టీడీపీ గరుడకు పోటీగా వైసీపీ గవ్వలు రెడీ!

November 8, 2018 at 9:06 am

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ డైలాగ్ కింగ్ పృథ్వి త్వ‌ర‌లోనే గ‌వ్వ‌ల పురాణం రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇందులో ఒక్కో గ‌వ్వ ఒక్కో టీడీపీ నేత జాత‌కాన్ని చెబుతుంద‌ట‌. ఇదేమిటీ.. గ‌వ్వ‌ల పురాణం సినిమా అంటూ.. టీడీపీ నేత‌ల జాత‌క‌మ‌ని అంటున్నారేమిట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. నిజ‌మే ఇక్క‌డ మ‌న కామెడీ కింగ్ చెబుతున్న మాట‌ల్లో లాజిక్ ఉంది. దాని చుట్టూ మ‌న పృథ్వి టీడీపీ నేత‌ల తీరును ఉతికి ఆరేశారు. త‌న‌దైన పంచ్‌ల‌తో బెంబేలెత్తించారు. అయితే.. కొంత‌కాలంగా టీడీపీ నేత‌లు ఆప‌రేష‌న్ గ‌రుడు అంటూ మొత్తుకుంటున్నారు క‌దా..! ఇది టీడీపీ గ‌రుడ పురాణ‌మ‌ని.. దీనికి పోటీగా గ‌వ్వ‌ల పురాణం తీస్తాన‌ని, వాళ్లు చెప్పేది నిజ‌మైతే. తాను చెప్పేది కూడా నిజ‌మ‌వుతుంద‌ని పృథ్వి అంటున్నాడు.

30 years prudhvi-1484844621-1

జ‌గ‌న్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంపై కూడా పృథ్వి స్పందించారు. ప్ర‌తిప‌క్ష నేత‌ హత్యకు కుట్ర జరిగితే టీడీపీ నేతలు నవ్వుతూ ప్రెస్ మీట్లు పెట్టడాన్నిఆయ‌న‌ తీవ్రంగా ఖండించారు. ఒక జంతువుకు దెబ్బ తగిలితే 10 జంతువులు చుట్టూ చేరతాయని… ఆ పాటి జ్ఞానం, మానవత్వం కూడా టీడీపీ నేతలకు లేదని మండిప‌డ్డారు. ఒక‌వేళ‌ ఇదే దాడి చంద్రబాబుపై జరిగితే ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తారని, ఎయిర్ పోర్టులోనే దొర్లేసి రాష్ట్రమంతా రచ్చ చేస్తారని విమర్శించారు. ధర్మపోరాటం టైపులో మరో పేరు పెట్టి, అడ్డంగా పడిపోయి దొంగ దీక్షలు చేసేవారని ఎద్దేవా చేశారు. సింపతీ కోసం నటించాల్సిన అవసరం జగన్ కు లేదని పృథ్వి అన్నారు.

“టీడీపీ వాళ్లు ఏదేదో ఊహించుకొని గరుడ పురాణం రాశారు. మేం గవ్వల పురాణం రాస్తున్నాం. గవ్వలన్నీ అలా ఎగిరొచ్చి పడతాయి. ఒక్కొక్క గవ్వ ఒక్కో రాజకీయ నాయకుడి జాతకాన్ని బయటపెడుతుంది. రాస్తున్నాం, డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాం. గవ్వ బయటకొచ్చిందంటే టీడీపీ నేతల జాతకాలు బయటకొచ్చినట్టే. వాళ్లు గరుడపురాణం అన్నప్పుడు మేం గవ్వల పురాణం అంటే తప్పేముంది. మీరు చెప్పేది నిజమైతే, మేం చెప్పేది కూడా నిజమౌతుంది“ అని ఆయ‌న అన్నారు. “కత్తి చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు. హత్యా ప్రయత్నం జరిగిందా లేదా అనేది చూడాలి. అదే కత్తి గుండెలో గుచ్చుకుంటే మ‌రో రకంగా ఉండేది. మెడపై తగిలితే ఇంకో రకంగా ఉండేది. తీవ్రతను అర్థం చేసుకోవడం లేదు టీడీపీ. వీళ్లకు జరిగితే మాత్రం ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేస్తారు. ప్రతిపక్ష నాయకుడికి జరిగితే మాత్రం హాస్యం“ అని పృథ్వి మండిప‌డ్డారు.

prudhvi-joins-jagan-padayat

సింపతీ కోసం నటించాల్సిన అవసరం జగన్ కు లేదని… రాజశేఖర్ రెడ్డిగారి కుటుంబం డ్రామా కంపెనీ కాద‌ని… డ్రామాలు వాళ్లకు ఇష్టం ఉండదని ప‌`థ్వీ అన్నారు. పోనీ సింపతీ కోసమే చేశారనుకుంటే.. అలాంటప్పుడు కత్తి తగలగానే కింద పడిపోవాలి కదా… నానా హంగామా చేయాలి కదా… రాష్ట్రమంతా అల్లకల్లోలం చేయాలి కదా… అని అన్నారు. అయితే.. దెబ్బ తగిలినా జ‌గ‌న్‌ సింహంలా లేచారని… నవ్వుతూ నడుచుకుంటూ వెళ్లిపోయార‌ని.. దటీజ్ జగన్ అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అంతేగాకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు. టీడీపీ జనాలు అనుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో హంగ్ లు, బొంగులు ఏం రావన్నారు. అడ్డదిడ్డమైన సమీకరణాలు, కాంగ్రెస్ తో అక్రమ సంబంధాల్లాంటి వ్యవహారాలు వైసీపీలో ఉండవన్నారు. రాబోయే తీర్పు వన్ సైడ్ ఉంటుందని చెప్పుకొచ్చారు పృథ్వి.

టీడీపీ గరుడకు పోటీగా వైసీపీ గవ్వలు రెడీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts