సవ్యసాచి మూవీ రివ్యూ …హిట్టా..పట్టా !

November 2, 2018 at 2:05 pm

స‌వ్య‌సాచి రివ్యూ…

విడుదల తేదీ: నవంబర్ 1, 2018
దర్శకుడు: చందూ మొండేటి
సంగీత దర్శకుడు: ఎం.ఎం. కీరవాణి
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, ఆర్ మాధ‌వ‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, భూమిక‌

భిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు హీరో నాగ‌చైత‌న్య‌. ల‌వ‌ర్‌బాయ్‌గా యూత్‌ను మెస్మ‌రైజ్ చేసిన చైతూ మాస్ హీరోగా నిల‌దొక్కుకోవ‌డాన‌కి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. కొన్ని యాక్ష‌న్ సినిమాలు చేసినా… స‌త్ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయాడు. కానీ.. ఆ దిశ‌గా మాత్రం ఆయ‌న ప్ర‌య‌త్నం ఆప‌డం లేదు. ఈ క్ర‌మంలో తాజాగా వ‌చ్చిన సినిమానే స‌వ్య‌సాచి. ఈ సినిమాకు చందు కొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా హీరోగా నాగ చైత‌న్య‌, విల‌న్‌గా ఆర్ మాధ‌వ‌న్‌, హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ న‌టించారు. అయితే ప్రేమ‌మ్ లాంటి మాంచి హిట్ ఇచ్చిన చందు చెప్పిన క‌థ‌ను చైతూ న‌మ్మి చేశాడు. నిజానికి.. ఇది కొంత భిన్న‌మైన స్టోరీ లైన్ అనే చెప్పాలి. అయితే.. దానిని న‌డిపించిన తీరే ఇక్క‌డ ప్ర‌ధానం.. అది ఎలా ఉందో చూద్దాం.43595997_968491096668029_2858598505570631680_n

క‌థేమిటంటే..: హ‌మాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ప్రాంతానికి టూర్‌కు వెళ్తుండ‌గా బ‌స్సు ప్ర‌మాదానికి గురై విక్ర‌మ్‌( నాగ‌చైత‌న్య‌) మిన‌హా అంద‌రూ చ‌నిపోతారు. దవాఖాన‌లో ట్రీట్‌మెంట్ పొందిన త‌ర్వాత కులు వ్యాలీలోని అక్క‌, బావ‌( భూమిక‌, భ‌ర‌త్‌రెడ్డి) ద‌గ్గ‌ర‌కు వెళ్తాడు. మేన‌కోడ‌లు మ‌హాల‌క్ష్మి అంటే నాగ‌చైత‌న్య‌కు ప్రాణం. కాలేజీలో చిత్ర‌( నిధి అగ‌ర్వాల్)ను ప్రేమిస్తాడు. అనంత‌రం కొన్ని కార‌ణాల‌తో సుమారు ఆరేళ్ల‌పాటు ఆమెకు దూర‌మ‌వుతాడు. యాడ్ ఫిల్మ్ మేక‌ర్‌గా కొన‌సాగుతున్న త‌రుణంలో నాగ‌చైత‌న్య చిత్ర‌ను అనుకోకుండా క‌లుకుంటాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ ప్రేమ పుడుతుంది. ఇక అంతే స‌వ్యంగా ఉంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో భూమిక ఇల్లు సిలిండ‌ర్ ప్ర‌మాదంలో కాలిపోతుంది. ఈ ఘ‌ట‌న‌లో బావ భ‌ర‌త్‌రెడ్డి మ‌`తి చెంద‌గా.. భూమిక తీవ్రంగా గాయ‌ప‌డుతుంది. కానీ.. చ‌నిపోయింద‌ని అనుకున్న మేన‌కోడ‌లు బ‌తికి ఉన్న‌ట్లు తెలుస్తుంది. కానీ.. ఎక్క‌డ ఉందో తెలియ‌దు. ఈ ప్ర‌మాదంలో పాప ఎలా బ‌తికింది..? భూమిక కుటుంబంపై ప‌గ పెంచుకున్న‌దెవ‌రు..? అస‌లెందుకు ఇదంతా జరిగిందో తెలుసుకోవాలంటే.. తెర‌మీద చూడాల్సిందే.Madhavan-Naga-Chaitanya-Savyasachi-Movie-Release-Today-Wallpaper

ఎలా ఉందంటే..!
స్టోరీ లైన్ కొత్త‌దే. యాక్ష‌న్‌, మిస్టరీ క‌లిసిన‌డిచే చిత్ర‌మిది. కానీ.. న‌డిపించిన తీరే కొంత నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఫ‌స్టాఫ్ మొత్తం కూడా బోరింగ్‌గా న‌డుస్తుంది. కాలేజీ స‌న్నివేశాలు, నాగ చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్ మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ స‌న్నివేశాలు, ఇత‌ర పాత్ర‌ల ప‌రిచ‌యాల‌తోనే ద‌ర్శ‌కుడు చందు నెట్టుకొచ్చాడు. ఇందులో రెండు పాటలు ఒకే అనిపించాయి. ఇక సెకండాఫ్‌లో మాధ‌వ‌న్ ఎంట్రీతో కొంత సీరియ‌స్‌నెస్ వ‌స్తుంది. ఇక నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్‌ల మ‌ధ్య న‌డిచే యాక్ష‌న్‌, మైండ్‌గేమ్ అంత‌గా పండ‌లేద‌నే చెప్పొచ్చు. అయితే.. మేన‌కోడ‌ల్ని వెతికే క్ర‌మంలో వ‌చ్చే ప‌లు స‌న్నివేశాలు మాత్రం బాగున్నాయి. సినిమా ఎండింగ్‌కు ముందుకు వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఇక నాగార్జున పాట‌.. నిన్ను రోడ్డు మీద పాట‌తో బాగా వ‌చ్చింది. మొత్తంగా సినిమాలో ఏదో మిస్ అయ్యింద‌న్న ఫీలింగ్ ప్రేక్ష‌కుల్లో క‌లుగుతుంది.

ఎవ‌రెలా చేశారంటే..
స‌వ్య‌సాచి అంటే.. రెండు చేతుల‌ను స‌మానంగా వాడే వాడు అని అర్థం. మ‌హాభార‌తంలోని అర్జునుడి పేరు. అయితే.. ఇక్క‌డ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో నాగ‌చైత‌న్య ఇబ్బంది ప‌డుతుంటాడు. ఆయ‌న కంట్రోల్‌లో లేకుండానే ఎడ‌మ చేయి ప‌ని చేస్తుంది. ఆనంద‌మైనా.. దుఃఖ‌మైనా స్పందిస్తుంది. అయితే.. ఇక్క‌డ ల‌క్షణానికి త‌గ్గ‌ట్టుగా చైతూ న‌టించాడు. కానీ.. ఈ స్టోరీ లైన్‌కు త‌గ్గ‌ట్టుగా చందు మొండేటి సినిమా తీయ‌లేక‌పోయ‌డ‌నే చెప్పాలి. ఎక్క‌డో లింక్ కుదుర‌లేద‌ని అనిపిస్తుంది. ఇక విల‌న్‌గా మాధ‌వ‌న్ పాత్ర‌లో జీవించాడు. అలాగే భూమిక‌, నిధి అగ‌ర్వాల్‌, వెన్నెల కిశోర్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌లు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశార‌నే చెప్పొచ్చు. ఇక కీర‌వాణి సంగీతం కూడా ప‌ర‌వాలేద‌ని అనిపించింది. యువ‌రాజ్ కెమెరా వ‌ర్క్ ఆక‌ట్టుకుంది.

చివ‌రిగా..: స‌వ్య‌సాచికి దూరంగానే చైతూ..

రేటింగ్ :- 2.75/5

సవ్యసాచి మూవీ రివ్యూ …హిట్టా..పట్టా !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts