వామ్మో… ఇంత కష్టమా!

October 31, 2018 at 5:08 pm

తెలుగు సినిమా మార్కెట్ రోజురోజుకూ విస్త‌రిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా టాలీవుడ్ హీరోలు త‌మ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు సినిమాలు వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరాయి. వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ ఎమౌంట్ వంద‌కోట్ల‌ను దాటిపోయింది. ఇక‌ ఈ మ‌ధ్య పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాలు కూడా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతున్నాయి. టాక్ పాజిటివ్‌గా ఉంటే చాలు క‌నీస వ‌సూళ్లు మాత్రం గ్యారంటీ. కానీ.. టాలీవుడ్ నుంచి వ‌స్తున్న సినిమాల్లో ఒక‌టి రెండు మాత్ర‌మే.. అది కూడా ఎప్పుడో ఒక‌సారి మాత్రమే ప్ర‌పంచ వ్యాప్తంగా వంద‌కోట్ల షేర్ రాబడుతున్నాయి. 2018 సంవత్సరం తెలుగు సినిమా కలెక్షన్లను ఫాలో అవుతున్న ప్రతి స్టార్ హీరో అభిమానికి మరియు ట్రేడ్ విశ్లేషకులకు కను విప్పు లాంటిది. యూఎస్ఏ లో తెలుగు సినిమాలకు వస్తున్న కలక్షన్స్ కూడా ఇక్కడ కీలకంగా మారాయి.

అంటే.. టాలీవుడ్ సినిమాలు వంద‌కోట్లు షేర్ సాధించ‌డం ఇంకా కష్టంగానే ఉన్న‌ద‌ని చెప్పుకోవ‌చ్చు. బాహుబలి సిరీస్ కాకుండా ఈ ఘనత సాధించిన సినిమాలు కేవలం మూడు మాత్రమే ఉండటం ఇందుకు ఒక ఉదాహరణ. ఒక్క‌సారి 2018లో విడుద‌ల అయిన సినిమాలు చూస్తే.. రెండు సినిమాలు మాత్ర‌మే వ‌రల్డ్ వైడ్‌గా వంద‌కోట్ల షేర్ సాధించాయి. మ‌హేశ్‌బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా మాంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. సామాజిక అంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్స్ జోడించి హిట్ కొట్ట‌డం కొర‌టాల‌కు కొట్టిన పిండే మ‌రి.

Mahesh-Babus-Look-In-Bharat-Ane-Nenu-is-Out

అదేవిధంగా.. రంగ‌స్థ‌లం సినిమా టాలీవుడ్‌లో దుమ్మురేపింది. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాతో సుకుమార్ ప్ర‌భంజ‌నం సృష్టించారు. ఇక రాంచ‌ర‌ణ్ మాత్రం త‌న స‌త్తా ఏమిటో రుచి చూపించాడు. త‌న‌లోని కొత్త న‌టుడిని ప‌రిచ‌యం చేశాడు. ఇలా ఈ ఏడాదిలో ఈ ఇద్ద‌రు యంగ్ హీరోలు మాత్రమే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100కోట్ల షేర్ సాధించారు. ఇక అంత‌కుముందు వెట‌ర‌న్ హీరో చిరంజీవి ఖైదీ 150తో వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరాడు.

rangasthalam-7591

ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే యావరేజ్ లేదా ఎబోవ్ యావరేజ్ తెలుగు సినిమా ఇంకా 100 కోట్ల షేర్ సాధించే స్థాయికి రాలేదు, కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వస్తేనే ఇది సాధ్యం. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వస్తేనే ఇది సాధ్యం, ఇందుకు రామ్ చరణ్ నటించిన రంగస్థలం మంచి ఉదాహరణ.రంగస్థలం అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చటంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సులభంగా రూ 125 షేర్ సాధించింది.

Aravinda-Sametha-Not-Worried-–Going-As-Planned-2

రీసెంట్ వచ్చిన ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ కూడా 100 కోట్ల షేర్ ఈజీ గా కొట్టేస్తాది అనుకున్నారు, మొదట ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కూడా ఆ విధంగానే ఉంది కానీ ఎంటర్ టైన్మెంట్ లేక పోవడంతో రిపీటెడ్ ఆడియెన్సు లేక పోవడంతో కాస్త అటుఇటుగా ఆ మార్క్ వరకు వచ్చి ఆగింది. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌ మీద కూడా మంచి ఎక్సపెటేషన్స్ ఉన్నాయ్, ఎందుకంటే మాస్ ప్రేక్షకుడి నుంచి క్లాస్ ప్రేక్షకుడి వరకు చేరుకోగలిగే స్టోరీ లైన్ ఇదని చెప్పాలి.. మరి బాలయ్య ఏం చేస్తాడో చూడాలి మ‌రి.

వామ్మో… ఇంత కష్టమా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts