మెహ‌ర్ ర‌మేశ్‌పై న‌మ్రత ఫైర్!

October 26, 2018 at 12:15 pm

హీరో మ‌హేశ్‌బాబుకు ఊహించ‌ని షాక్‌.. ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్‌పై న‌మ్రత సీరియస్‌గా ఉన్నార‌ట‌. అదేంటీ.. మ‌హేశ్‌తో మెహ‌ర్ ర‌మేశ్ మంచి రిలేష‌న్ మెయింటెన్ చేస్తాడు క‌దా..! ఇప్పుడేం జ‌రిగిందని అనుకుంటున్నారా..? మీ డౌటు నిజ‌మే. అదేమిటో తెలుసుకుందాం.. బాబి సినిమా నుంచి మ‌హేశ్‌కు ర‌మేశ్‌ల మ‌ధ్య అనుబంధం ఏర్ప‌డింది. మెహ‌ర్‌ను ఫ్యామిలీ మెంబ‌ర్‌లాగే మ‌హేశ్ కుటుంబం ట్రీట్ చేస్తారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ఓ ఈవెంట్ ప్రోగ్రాంను నిర్వ‌హించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. కానీ.. చివ‌రి న‌మిషంలో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ కావ‌డంతో మ‌హేశ్ ఫ్యామిలీ ముఖ్యంగా న‌మ్ర‌త గుర్రుగా ఉన్నార‌ట‌.

8_012118114154_080818112108

ఏన్ ఈవెనింగ్ విత్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు అనే పేరుతో న్యూయార్క్ లో రిత్విక్ క్రియేష‌న్స్ సంస్థ ఒక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేసింది. మ‌హేశ్‌ని క‌లుసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తామ‌ని రెండు నెల‌లుగా ప్ర‌చారం చేసింది. నిజానికి అక్టోబ‌ర్ 27న ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వ‌హిస్తామ‌ని పబ్లిసిటీ చేశారు. టికెట్ సేల్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ చివరినిమిషంలో ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. ఈవెంట్ వేదిక‌, సెక్యురిటీ అంశాల‌ కార‌ణంగా అక్టోబ‌ర్ 27న నిర్వ‌హించాల‌నుకున్న ఈవెంట్‌ని వేరే తేదీకి వాయిదా వేస్తున్నామ‌ని… టికెట్లు కొన్న వారికి తిరిగి డ‌బ్బు చెల్లిస్తామ‌ని రిత్విక్ క్రియేష‌న్స్ సంస్థ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ పోగ్రాం ఆగిపోవటానికి కారణం మెహర్ రమేష్ ఆయన టీమ్ పూర్ ప్లానింగేన‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి.. మొదట ఈ ఈవెంట్ ని ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్స్ కు అప్పగించాల‌ని అనుకున్నారు. కానీ.. మెహ‌ర్‌ రమేశ్‌ వెళ్లి నమ్రత ని కలిసి ఈవెంట్ ని పెద్ద సక్సెస్ చేస్తామని హామీ ఇచ్చి.. త‌న‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలిసింది. చివ‌ర‌కు ప్రోగ్రాం క్యాన్సిల్ కావ‌డంతో మెహర్ రమేష్ పై నమ్రత చాలా సీరియస్ అయిన‌ట్లు తెలిసింది. మ‌హేశ్‌ ప్ర‌స్తుతం అమెరికాలో మ‌హ‌ర్షి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మ‌రో నెల రోజుల పాటు షూటింగ్ అక్క‌డే ఉంటారు.

మెహ‌ర్ ర‌మేశ్‌పై న‌మ్రత ఫైర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts