తెలంగాణ మహాకూటమికి భారీ షాక్..!

November 6, 2018 at 10:35 am

తెలంగాణాలో డిసెంబ‌రు 7న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని మ‌ట్టి క‌రి పించి… ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్‌ను ఫాం హౌస్‌కే ప‌రిమితం చేయాల‌ని కాంగ్రెస్ స‌హా టీడీపీ, సీపీఐ, కొత్త‌గా పుట్టిన తెలంగా ణా జ‌న‌స‌మితి పార్టీలు నిర్ణ‌యించుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ నాలుగు పార్టీలూ క‌లిసి మ‌హా కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ కూట‌మి ఏర్పాటుతో అప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. ఎన్నిక‌ల కోసం ప్ర‌బుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన స‌మ‌యంలో కేసీఆర్ లో ఉన్న ఆనందం.. సంతోషం.. ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదంతా మ‌హాకూట‌మి మాయ చేస్తుం ద‌నే ఆలోచ‌న‌న నుంచి పుట్టిన బాధేనన్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా.States-Oct1-5

అయితే, కేసీఆర్ గుండెల్లో ద‌డ పుట్టిస్తుంద‌ని భావించిన మ‌హా కూట‌మి.. పుట్టి మూడు శుక్ర‌వారాలు కాకుండానే ఛిన్నా భి న్నమ‌య్యే ప‌రిస్తితి క‌నిపిస్తోంది. సీట్లు సర్దుబాటు వ్య‌వ‌హారం ర‌గ‌డ‌కు దారితీస్తోంది. పొత్తు కూట‌మిలోని ఏ పార్టీకి ఆ పార్టీ.. సీట్ల విష‌యంలో ప‌ట్టు, బెట్టు వీడ‌కుండా ర‌ట్టు చేసేందుకైనా రెడీ అంటున్న ప‌రిణామాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా యి. ఈ విష‌యంలో సీపీఐ కామ్రెడ్లు.. మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సీట్ల సర్దుబాటులో ఆలస్యమవడంతో తా ము బరిలోకి దిగే 9 స్థానాలను సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ ప్ర‌క‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. కూట‌మిలో భాగ‌స్వామ్య దోర‌ణి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాంగ్రెస్‌లో కనపడటం లేదని చాడా వెంక‌రెడ్డి విమర్శించారు. 18582410_791201827702857_5559120042806739453_n

పొత్తుల అంశంపై మరింత జాప్యం జరిగితే ‘ప్లాన్‌ బి’తో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీట్ల కేటాయింపుపై త్వరగా తేల్చ‌కపోవ‌డం, త‌మ‌కు కొన్ని స్థానాలు మాత్ర‌మే ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తామ‌ని లీకులు ఇవ్వ‌డం బాధించింద‌ని అన్నారు. అందుకే తాము తొమ్మిది స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, ఆలే రు, మునుగోడు, మంచిర్యాల, పినపాక, దేవరకొండ, వైరా స్థానాల్లో తాము పోటీకి సిద్ధమని చెప్పారు. దీనిలో రెండో మూడో సీట్లతో సరిపెట్టుకోమంటే కష్టమని స్పష్టం చేశారు. తేల్చపోతే.. రెండో మూడు రోజుల్లో 20 సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. 40 సీట్లలో ఓడించే శక్తి తమకు ఉందని చాడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, సీపీఐ పది సీట్లను అడిగి కచ్చితంగా ఐదింటినైనా ఇవ్వాల్సిందేనని గట్టిగా కోరుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు, మునుగోడు, దేవరకొండ, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, కరీంనగర్‌ జిల్లాలో హుస్నాబాద్‌. ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాలో కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి. వీటిలో ఏవైనా ఐదు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతోంది. తమపార్టీ బలంగా ఉన్నందున నల్గొండలో ఒకటి, ఖమ్మం జిల్లాలో రెండు కలిపి తప్పనిసరిగా మొత్తం 5 కేటాయించాలనేది డిమాండు. కానీ రెండింటినే ఇస్తామని కాంగ్రెస్‌ సంకేతాలిచ్చింది. అవి బెల్లంపల్లి, వైరా అని తేల్చింది. తమకు 5 సీట్లు ఇవ్వకపోతే మరో ప్రణాళిక ప్రకారం ముందుకెళతామని సీపీఐ చెప్తోంది. మ‌రోప‌క్క‌, టీడీపీ ప్ర‌స్తుతానికి సైలెంట్‌గానే ఉన్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం.. త‌మ‌కు కూడా టికెట్లు పెంచాల‌నే డిమాండ్ వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో మ‌హా కూట‌మికి బీట‌లు వార‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ మహాకూటమికి భారీ షాక్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts