ఇక్కడ బాబు సిద్ధాంతా రాజకీయలు నేర్పబడును

November 2, 2018 at 10:47 am

సిద్ధాంతాలు మార్చ‌బ‌డును!- ఇప్పుడు ఏపీ టీడీపీ నేత‌లు ఇదే సూత్రాన్ని అవ‌లంబిస్తున్నారు. అవ‌స‌రానికి త‌గిన విధం గా సూత్రాలు, సిద్ధాంతాల‌ను మార్చుకునే పేటెంట్ హ‌క్కును టీడీపీ అధినేత చంద్ర‌బాబే సొంత‌గా త‌యారు చేసుకున్నా రు. త‌న అవ‌స‌రాల‌ను దేశ అవ‌స‌రాలుగా, జాతి అవ‌స‌రాలుగా ఆయ‌న మారుస్తున్నారు. జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పేం దుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్రమంలోనే ఆయ‌న నేతృత్వం వ‌హిస్తున్న పార్టీ తాలూక అస‌లు మౌలిక స్వ‌రూపాన్ని చంద్ర బాబు బుట్ట‌దాఖ‌లు చేస్తున్నారు. త‌న సిద్ధాంతాన్ని, త‌న వ్య‌క్తిగ‌త వృద్ధిని, త‌న ఈగోను పార్టీ సిద్ధాంతాలుగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తున్నారు. ఇక అంద‌రూ దీనినే ప‌ట్టుకుని వేలాడాల‌ని, లేకుండా రాష్ట్ర ద్రోహుల‌ని ఆయ‌న ముద్ర వేస్తున్నా రు. ఇలా చంద్ర‌బాబు చాణిక్యం.. చాట భార‌తంగా మారుతోంది.45214687_2344396942240550_8580180579536863232_n (1)

1983లో ఏపీలో విప్ల‌వాన్ని తీసుకు వ‌చ్చిన అన్న‌గారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం.. ఒక్క ఉమ్మ‌డి ఏపీలోనే కాకుండా.. దేశంలోని రాజ‌కీయాల‌ను సైతం స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసింది. అప్ప‌టి వ‌ర‌కు నియంతృత్వ ధోర‌ణితో దేశం లోని రాజకీయ నేత‌ల‌తో ఆడుకున్న కాంగ్రెస్‌ను తుద‌ముట్టించేందుకు తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ముందుకు సాగారు. కాంగ్రెస్‌తో ఎన్టీఆర్ తుద‌కంటా వైరాన్నే కొన‌సాగించారు. కేంద్రం నుంచి రాష్ట్రంపై ఒత్తిడి పెరిగిన‌ప్పుడు కూడా ఆయ‌న మిగిలిన ప‌క్షాల‌ను కూడ‌గ‌ట్టుకుని.. కేంద్రంపై పోరాటం చేశారే త‌ప్ప‌.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆయ‌న కాంగ్రెస్‌తో చేతులు క‌లిపేందుకు ముందుకు రాలేదు. పైగా.. ఉత్త‌రాది అహంకారం- అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుప‌డే వారు. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా అనేక మందిని కూడాగ‌ట్టారు.45104688_2344480642232180_8739492435647791104_n

కాంగ్రెస్ వ్య‌తిరేక సూత్రం-సిద్ధాంతాల‌తోనే రామారావు రాజ‌కీయాలు చేశారు. క‌ట్ చేస్తే.. టీడీపీని ప్రారంభించి దాదాపు 40 ఏళ్లు గ‌డిచింది. ఇప్పుడు ఈ పార్టీ ఎన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబు చేతిలో ఉంది. ఎవ‌రైనా స‌రే.. పార్టీని డీల్ చేస్తున్న‌ప్పు డు.. మౌలిక సూత్రాల‌ను, మౌలిక సిద్ధాంతాల‌ను మ‌రింత అభివృద్ధి చేయాల‌ని చూస్తారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం మౌలిక సూత్రాల‌ను మార్చేశారు. ప్ర‌జ‌ల పేరుతో ఆయ‌న త‌న ఇష్టానుసారంగా పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బ‌లంగా ఉన్న టీడీపీని తీసుకు వెళ్లి.. జాతీయ‌స్థాయిలో బ‌ల‌హీనంగా ఉన్న కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు. పైగా ఇది ప్ర‌జ‌ల కోస‌మేన‌న్న‌ది బాబు అభిప్రాయం. మ‌రి ఏ ప్ర‌జ‌లు ఆయ‌న చెప్పారో.. ముందు చంద్ర‌బాబు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.45367204_2344480632232181_265614323911491584_n

టీడీపీలోని సీనియ‌ర్లే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తీవ్రంగా వ్య‌తిరేకించిన కాంగ్రెస్‌ను ఇప్పుడు చంక‌నెక్కించుకున్నారు. నిజానికి బాబు మాదిరిగా దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీల‌కు రెండో త‌రం వ‌చ్చింది. అయితే, పార్టీ సిద్ధాంతాల‌ను, పునాదుల‌ను ఎవ‌రూ ఎక్క‌డా వ‌దులుకోవ‌డం లేదు. కానీ, బాబు మాత్రం ఇలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం అందరినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. త‌మిళ‌నాడులో డీఎంకే అధినేత క‌రుణానిధి మృతి చెందారు. అయినా.. ఆయ‌న ఆశ‌యాలు న‌డుస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాల‌కు ఎవ‌రూ ఘోరీ క‌ట్ట‌లేదు. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య ఇప్పుడు లేరు. కానీ, పార్టీ సిద్ధాంతాల‌ను ఎవ‌రూ తాక‌ట్టు పెట్టలేదు. కానీ, బాబు మాత్రం సొంత సిద్ధాంతానికి తూట్లు పొడుస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక్కడ బాబు సిద్ధాంతా రాజకీయలు నేర్పబడును
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts