‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’మూవీ రివ్యూ..హిట్టా పట్టా ?

November 16, 2018 at 4:01 pm

నటులు : రవితేజ, ఇలియానా, తరుణ్‌ అరోరా,సునీల్‌
దర్శకత్వం : శ్రీను వైట్ల
నిర్మాత : నవీన్‌ ఎర్నేని, వై.రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి
సంగీతం : ఎస్‌. తమన్‌

గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ సారి మంచి హిట్ సాధించాలనే ప్రయత్నంలో ఉన్నారు. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘రాజాది గ్రేట్’సినిమాతో మంచి సక్సెస్ పొందిన రవితేజ తర్వాత వచ్చిన సినిమాలతో ఢీలా పడిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల-మాస్ మహరాజ రవితేజ కాంబినేష్ లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 567

కథ :
ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్‌ ప్రసాద్‌ తన కొడుకు అమర్‌ (రవితేజ)ను, సంజయ్‌ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. హాయిగా సాగుతున్న వీరి జీవితాల్లో అలజడి మొదలవుతుంది.. రాజ్‌వీర్‌, విక్ర‌మ్ త‌ల్వార్‌, సాబు మీన‌న్‌, క‌ర‌ణ్ ఆరోరాలు చంపేసి ఆ కంపెనీన హ‌స్త‌గ‌తం చేసుకుంటారు. కానీ వారి స్నేహితుడు జ‌లాల్‌(షాయాజీ షిండే) బ్ర‌తికిపోతారు. ఆ సమయంలో తప్పించుకున్న ఆనంద్‌ ప్రసాద్‌ తనయుడు అమర్‌ (రవితేజ) 14 సంవత్సరాల జైలు జీవితం గడిపి రిలీజ్ అవుతాడు. తన కుటుంబాన్ని అన్యాయంగా చంపిన వారిపై పగబడతాడు అమర్. తన తల్లిదండ్రులకు దూరమైన అమర్‌, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ఈ కథలో అక్బర్‌, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
గత కొంత కాలంగా మంచి సక్సెస్ లేకుండా సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల ఎంతో కసితో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. కాకపోతే అయితే ఆ అంచనాలు శ్రీను వైట్ల ఏ మాత్రం అందుకోవడంతో కాస్త తడబట్టు కనిపిస్తుంది. ఓ మామూలు రివేంజ్‌ డ్రామా కథకు న్యూయార్క్‌ బ్యాక్‌ డ్రాప్‌ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా చాలా సన్నివేశంలో కామెడీ కావాలని ఇరికించారన్న భావన కలుగుతుంది. ర‌వితేజ ఫుల్ ఎన‌ర్జీతో అమ‌ర్, అక్బ‌ర్‌, ఆంటోని అనే పాత్ర‌ల‌ను చ‌క్క‌గా వేరియేష‌న్‌తో చేశాడు. ప‌గ తీర్చుకునే అమ‌ర్‌.. ప‌క్క‌వాడికి స‌హాయ‌ప‌డాల‌నుకునే అక్బ‌ర్‌… రోగుల‌కు వైద్యం చేసే డాక్ట‌ర్ అంటోని అనే పాత్ర‌ల్లో చ‌క్క‌టి వేరియేష‌న్ క‌న‌ప‌డుతుంది. కాకపోతే ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కు త‌గిన‌ట్లు పాత్ర‌ల‌ను డిజైన్ చేశాడు. ఇక విల‌న్స్‌గా న‌టించిన వారిలో త‌రుణ్ ఆరోరా, ఆదిత్య మీన‌న్‌, విక్ర‌మ్ జీత్‌, రాజ్‌వీర్ పాత్ర‌ల్లో గొప్ప విల‌నిజం అయితే క‌న‌ప‌డ‌దు. వీరి పాత్ర‌ల డిజైనింగ్‌ను శ్రీనువైట్ల స‌రిగ్గా చేసుకోలేదు. సినిమాకు మేజర్ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా, అందంగా, లావిష్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడుకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు.

నటీనటులు :
‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ మాస్ మహరాజ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ తానై చూపించాడు. ముఖ్యంగా అమర్‌ పాత్రలో రవితేజ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. అక్బర్‌, ఆంటొనీల పాత్రల్లో కామెడీ కొంతమేరకు వర్క్‌ అవుట్‌ అయినా సహజంగా అనిపించదు. ఒకప్పుడు నడుం వొంపుల సుందరిగా గోవా బ్యూటీ ఇలియానా కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించింది..కానీ ఈసారి మాత్రం బొద్దుగా ముద్దుగా తయారైంది. అయినా కూడా ఇలియాన అందం, నటనతో బాగా ఆకట్టుకుంది. ఇక కామెడీ పరంగా సునీల్, వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్‌ రెడ్డి తమదైన కామెడీ మార్క్ చాటుకున్నారు. తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్‌, విక్రమ్‌జీత్‌ విర్క్‌ స్టైలిష్‌ విలన్లుగా కనిపించారు. విలక్షణ నటుడు షాయాజీ షిండేకు చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర దక్కింది. జలాల్‌ అక్బర్ పాత్రలో ఆయన నటన బాగుంది. సత్య, రఘుబాబు, గిరి, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌ రెడ్డి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :
దర్శకుడిగా శ్రీను వైట్ల చాలా వరకు కష్టపడ్డట్లు ఈ సినిమాలో కనిపిస్తుంది. వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం యూఎస్ లో బాగా అందంగా షూట్ చేశారు. ఇక తమన్ మ్యూజిక్ కాస్త పరవాలేదు అనిపించింది..బిజిఎం ఓకే. మైత్రి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎం.ఆర్ వర్మ ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సిందిగా అనిపిస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌ : రవితేజ, ప్రొడక్షన్ వాల్యూస్, కామెడీ
మైనస్ పాయింట్స్: పాత కథ, స్క్రీన్‌ ప్లే, నేప‌థ్య సంగీతం

బాటం లైన్ : అమ‌ర్ అక్బ‌ర్ అంటోని.. పాత సీసాలో కొత్త మందు

రేటింగ్ : 2.5/5

‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’మూవీ రివ్యూ..హిట్టా పట్టా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts