మహేష్, క్రిష్… ఇక ఫిక్స్ అయినట్టే!

November 8, 2018 at 1:19 pm

మ‌హేశ్‌బాబు వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా ఉంటున్నాడు. భ‌ర‌త్ అనే నేను సినిమా మాంచి విజ‌యం సాధించిన త‌ర్వాత ఆయ‌న‌లో మ‌రింత ఉత్సాహం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌హ‌ర్షి సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండ‌గానే.. ఆయ‌న మ‌రో సినిమా కోసం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. నిర్మాత అల్లు అర‌వింద్‌తో క‌లిసి సినిమా తీసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొత్త సినిమా రాబోతోంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన మ‌రికొన్ని విష‌యాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

22beac75eefa2c2c02b038b94308e123

నిజానికి ఈ సినిమా కోసం ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో ఒక‌రు అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి, మ‌రొక‌రు క్రిష్‌. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఫైన‌ల్ అవుతారు. అయితే.. ఇక్క‌డ క్రిష్‌కే అవ‌కాశం ద‌క్కింద‌నే టాక్ కూడా వినిపిస్తోంది. మ‌హేశ్ కూడా క్రిష్‌వైపే మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హ‌ర్షి పూర్తి అవ‌గానే దీనికి సంబంధించిన మ‌రిన్ని విష‌యాల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు మాత్రం క‌నిపిస్తున్నాయి. గీతా ఆర్స్ట్‌పై వ‌స్తున్న ఈ సినిమా గ్రాండ్‌గా ఉంటుంద‌నే టాక్ అప్పుడో మొద‌లైంది.

ఇక మ‌హేశ్‌, క్రిష్ కాంబినేష‌న్‌లో సినిమా కోసం అభిమానులు దాదాపుగా ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వీరి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తోంద‌ని రూమ‌ర్లే త‌ప్ప ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్‌మీద‌కు వెళ్లింది. అయితే.. ఆ మ‌ధ్య శివ‌మ్ పేరుతో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుంద‌నే పుకార్లు వ‌చ్చాయి. ఏదేమైనా.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌తోనైనా క్రిష్‌- మ‌హేశ్ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుండ‌డంతో అభిమానులు ఆనంద‌ప‌డుతున్నారు. దీనికి సంబంధించిన అనేక ఊహాగానాలు అప్పుడే మొద‌ల‌య్యాయి.

మహేష్, క్రిష్… ఇక ఫిక్స్ అయినట్టే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts