టాక్సీ, అమర్ విన్నర్ ఎవరు?

November 18, 2018 at 1:12 pm

కాలం క‌లిసి రాక‌పోతే… పోటీ ఉంద‌ని తెలిసికూడా సినిమాను విడుద‌ల చేస్తే.. ఇలాంటి రిజ‌ల్టే ఉంటుంది మ‌రి. మాస్ మ‌హారాజ ర‌వితేజ న‌టించిన సినిమా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని సినిమా నిల‌బ‌డ‌లేక‌పోయింది. విడుద‌ల అయిన మొద‌టి రోజే నెగెటివ్ టాక్ రావ‌డం.. ఆ మ‌రుస‌టి రోజు మ‌రో కుర్ర‌హీరో సినిమా రావ‌డంతో జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. టాలీవుడ్ కుర్ర‌హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా సినిమాతో పోల్చుతూ.. ప్రేక్ష‌కుల చూస్తున్నారు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని కంటే టాక్సీవాలానే న‌యం అనే టాక్ వ‌స్తోంది.

Taxiwala

Amar-Akbar-Anthony-Telugu-825

నిజానికి… ర‌వితేజ సినిమా కంటే ముందే టాక్సీవాలా సినిమా విడుద‌ల తేదీ ఫిక్స్ అయింది. అయినా.. ఏమాత్రం ఆలోచించ‌కుండా.. టాక్సీవాలా క‌న్నా ఒక‌రోజు ముందే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని సినిమాను విడుద‌ల చేశారు. తీరా మొద‌టి రోజే డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. దీంతో రెండో రోజు నుంచే థియేట‌ర్ల‌లో జ‌నం క‌రువ‌య్యారు. ఇదే స‌మ‌యంలో టాక్సీవాలా రావ‌డంతో అంద‌రి ద‌`ష్టి దానిపై ప‌డింది. ఇది ఆత్మ‌, హ‌ర్ర‌ర్‌, కామెడీతో ఎంతో కొంత బెట‌ర్ టాక్ సంపాదించుకుంది. దీంతో జ‌నం ఇటువైపు తిరిగిపోయారు.

దీంతో మాస్‌మ‌హారాజ సినిమా తేలిపోయింది. ఆయ‌న కెరీర్‌లో మ‌రో ఫ్లాప్‌గా నిలిచిపోయింది. ముఖ్యంగా క‌నీసం కొద్దిరోజులైనా థియేట‌ర్ల‌లో నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలోగానీ.. ర‌వితేజ యాక్ష‌న్‌లోగానీ ఏమాత్రం కొత్త ద‌నం లేకుండా రొటీన్‌గా తీసిన సినిమా అంటూ టాక్ వ‌చ్చింది. మొత్తంగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని నెగెటివ్ టాక్‌తో టాక్సీవాలా సినిమాకు మ‌రింత‌గా క‌లిసి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో మూడో సినిమా లేక‌పోవ‌డంతో అంద‌రూ టాక్సీవాలాతో జ‌ర్నీ చేస్తున్నారు.

టాక్సీ, అమర్ విన్నర్ ఎవరు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts