రాజ‌కీయాల్లో జగన్ సరికొత్త రికార్డ్!

November 6, 2018 at 10:39 am

భార‌త రాజ‌కీయాల్లో ఇదొక‌ మైలురాయి. స‌రికొత్త చ‌రిత్ర రూపుదిద్దుకున్న‌ రోజు.. క‌న్న‌తండ్రి ఆశ‌యాన్ని క‌నురెప్ప‌వాల్చ‌కుండా ముందుకు తీసుకెళ్తున్న త‌న‌యుడు. కుట్ర‌లు, కుతంత్రాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ జ‌న‌మే బ‌లంగా న‌డుస్తున్న నాయ‌కుడు. ఒక‌టి కాదు రెండు కాదు ఏడాదికాలంగా విరామ‌మెరుగ‌ని అడుగు ఆయ‌న‌ది. ఇప్పుడు దేశంమొత్తం ఆయ‌న పాదం వైపు చూస్తోంది. ఆయ‌న పాద‌యాత్ర‌పై ప్ర‌శంస‌లు కురిపిపిస్తోంది. అలుపెరుగ‌ని యోధుడి మ‌హాసంక‌ల్పానికి జేజేలు ప‌లుకుతోంది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ త‌న‌యుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఆయ‌న మ‌హాసంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టి నవంబ‌ర్ 6వ తేదీ
నేడు ఏడాది పూర్తి అయింది.

44699249_2011045992249191_7236762985996222464_n

2017 న‌వంబ‌ర్ 6న ఇడుపుల పాయ నుంచి జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ప్రారంభించారు. ఇక అప్ప‌టి నుంచి ఏనాడూ వెనుదిరిగి చూడ‌కుండా జ‌నంతో మ‌మేకం అవుతూ ముందుకు వెళ్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వారి జీవితాల‌కు భ‌రోసా ఇస్తూ ఆయ‌న యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక అడ్డంకులు ఎదురైనా బెదిరిపోకుండా పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. టీడీపీ అధినేత‌, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో అవినీతిని ఎండ‌గ‌డుతూ.. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల్లో బాబుగారి దుష్ట‌పాల‌న‌ను, మోస‌పూరిత వాగ్దానాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ క‌దులుతున్న తీరు కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది.

నిజానికి.. కాంగ్రెస్ నుంచి వేరుప‌డి వైసీపీని స్థాపించిన నాటి నుంచి జ‌గ‌న్‌పై ముప్పేట దాడి జ‌రుగుతూనే ఉంది. దానికి బెదిరిపోకుండా.. పార్టీని కాపాడుకుంటూ.. జ‌న‌నేత‌గా ఎదుగుతున్న తీరుకు రాజ‌కీయ‌పండితులు కూడా స‌లాం చేస్తున్నారు. అంటే బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా.. లోలోప‌ల మాత్రం శ‌భాష్ అంటున్నారు. వారంవారం హైద‌రాబాద్ సీబీఐ కోర్టుకు హాజ‌ర‌వుతూనే యాత్ర‌ను జ‌నం మెప్పుపొంద‌డం మామూలు విష‌యం కాద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్పుడు ఆయ‌న న‌డుస్తుంటే.. ఆయ‌న జ‌న‌కెర‌టం పాదం క‌లుపుతోంది. దానిని అధికార టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

44693893_2008269135860210_559770685484826624_n

ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టి మంగ‌ళ‌వారం నాటికి ఏడాది పూర్తి అయింది. అంటే 365రోజుల్లో 294రోజులు జ‌గ‌న్ పాద‌యాత్రలో పాల్గొన్నారు.
ఇందులో 205 మండలాల్లో 1739 గ్రామాలను చుట్టేశారు. 47 మునిసిపాలిటీలు, ఎనిమిది కార్పొరేషన్లు, 122 నియోజకవర్గాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. జగన్ మొత్తం 3,211.50 కిలోమీటర్ల దూరం నడిచాడు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. 113 స‌భ‌లు, 42 ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించారు. ఈ విరామ‌మెరుగ‌ని ప్ర‌యాణం ఆయ‌న గొప్ప జీవితానుభ‌వాన్ని ఇచ్చింద‌నే చెప్పాలి. ఇప్పుడు ఆయ‌న ఎంతో ప‌రిణ‌తి సాధించిన నేత‌గా క‌నిపిస్తున్నారు. ప్ర‌తీ అంశాన్ని లెక్క‌ల‌తో స‌హా సుల‌భంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించగులుతున్నారు.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పాద‌యాత్ర కొన‌సాగించి, హైద‌రాబాద్‌కు వ‌చ్చేందుకు విశాఖ విమ‌నాశ్ర‌యానికి రాగా.. అక్క‌డ ఆయ‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి కొద్దిరోజులుగా ఆయ‌న విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌నా స‌మ‌యంలో జ‌గ‌న్ క‌న‌బ‌ర్చిన ప‌రిణ‌తిపై అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఒక‌వేళ ఆయ‌నే క‌నుక ఆవేశంతో ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే.. ఈ రోజు ఏపీ ఇలా ప్ర‌శాంతంగా ఉండేది కాద‌ని.. జ‌గ‌న్ ఎంతో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించార‌ని.. ఇదే ఆయ‌న రాజ‌కీయ ప‌రిణ‌తికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

రాజ‌కీయాల్లో జగన్ సరికొత్త రికార్డ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts