మ‌హేశ్ కోసం బాల‌య్య వెయిటింగ్‌..!

October 29, 2018 at 11:43 am

విశ్వవిఖ్యాత న‌టుడు, రాజ‌కీయ దురంధ‌రుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవితం ఆధారంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌యోపిక్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ బ‌యోపిక్‌ను రెండుభాగాలుగా వ‌స్తుంది. ఇందులో మొద‌టి భాగం క‌థానాయ‌కుడు, రెండో భాగం మ‌హానాయ‌కుడు. ఈ రెండు కూడా ఏక‌కాలంలో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంటున్నాయి. అయితే.. క‌థానాయ‌కుడు షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన‌ట్టే.. కానీ.. కొంత మాత్రం మిగిలే ఉంది. అదేమిటంటే.. ఈ సినిమాలో క‌`ష్ణ‌పాత్ర‌. ఎన్టీఆర్‌, క‌`ష్ణ‌కు మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. దీంతో ఆయ‌న పాత్ర లేకుండా ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తీయ‌డం బాలకృష్ణకు అస్స‌లు ఇష్టం లేదట‌.

Ntr-Anr-Krishna-1

Mahesh-Babu-to-play-Superstar-Krishna-in-NTR-biopic

అయితే.. కృష్ణపాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు..? అన్న విష‌యంపై చాలా రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా హీరో మ‌హేశ్‌బాబు క‌`ష్ణ పాత్ర‌లో న‌టిస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో బాల‌య్య ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేర‌కు స్వ‌యంగా ఆయ‌న మ‌హేశ్‌కు ఫోన్ చేసి.. కృష్ణ పాత్ర‌లో న‌టించాల‌ని అడిగిన‌ట్లు స‌మాచారం. కానీ.. మ‌హేశ్ మాత్రం ఈ విష‌యంలో ఇంకా నిర్ణ‌యం తీసుకోన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న కోసం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఆగిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న క‌నుక ఓకే చెబితే పూర్తి అయిన‌ట్టేన‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి.

ఒక‌వేళ‌.. క‌`ష్ణ పాత్ర‌లో న‌టించ‌డానికి మ‌హేశ్ సానుకూలంగా లేకుంటే.. క‌థానాయ‌కుడులో క‌`ష్ణ‌పాత్ర లేకుండానే పూర్తి చేయాల‌ని బాల‌య్య‌బాబు అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆ పాత్ర‌లో మ‌హేశ్ న‌టిస్తేనే దానికి సార్థ‌క‌త ఉంటుంద‌న్న న‌మ్మ‌కంతో ఆయ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. కానీ.. ప్ర‌స్తుతం ఆమెరికాలో త‌న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మ‌హేశ్‌. ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య‌, ఏఎన్నార్ పాత్ర‌లో సుమంత్‌, చంద్ర‌బాబు పాత్ర‌లో రానా, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మ‌హేశ్ కోసం బాల‌య్య వెయిటింగ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts