట్ట‌డానికి అంత‌కుమించిన ఎత్తులు వేసే అల్లుడే.. గుర్తుకు వ‌స్తాడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు. కానీ. ఇక్క‌డ‌.. అల్లుడు(నాగ చైత‌న్య‌) మాత్రం చాలా సాఫ్ట్‌. పాజిటివ్‌గా ఆలోచించే క్యారెక్ట‌ర్‌. ఇదే స‌మ‌యంలో ఆయ‌న తండ్రి (ముర‌ళీ శ‌ర్మ‌)కి మాత్రం అహం ఎక్కువ‌. తాను చెప్పిందే జ‌ర‌గాలంటాడు. అయితే.. తండ్రి లాగే అహంకారం ఉన్న అమ్మాయి( అను ఇమ్మానుయేల్‌) చైతూ జీవితంలోకి వ‌స్తుంది. అచ్చం అలాంటి మ‌న‌స్త‌త్వ‌మున్న అమ్మాయి అను (అనూ ఇమ్మానుయేల్‌) చైత‌న్య జీవితంలోకి వ‌స్తుంది. అటు తండ్రి, ఇటు ప్రియురాలి అహంతో న‌లిగిపోతూ.. ఎలాగోలా పెళ్లిదాకా వ‌చ్చేట‌ప్ప‌టికీ ఒక్క‌సారిగా అనూహ్య మ‌లుపు ఎదుర‌వుతుంది. ఆ మ‌లుపు కాబోయే అత్త శైల‌జారెడ్డి (ర‌మ్య‌కృష్ణ‌) రూపంలో ఎదుర‌వుతుంది. ఈమెకు మ‌రింత అహంకారి. అహంతో ఊగిపోయే ముగ్గురిని చైతూ ఎలా దారికి తెచ్చుకున్నాడ‌న్న‌ది మాత్రం తెర‌పైనే చూడాలి.

1_51

ఎలా ఉందంటే..: సినిమా చూస్తున్నంత సేపూ.. పాత క‌థ‌నే అనిపిస్తుంది కానీ.. ఆ పాత్ర‌ల్ని దిద్దిన తీరు ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. అత్తాఅల్లుళ్ల మ‌ధ్య ఎత్తుకు పై ఎత్తులు లేకుండా.. రోటీన్‌కు భిన్నంగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. కానీ.. బ‌ల‌మైన న‌టుల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌రింత బ‌లంగా పాత్ర‌ల్ని తీర్చిదిద్ద‌డంలో మారుతి కొంత వెన‌క‌బ‌డ్డార‌నే చెప్పొచ్చు. ఎందుకంటే.. బాహుబ‌లి సినిమాలో శివ‌గామిగా ర‌మ్య‌క‌`ష్ణను చూసిన ప్రేక్ష‌కులు.. భారీ అంచ‌నాల‌తో సినిమాకు వెళ్తారు. కానీ.. ఆమె స్థాయిలో శైల‌జారెడ్డి పాత్ర‌ను రూపొందించ‌లేక‌పోయిన‌ట్లు అనిపిస్తుంది. ఇక ఇదే స‌మ‌యంలో సినిమాలో కామెడీ ట్రాక్ కూడా కొంత‌వ‌ర‌కు చ‌ప్ప‌గా సాగింద‌నే చెప్పొచ్చు. వెన్నెల కిశోర్‌, ప‌`థ్వీ ట్రాక్ బాగా రాలేదు. ఇది సినిమాకు కొంత మైన‌సే. మొద‌టి పార్టంతా… చైతూ, అనుల మ‌ధ్య ప్రేమ నేప‌థ్యంలోనే సాగుతాయి. అహంతో ర‌గిలిపోయే అనూని చైతూ ప్రేమ‌లోకి దించే క్ర‌మంలో వ‌చ్చే కొన్ని సీన్లు మాత్రం ప్రేక్ష‌కులను బాగా ఆక‌ట్టుకుంటాయి. ఇక‌ తల్లి, కూతురు మధ్య మితిమీరిన అహం సెకండ్ పార్ట్లో సాగ‌దీత‌గా బోర్ కొడుతుంది.

2459-shailaja-reddy-alludu

ఎవ‌రెలా చేశారంటే: సినిమాలో నటులంద‌రూ వారికి ఇచ్చిన పాత్ర‌ల‌కు న్యాయం చేశార‌నే చెప్పుకోవాలి. కానీ.. ఆ పాత్ర‌లే బ‌ల‌హీనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక నాగ‌చైత‌న్య సాఫ్ట్‌ కుర్రాడిగా మెప్పించాడు. ఇదే స‌మ‌యంలో ప‌లు స‌న్నివేశాల్లో భావోద్వేగాల్ని పండించ‌డంలో కొంత వెన‌క‌బ‌డిన‌ట్లుగానే క‌నిపిపిస్తుంది. అను ఇమ్మానుయెల్‌కు మాత్రం మంచి ప్రాధానం ఉన్న పాత్ర ద‌క్కింది. అందంతో ప్రేక్ష‌కుల మ‌దిని పోగొడుతుంది. శైల‌జారెడ్డి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ మెప్పించారు. కానీ.. ఆమె నుంచి ప్రేక్ష‌కుల మ‌రింత ఎక్స్‌పెక్టేష‌న్‌తో వెళ్ల‌డంతో కొంత నిరాశ‌కు గుర‌వుతారు. వెన్నెల కిషోర్‌, పృథ్వీలు త‌మ కామెడీతో ప‌ర్వాలేద‌ని అనిపించారు. ఇక టెక్నిక‌ల్‌గా మాత్రం మంచి రేంజ్‌లో ఉంది. నిజార్ ష‌ఫీ ఛాయాగ్ర‌హణానికి, గోపీసుంద‌ర్ సంగీతానికి మంచి టాక్ వ‌చ్చింది. రెండు మూడు పాట‌లు బాగా వ‌చ్చాయి. మొత్తంగా మారుతి త‌న‌దైన మార్క్‌ని చూపించ‌డంలో కొంత విఫ‌లం చెందార‌నే చెప్పొచ్చు.

చివ‌రిగా…: మ‌న‌సును గిల్ల‌ని శైల‌జారెడ్డి అల్లుడు

TJ రేటింగ్ : 2.5 / 5

‘శైల‌జారెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts