‘అఅఆ’ అంద‌రూ క‌మెడియ‌న్లే..!

November 8, 2018 at 10:47 am

ఈ మ‌ధ్య ద‌ర్శ‌కులు కొత్త రూట్లు వెతుకుతున్నారు. త‌మ సినిమాల పేరుకు త‌గ్గ‌ట్టుగా టీజ‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌లు విడుద‌ల చేయ‌డం లేదు. పేర్ల‌కు భిన్నంగా విడుద‌ల చేసి.. స‌రికొత్త కిక్ పుట్టిస్తున్నారు. మొన్న బోయ‌పాటి శ్రీ‌ను విన‌య విధేయ రామ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను కూడా ఇలా విడుద‌ల చేశారు. పేరేమో సాఫ్ట్‌గా ఉంటే.. రాంచ‌ర‌ణ్ ఫ‌స్ట్‌లుక్ మాత్రం హార్డ్‌గా ఉంది. తాజాగా.. శ్రీ‌నువైట్ల – ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ సినిమా టీజ‌ర్‌, ఫ‌స్ట్‌లుక్ ఎంతో సీరియ‌స్‌గా ఉన్నాయి. ఈ సినిమా మొత్తం కామెడీనే ఉంటుంద‌ని చిత్రం యూనిట్ చెబుతోంది.

DrIhbnEVsAAx3FZ

ఇదే విష‌యాన్ని జ‌నంలోకి తీసుకెళ్లేందుకు చేప‌ట్టిన ప్ర‌చార కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్టింది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు సంబంధించి టోటల్ కమెడియన్స్ తో ఓ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ర‌వితేజ మ‌ధ్య‌లో కూర్చోగా శ్రీనివాసరెడ్డి ప్రశ్నలు అడుగుతుండ‌గా సత్య, వెన్నెల కిషోర్, గిరి, రవితేజ, శ్రీనువైట్ల సమాధానాలు చెబుతుంటారు. కేవలం సినిమాలోని కామెడీ గురించి మాట్లాడుకుంటూ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. అమ‌ర్‌, అక్బ‌ర్‌, ఆంటోని పాత్ర‌ల్లో ఒక్క‌రే న‌టిస్తారా..? లేక ముగ్గురు న‌టిస్తారా..? అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. అయితే.. ఈ సినిమాలో అమర్, అక్బర్, ఆంటోనీ పాత్రలు మూడూ కామెడీ పండిస్తాయ‌ని రవితేజ చెబుతున్నాడు.

అంటే మొత్తంగా శ్రీ‌నివైట్ల మార్క్‌లోనే కామెడీ ఉంటుంద‌ని అర్థం చేసుకోవాల‌న్న‌మాట‌. ఇక్క‌డ శ్రీ‌ను వైట్ల ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశాడు. తన కెరీర్ లో దూకుడు సినిమా కాస్త ఎమోషనల్ గా ఉంటుందని, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఆమాత్రం ఎమోషనల్ టచ్ కూడా ఉండదంటున్నాడు శ్రీనువైట్ల. అయితే.. టీజ‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌లో సిరియ‌స్‌నెస్ చూపించ‌డంలో ఆయ‌న ఆంత‌ర్యం ఏమిన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. దీంతో అమ‌ర్‌, అక్బ‌ర్‌, ఆంటోని పాత్ర‌లపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తిని పెంచేందుకు ఇలాంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌న్న‌మాట‌. ఈ సినిమాతోనైనా.. ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల తెర‌పై మ్యాజిక్ చేస్తారో లేదో చూద్దాం మ‌రి.

‘అఅఆ’ అంద‌రూ క‌మెడియ‌న్లే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts