ఆచంట‌లో పితాని గెలుపు సాధ్య‌మేనా..?

October 20, 2018 at 3:17 pm
Tough time for pithani satyanarayana

పితాని స‌త్య‌నారాయ‌ణ‌. కూల్ గా ఉన్న రాజ‌కీయంగా మాత్రం ఫుల్ క‌ల‌రింగ్ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందా రు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా.. ప్ర‌జ‌లు మాత్రం ఆయ‌న వెంటే అనే స్థాయిలో రాజకీయాలు చేశారు. 2009లో కాంగ్రెస్ నుం చి, 2014లో టీడీపీ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన పితాని.. మూడోసారి వ‌రుస విజ‌యం కోసం త‌హ‌త‌హ‌లాడు తు న్నారు. 2009లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన పితాని.. కిర‌ణ్ కుమార్ మంత్రి వ‌ర్గం లో మంత్రిగా కూడా నామినేట్ అయ్యారు. అయితే, విభ‌జ‌న నేప‌థ్యంలో ప‌రువు పోయిన కాంగ్రెస్‌లోనే ఉంటే.. తాను ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని భావించిన ఆయ‌న‌.. వెంట‌నే టీడీపీలోకి జంప్ చేశారు. టీడీపీలోనూ గెలుపొందారు. మ‌ధ్య‌లో ఆయ‌న కిర‌ణ్‌కుమార్ జై స‌మైక్యాంద్ర పార్టీలోకి కూడా వెళ్లారు.

దీంతోనే ఆయ‌న‌కు పార్టీల‌తో సంబంధం లేదు.. ప్ర‌జ‌ల‌తోనే.,. అనే వ్యాఖ్య‌లు వినిపించాయి. అయితే, ఈ ద‌ఫా మాత్రం హ్యాట్రిక్ కొంచెం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ప‌రిస్థితు లు మారుతున్నాయ‌ని చెబుతున్నారు. గ‌డిచిన ప‌దేళ్లుగా పితానికి కంచుకోట‌గానే ఉన్న ఆచంట‌లో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వైసీపీ నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ఉన్నారు. ఇక్క‌డ గ‌త ప‌దేళ్లుగా మంత్రిగా పితాని స‌త్య‌నారాయ‌ణే ఉన్నార‌ని అయినా కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి మేలూ జ‌రిగింది లేద‌ని కౌరు ప్ర‌చారం ఊపందిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న బాధితుల‌ను మీడియా ముందుకు తీసుకు వ‌స్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న మీడియా ముందే చెప్పేలా చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో మ‌హిళ‌లలో తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. తాము ఎన్నో ఆశ‌ల‌తో పితానికి ఓట్లేసి గెలిపించుకున్నామ‌ని, కానీ, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ క‌నిపించ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. ఇళ్ల‌ప‌ట్టాల స‌మ‌స్య‌ను పితాని కాంగ్రెస్‌లో ఉండగానే వెల్ల‌డించామ‌ని, అయినా కూడా ఇప్ప‌టికీ ప‌రిష్కారం కాలేద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అదేస‌మ‌యంలో తాగునీరు లేక ఇబ్బందులు ప‌డుతున్నామని వాపోతున్నారు. ఇక‌, ఇసుక మాఫియా చెల‌రేగిపోతోంద‌ని, గోదావ‌రిలో ఇష్టానుసారంగా ఇసుక‌ను తోడేస్తుండ‌డంతో వ‌ర‌ద‌లు వ‌చ్చి లోత‌ట్టు ప్రాంతాలు మున‌క‌కు గుర‌వుతున్నాయ‌ని వారు పేర్కొంటున్నారు.

ఇక‌, ర‌హ‌దారుల ప‌రిస్తితి స‌రేస‌రి! ఒక‌ప‌క్క చంద్ర‌బాబు ఎన్నో వ్యూహాల‌తో ముందుకు సాగుతుంటే.. పితాని మాత్రం త‌న రాజ‌కీయ వ్యూహాలతోనే ఉనికిని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. ఇక జ‌న‌సేన నుంచి పితాని వ‌ర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్సీ మ‌ల్లుల ల‌క్ష్మీనారాయ‌ణ పోటీ చేస్తుండ‌డంతో పితాని క్యాస్ట్‌ ఓట్లు చీలిపోయే ప్ర‌మాదం ఉంది. దీంతో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోరు హోరా హోరీగా సాగుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి పితాని హ్యాట్రిక్ కొడ‌తాడా లేదా చూడాలి.

ఆచంట‌లో పితాని గెలుపు సాధ్య‌మేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts