పవన్ అక్కడ నుంచి కూడా పోటీ చేస్తాడా!

November 7, 2018 at 10:46 am

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లు భ‌లేగా ఉంటాయి.. సినిమా డైలాగ్స్‌ను దాటుకుని ఆయ‌న ఇంకా బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. దీంతో పార్టీవ‌ర్గాల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ రోజు మాట్లాడిన మాటకు.. రేపు చేసే స్టేట్‌మెంట్‌కు సంబంధమే ఉండ‌క‌పోవ‌డంతో పార్టీ శ్రేణులు ఒకింత ఆందోళ‌న చెందుతున్నాయి. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌శ్న ఏమిటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎక్క‌డి నుంచి బ‌రిలోకి దిగుతారు..? అన్న‌దే. ఈ విష‌యంలో ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు గంద‌ర‌గోళంగా ఉంటున్నాయి. ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తే.. అక్క‌డి నుంచే పోటీ చేయాల‌ని ప్ర‌జ‌లు అడుగుతున్నార‌ని ప‌వ‌న్ అంటున్నారు. ఇప్ప‌టికే తిరుప‌తి, ఇచ్చాపురం, అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా.. కొత్త నియోజ‌క‌వ‌ర్గం పేరు వినిపిస్తోంది.

45593389_710820149317263_7730287825324605440_n

ఈ నేప‌థ్యంలో తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా పోటీ చేసేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఆస‌క్తిచూపుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉంటుంది. దీంతో ఇది బాగా క‌లిసి వ‌స్తుంద‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ట‌. అలాగే.. ఆయ‌న చేప‌ట్టిన ప్ర‌జాపోరాట‌యాత్ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న బాగా వ‌చ్చింద‌ని, ఇక అభిమానులైతే మొత్తం ఫ్లెక్సీల‌తో నింపేశార‌ట‌. నిజానికి.. ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డ కూడా ఇంత‌లా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌లేద‌ట‌. అభిమానులు, పార్టీశ్రేణుల ఉత్సాహం చూసిన ప‌వ‌న్ ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని అంటున్నారట‌. పిఠాపురం నుంచి పోటీ చేస్తే… గెలుపు ఖాయ‌మ‌ని పార్టీవ‌ర్గాలు అంటుండ‌డంతో ప‌వ‌న్ కూడా సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కానీ..పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నేప‌థ్యాన్ని చూస్తే.. ప‌రిస్థితులు కొంత భిన్నంగానే క‌నిపిస్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపుసామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉండ‌డంతో ప్ర‌తీ పార్టీ ఆ సామాజివ‌ర్గానికే టికెట్ ఇస్తుంది. 2009లో పీఆర్పీ నుంచి వంగా గీత గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో కేవ‌లం వెయ్యి ఓట్ల‌తో వ‌ర్మ‌పై గెలిచారు. ఇక 2014ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌కు చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌లేదు. విద్యాసంస్థ‌ల అధినేత పోతుల విశ్వంకు టికెట్ ఇచ్చారు. రెబ‌ల్‌గా బ‌రిలోకి దిగిన వ‌ర్మ‌.. ఏకంగా యాభైవేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ సారి కూడా ఆయ‌న‌కే టికెట్ వ‌స్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఒక‌వేళ‌.. తాను చెప్పిన‌ట్టు ప‌వ‌న్ ఇక్క‌డి నుంచి పోటీ చేస్తే ఆయ‌న‌కు గ‌ట్టిపోటీ మాత్రం త‌ప్ప‌ద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అయితే.. ఎప్పుడు కూడా ఒక మాట‌పై ఉండ‌ని ప‌వ‌న్ ముందుముందు ఏం చెబుతారో చూడాలి మ‌రి.

పవన్ అక్కడ నుంచి కూడా పోటీ చేస్తాడా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts