యూట‌ర్న్ మూవీ రివ్యూ & రేటింగ్

September 13, 2018 at 5:33 pm

నటీనటులు : సమంత, భూమిక, ఆది పినిశెట్టి
దర్శకత్వం : పవన్ కుమార్
నిర్మాతలు : శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు
సంగీతం : పూర్ణచంద్ర
సినిమాటోగ్రాఫ‌ర్‌ : నికెత్ బొమ్మి రెడ్డి
విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2018

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ స‌మంత. చైతూతో వివాహం అయిన త‌ర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటోంది. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ.. వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం యూట‌ర్న్ కూడా వినాయ‌క చ‌వితి నాడే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇదే రోజు చైతు సినిమా శైల‌జారెడ్డి అల్లుడు సినిమా కూడా విడుద‌ల అయింది. ఒకే రోజు చైతూ, స‌మంత కీరోల్స్ పోషించిన సినిమాలు రావ‌డం అక్కినేని అభిమానుల‌కు కిక్కేమ‌రి. యూట‌ర్న్ సినిమా మాత్రం ఏక‌కాలంలో అటు త‌మిళంలో, ఇటు తెలుగులో విడుద‌ల అయింది. రోటీన్ క‌థ‌ల‌కు, సినిమాల‌కు భిన్నంగా లేడీ ఓరియెంటెడ్ గా వ‌చ్చిన సినిమా యూట‌ర్న్‌. అయితే.. వ‌రుస విజ‌యాల‌తో ఊపు మీదున్న స‌మంత యూట‌ర్న్ తీసుకుందా.. లేక మ‌రింత దూసుకుపోయిందా.. అనే విష‌యాన్ని తెలుస‌కుందాం..

U-Turn-1

రొటీన్‌కు భిన్నంగా..!

సినిమాల్లో క్రైమ్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశాలు ఎప్పుడు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. నిజానికి ఈ క‌థాంశాల‌కు ప్ర‌త్యేక‌మైన ప్రేక్ష‌కులే ఉంటార‌ని చెప్పొచ్చు. అందులోనూ రొటీన్ సినిమాల‌తో విసిగిపోయిన ప్రేక్ష‌కులైతే.. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో వ‌చ్చిన సినిమాల‌పై ఎలాగైనా ఓ లుక్కు మాత్రం వేసేస్తారు. ఇక విష‌యానికి వ‌స్తే.. యూట‌ర్న్ సినిమాను ఏక‌కాలంలో అటు తెలుగులో, ఇటు త‌మిళంలో రూపొందించారు. ఇందులో స‌మంత కీ రోల్‌. ఇక భూమిక‌, ఆదిపినిశెట్టి, రాహుల్ ర‌విచంద్ర‌న్ కూడా న‌టించారు. ఈ సినిమాలో ర‌చ‌న‌( స‌మంత) ఓ ఆంగ్ల ప‌త్రిలో రిపోర్ట‌ర్‌గా ప‌ని చేస్తుంది. రామేశ్వ‌రం బ్రిడ్జిపై త‌రుచూ జ‌రిగే ప్ర‌మాదాల‌పై ఓ క‌థ‌నం రాయాల‌ని స‌మంత ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇందులోనూ ఆ బ్రిడ్జిపై యూట‌ర్న్ తీసుకునే క్ర‌మంలోనే ఎక్కువ‌గా ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. అయితే.. యూట‌ర్న్ తీసుకునే వాళ్ల‌ను ఇంట‌ర్వ్యూ చేయాల‌ని.. వారి వాహనాల నెంబ‌ర్ ప్లేట్ల‌ను క‌లెక్ట్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే తాను క‌లెక్ట్ చేసిన నెంబ‌ర్ వాహ‌న‌దారుడిని ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వెళ్ల‌గా.. అక్క‌డ అనూహ్య మ‌లుపు తిరుగుతుంది క‌థ. అదేమిటో తెలుసుకోవాలంటే మాత్రం థియేట‌ర్ల‌లోనే చూడాలి.

1536834104_u-turn

ఎలా ఉందంటే..!
చిక్కుల్లో ప‌డిన స‌మంత ఎలాంటి ఇబ్బందులు ఎదుక్కొంటుంది..? ఎస్సై నాయ‌క్‌( ఆది) ఆమెను ఎందుకు ఇంట‌రాగేట్ చేస్తాడు..? అస‌లు యూట‌ర్న్ తీసుకున్న వాళ్లంద‌రూ ఎందుకు చ‌నిపోతారు..? ఇందులో రాహుల్ ర‌వింద్ర‌న్ పాత్ర ఏమిటి..? మ‌ధ్య‌లో భూమిక ఏం చేస్తుంది..? త‌దిత‌ర అంశాల‌న్ని కూడా ప్రేక్ష‌కుల‌ను దాదాపుగా కుర్చీల‌కు అతుక్కునేలా చేస్తాయి. ఇందులో ప్ర‌ధానంగా స‌మంత్ అన్నీ తానై సినిమాను ముందుకు న‌డిపిస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. త‌న న‌ట‌న‌తో.. స‌న్నివేశాల‌కు త‌గిన‌ట్లుగా అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇక ఆది కూడా త‌న‌పాత్ర‌కు న్యాయం చేశార‌నే చెప్పొచ్చు. భూమిక పాత్ర కూడా ఆక‌ట్టుకుంటుంది. అయితే.. మొదటి భాగంలో ఉత్కంఠ రేపిన స‌న్నివేశాలు.. రెండో భాగంలో కొంత సాగ‌దీత‌గా ఉండ‌డం కొంత నిరాశ క‌లిగింది. అయితే.. ఈ చిత్ర దర్శకుడు పవన్ కుమార్ ఒక మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడనే చెప్పాలి. దాదాపు తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పేశాడు. నికెత్ బొమ్మి రెడ్డి కెమెరాతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడు. పూర్ణ చంద్ర అందించిన సంగీతం ఆక‌ట్టుకుంది.

చివ‌రిగా..! యూట‌ర్నేలేని స‌మంత‌

TJ రేటింగ్ : 3 /5

యూట‌ర్న్ మూవీ రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts