రజని&శంకర్ మాయాజాలం 2.0 రివ్యూ..హిట్టా పట్టా ?

November 29, 2018 at 2:13 pm

విడుదల తేదీ : నవంబర్ 29, 2018

నటీనటులు : రజినీకాంత్ ,అక్షయ్ కుమార్ ,అమీ జాక్సన్ తదితరులు

దర్శకత్వం : యస్ శంకర్

నిర్మాత : సుభాష్ కరణ్

సంగీతం : ఏఅర్ రహమాన్

సినిమాటోగ్రఫర్ : నిరవ్ షా

స్క్రీన్ ప్లే : యస్ శంకర్

ఎడిటింగ్ : ఆంటోనీ

సూపర్‌ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. ఏఅర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. ఈచిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !DtJhTLGUUAA0LG7

కథ :

చెన్నై న‌గ‌రంలో ఉన్నట్టు ఉండి సడెన్ గా ప్రజల సెల్ ఫోన్స్ గాలిలోకి వెళ్ళిపోయి మాయమవుతూ ఉంటాయి. అసలా ఫోన్స్ ఎలా మయమవుతున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో పోలీసులకు, ప్రజలకు ఏం అర్థం కాదు.. ఈ విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి సైంటిస్ట్ వశీకరన్ (రజినీ కాంత్ ) రంగంలోకి దిగుతాడు. తన టెక్నాలజీని ఉపయోగించి.. చివరకి ఆ సెల్ ఫోన్స్ ను ఓ నెగిటివ్ ఫోర్స్ మాయం చేస్తోంది గుర్తిస్తాడు.
మాయ‌మ‌వుతున్న సెల్‌ఫోన్స్ అన్నీ క‌ల‌సి ఒక పక్షి ఆకారంలో మారి అతి దారుణంగా కొంతమందిని చంపుతూ ఉంటుంది. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి తప్పని పరిస్థితుల్లో సైంటిస్ట్ వశీకరన్ రోబో చిట్టిని రీ అసెంబుల్ చేయ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది. అలా చిట్టి నెగిటివ్ ఫోర్స్ ని అంతం చెయ్యడానికి ఏం చేసింది.. ఈ క్ర‌మంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. మ‌రి చిట్టి ఆ ప‌క్షిని అంతం చేస్తుందా..? ల‌ఏదా..? ఈ క్రమంలో చిట్టి 2.ఓ గా రీ లోడ్ ఎలా చెయ్యబడతాడు ? అసలు ఆ నెగిటివ్ ఫోర్స్ కు సెల్ ఫోన్స్ కు ఉన్న సంబంధం ఏమిటి ? అస‌లు దానికి గ‌ల నేప‌థ్యం ఏంటీ ? చిట్టి 2.ఓ ఈ పరిస్థితి ని ఎలా అదుపులోకి తీసుకువస్తాడు ? లాంటి విషయాలను ప్రేక్ష‌కులు తెర‌పైనే చూసి తెలుసుకోవాలి.

బ‌లం చేకూర్చే అంశాలు :

అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకి అత్యంత పెద్ద ప్ల‌స్ పాయింట్‌. భారీ త‌నం ప్ర‌తి ఫ్రేములో క‌న‌బ‌డుతుంది. దీనికి తోడు భారీ తారాగణం అద‌న‌పు బ‌లంగా చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమా విజువల్ వండర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో రోజులుగా ఊరిస్తూ వ‌చ్చిన శంక‌ర్ సినిమాను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తార‌న‌డంలో ఎలాంటి అనుమానం లేదు. శంక‌ర్ గ‌త చిత్రాల క‌న్నా ఇది మ‌రో మెట్టును అధిగ‌మించంద‌నే చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్‌గ్ క‌లుగుతుంది. ఈ విష‌యంలో దర్శకుడికి మరియు ఆయన టీమ్కు ప్రత్యేకంగా అభినందనలు చెప్పాల్సిందే.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తన పరిపక్వతమైన నటనను కనబర్చారు. క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ ను చూపారు. ముఖ్యంగా 2.ఓ గా రీ లోడ్ అయ్యాక రజిని తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా అలరిస్తారు. ఇక సినిమాకే అతి కీలక మైన పాత్రలో అత్యంత క్రూరమైన పాత్రలో మరియు క్రో మ్యాన్ గా నటించిన అక్షయ్ కుమార్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో అక్షయ్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. శంకర్ ఎక్కడా విజువల్ ట్రీట్ తగ్గకుండా.. మరియు కథలోని ఎమోషన్ని చాలా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. సెల్ ఫోన్ కు సంబధించి ఆయన చెప్పాలనుకున్న అంశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. అలాగే సినిమాలో ఆయన ఇచ్చిన గ్లోబల్ మెసేజ్ కూడా మెచ్చుకోతగినది.99999

త‌ప్పిదాలు…:

దర్శకుడు శంకర్ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథనం మీద పెట్టలేదనిపిస్తుంది. సినిమాలోని ఒక్కో సన్నివేశం వీడిగా చూస్తే, ఆ యాక్షన్ సన్నివేశాలు మరియు ఆ రిచ్ విజువల్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. కానీ సినిమా మొత్తంగా చూసుకుంటే అక్కడక్కడ కథనం ప్లో తప్పగా.. కొన్ని సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా సాగవు. దీనికి తోడు సినిమా మొత్తం చాలా సీరియస్ గా సాగుతూ ఉండటం వల్ల.. ఎంటర్ టైన్మెంట్ కొంత మిస్స‌యింద‌నే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది. అమీ జాక్సన్ కూడా ఒక రోబో అవ్వటం వల్ల.. సినిమాలో హీరోయిన్ మిస్ అయిందనే ఫీల్ కూడా కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శంకర్ భారీ విజువల్స్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించి గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంతసేపూ ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తెచ్చిన దర్శకుడు పనితనం మెచ్చుకోని తీరాలి. అయితే కొన్ని సన్నివేశాలను అద్భుత విజువల్స్ తో బాగా తెరకెక్కించినప్పటికీ.. కథనం మాత్రం ఆ స్థాయిలో ఆయన రాసుకోలేదు.
ఏఅర్ రెహమాన్ అందించిన సంగీతం బాగుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉన్న విజువల్స్ ను ఇంకా ఎలివేట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఆయన, దర్శకుడి ఆలోచనకు తగ్గట్లు భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఆంటోని ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇలాంటి విజువల్ వండర్ ని అందించినందుకు సుభాష్ శరన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి.

చివరిగా… తెరపై వండర్
రేటింగ్ :3.25/5

రజని&శంకర్ మాయాజాలం 2.0 రివ్యూ..హిట్టా పట్టా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts