‘సర్కార్’ మూవీ రివ్యూ& రేటింగ్

November 6, 2018 at 3:46 pm

నటీనటులు: విజయ్ – కీర్తి సురేష్ – వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్
నిర్మాత: వల్లభనేని అశోక్
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్

ఏఆర్ మురుగుదాస్‌- విజ‌య్ కాంబినేష‌న్‌కు త‌మిళంలో మాంచి క్రేజీ ఉంది. సెట్స్ మీద‌కు సినిమా వెళ్ల‌డ‌మే ఆల‌స్యం.. బ‌జ్ అమాంతంగా పెరుగుతూనే ఉంటుంది. ఇక అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు హైప్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. క‌త్తి, తుపాకీ సినిమాల త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా స‌ర్కార్‌. ఈ సినిమాను దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేశారు. ఏదో ఒక సామాజిక అంశాన్నిక‌థ‌గా అల్లుకుని ప్రేక్ష‌కుల మ‌న‌సు కొల్ల‌గొట్ట‌డం మురుగుదాస్‌కు బాగా తెలుసు. ఇక త‌మిళంలో విజ‌య్ మాంచి మాస్ ఇమేజ్ హీరో. తెలుగులోనూ ఆయ‌న సినిమాలు బాగానే ఆడుతాయి. మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మురుగుదాస్‌, విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌ర్కార్ సినిమా తెర‌పై మ‌ళ్లీ మ్యాజిక్ చేసిందో లేదో చూద్దాం…

DrRh7lAXgAAyGQl

క‌థేమిటంటే…

అమెరికాలోని ఓ ప్ర‌ముఖ కంపెనీ సీఈవో సుంద‌ర్‌(విజ‌య్‌). త‌న సొంతూరు చెన్నైలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు ఆయ‌న ఇక్క‌డి వ‌స్తాడు. పోలింగ్ కేంద్రానికి వెళ్ల‌గానే.. అప్ప‌టికే ఆయ‌న ఓటు మ‌రెవ‌రో వేసిన‌ట్లు తెలుసుకుంటాడు. దీంతో ఆయ‌న ఓటు వేయ‌కుండానే అక్క‌డి నుంచి వెనుదిరుగుతాడు. ఎలాగైనా త‌న ఓటును తాను వినియోగించుకునేందుకు న్యాయపోరాటానికి దిగుతాడు. ఈ క్ర‌మంలో కోర్టు కూడా ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేసి, మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశిస్తుంది. ఇక అక్క‌డి నుంచి కీల‌క మ‌లుపుతిరుగుతుంది సినిమా. స్వ‌యంగా విజ‌య్ కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిపైనే పోటీలో ఉంటాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న విజ‌యం సాధించాడా లేదా..? ఆ త‌ర్వాత సినిమాలో ఎలాంటి మ‌లుపు వ‌చ్చాయి..? అన్న‌ది మాత్రం తెర‌పైనే తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే..
గ‌త సినిమాలకు ఈ సినిమాకు ఎంతో తేడా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. మురుగుదాస్ ఎంచుకున్న లైన్ బాగానే ఉంది కానీ.. న‌డిపించిన తీరే కొంత ఇబ్బందిగా మారింది. త‌న ఓటును తానే వినియోగించుకోవ‌డానికి భార‌త పౌరుడిగా పోరాడ‌డం అనే అంశం కొత్త‌గానే ఉంది. అయితే.. ఇదే స‌మ‌యంలో మిగ‌తా క‌థంతా రొటీన్. ఇక్క‌డ ఒక్క విష‌యం చెప్పుకోవాలి. ఇక్క‌డ క‌థ‌ కంటే.. విజ‌య్‌ని న‌మ్ముకునే మురుగుదాస్ సినిమా తీసిన‌ట్లు అనిపిస్తుంది. ఇదే సినిమాకు పెద్ద మైన‌స్ అని చెప్పుకోవాలి. క‌థ‌ను ప‌క్క‌న ప‌డేసి.. విజ‌య్ ఇమేజ్‌ను ద‌`ష్టిలో పెట్టుకుని ఆయ‌న సినిమా తీశారు. అయితే.. త‌మిళ నెటివిటీకి కొంత క‌నెక్ట్ అవుతుంది కానీ.. తెలుగు ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకోవ‌డం కొంత క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఒక‌వేళ క‌థాంశాన్నే మ‌రింత బ‌లంగా చూపిస్తే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేది.

sarkar-759-1

ఎవ‌రెలా చేశారంటే..
ఈ సినిమాలో హీరో విజ‌య్ న‌ట‌నే హైలెట్‌. ఆయ‌న స్టైలిష్‌గా క‌నిపించిన తీరు అభిమానులను బాగా ఆక‌ట్టుకుంటోంది. డ్యాన్స్‌, ఫైట్లలో విజ‌య్ త‌న‌దైన ముద్ర చూపించాడు. ఇక మురుగుదాస్ అన్నిసినిమాల్లోగానే ఇందులోనూ హీరోయిన్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. పోలింగ్ ఏజెంట్‌గా కీర్తి సురేశ్ క‌నిపిస్తుంది. మొత్తంగా ఆమె త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. విల‌న్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సూప‌ర్బ్ అనిపించారు. సంగీతం విష‌యానికి వ‌స్తే.. ఏఆర్ ర‌హ‌మాన్ అందించి బాణీలు ఏమాత్రం ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి. ఇదే స‌మ‌యంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అదుర్స్‌. గిరీశ్‌ గంగాధరన్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువ‌లు రిచ్‌గా ఉన్నాయి. అయితే.. మొత్తంగా ఇక్క‌డ చెప్పుకోవాల్సిన విష‌యం ఏమిటంటే.. క‌థ‌ను వ‌దిలేసి.. హీరోని న‌మ్ముకుంటే.. ఇక అంతే సంగ‌తులేన‌ని స‌ర్కార్‌తో తెలుసిపోతుంది.

చివ‌రిగా… మురుగుదాస్ మార్క్‌లేని స‌ర్కార్‌

TJ రేటింగ్ – 2 .25 /5

‘సర్కార్’ మూవీ రివ్యూ& రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts