యాష్ వన్ మ్యాన్ షో ..కె.జి.ఎఫ్ మూవీ రివ్యూ

December 21, 2018 at 4:49 pm

న‌టీన‌టులు: య‌శ్,శ్రీనిధి శెట్టి, త‌దిత‌రులు
నిర్మాత‌: విజ‌య్ కిరగండూర్
ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌శాంత్ నీల్
సంగీతం: ర‌వి,త‌నిష్క్

ఈ మద్య తమిళ, మళియాళ, కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ మంచి విజయాలు అందుకుంటున్నాయి. గతంలో కన్నడ హీరో ఉపేంద్ర తెలుగు చాలా సినిమాల్లో నటించారు. ఇక ఈగ సినిమా ఫేమ్ కిచ్చా సుదీప్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తాజాగా కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో యంగ్ హీరో యాష్ తెలుగు తెరపై ‘కే.జి.ఎఫ్’తో పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి హైప్ వస్తుంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దామా…

కథ :

ఇక సినిమా విషయానికి వస్తే గతంలో చూసిన మాదిరిగానే ఆదిపత్య పోరుతో సాగిన మాఫియా కథ. సూర్య‌వ‌ర్ధ‌న్‌కి ఓ విలువైన రాయి దొరుకుతుంది. అది బంగారం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్న అత‌ను ప్ర‌భుత్వంతో 99 ఏళ్ల‌కు లీజుకు తీసుకుని బంగారం త‌వ్వే ప‌ని ప్రారంభిస్తాడు. కొంత కాలానికి అతనికి పక్షవాతం రావడంతో అందరి కన్ను బంగారు గనిపై పడుతుంది. దాంతో ఎవరికి వారే ఆదిపత్యాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో సూర్య‌వ‌ర్ధ‌న్ కొడుకు గ‌రుడ అంద‌రినీ త‌న కంట్రోల్‌లో ఉంచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. అందుకోసం సూర్యవర్థన్ కి నమ్మకమైన ఐదుగురిని చంపి తన ఆదిపత్యాన్ని చెలాయిస్తుంటాడు. ఇక చిన్నతనంలోనే తండ్రిని పొగొట్టుకున్న రామ‌కృష్ణ ప‌వ‌న్‌(యాష్)..చిన్న పిల్లవాడిగా ఉన్నపుడే తల్లి చనిపోతుంది. ఇక డబ్బు ఎలాగైనా సంపాదించి గొప్పగా బతకాలని నిర్ణయం తీసుకున్న హీరో చిన్నతనంలోనే ముంబాయికి వస్తాడు. అక్కడ అలీ, శెట్టికి మ‌ధ్య అధిపత్య పోరు సాగుతుంటుంది. శెట్టి ప‌క్షాన నిల‌బ‌డ్డ రామ‌కృష్ణ తర్వాత రాఖీ డాన్ గా మారిపోతాడు. ఇక రాఖీ పనితనం తెలుసుకున్న రాజ్య‌వ‌ర్ధ‌న్ తనకు ప్రత్యర్థి అయిన గరుడను చంపే పనిని అప్పచెబుతాడు. అయితే గరుడను చంపాలంటే.. కె.జి.ఎఫ్ వెళ్లాల్సిందే అని నిర్ణయం తీసుకున్న రామకృష్ణ కే.జి.ఎఫ్ లోకి ఎలా ప్రవేశిస్తాడు..అక్కడ ఏం చేస్తాడు..గరుడను చంపుతాడా లేదా..అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :
1981 బ్యాక్‌డ్రాప్‌లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ క‌థ‌ను త‌యారు చేసుకున్న విధానం చాలా బాగుంది. ఈ సినిమా హీరో యాష్ చుట్టూనే తిరిగేలా క‌థ‌ను రాసుకున్నాడు. త‌ల్లి చ‌నిపోవ‌డంతో హీరో అనాథ‌గా మార‌డం.. అక్క‌డ నుండి చిన్న డాన్‌గా ఎదిగి ముంబై గోల్డ్ బిజినెస్‌ను శాసించే వ్య‌క్తి.. ఓ డీలింగ్‌లో కె.జి.ఎఫ్ అధినేత‌ను చంప‌డానికి ఆ గ‌నుల‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాడు..ప్రజలను బంద విముక్తి ఎలా చేస్తాడు అన్న విషయంపై కథ బాగా నడిపించారు. ఫ‌స్టాఫ్‌లో హీరో మెయిన్ విల‌న్‌ను చంపాల‌నుకోవ‌డం.. రెండో పార్ట్‌లో అత‌న్ని చంప‌డానికి కె.జి.ఎఫ్ వెళ్లి ఏం చేశాడ‌నే క‌థాంశంతో సినిమా ర‌న్ అవుతుంది. వాస్త‌వానికి మ‌రీ దూరంగా హీరో క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. భువ‌న్ గౌడ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకు కొత్త లుక్‌ను తీసుకొచ్చింది.

నటీనటులు :
ఈ సినిమాలో యాష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. రెండో పార్ట్‌లో అత‌న్ని చంప‌డానికి కె.జి.ఎఫ్ వెళ్లి అక్కడ విలన్లను ఎదుర్కోనే తీరు యష్ చూపించిన నటన అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే.. కే.జి.ఎఫ్ మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపించాడు. శ్రీనిధి శెట్టి గ్లామర్ పరంగా బాగానే ఆకట్టుకున్నా పెద్దగా నటనకు ప్రాధాన్యత లేదు. అచ్యుత్ కుమార్,మాళ‌విక అవినాష్,అనంత్ నాగ్,వ‌శిష్ట ఎన్.సింహ‌,అయ్య‌ప్ప శ‌ర్మ‌,బీసు సురేష్ త‌దిత‌రులు తమ పరిథిమేరకు బాగానే నటించారు.

సాంకేతి వర్గం :
దర్శకుడిగా ప్ర‌శాంత్ నీల్ 1981 నాటి బ్యాగ్ డ్రాప్ సినిమా ఎంచుకుని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ కి సంబంధించిన సినిమా ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు గా చూపించాలనే ప్రయత్నంలో కొంత వరకు బాగానే సక్సెస్ అయ్యాడు. కాకపోతే స్టోరీ నెరేష‌న్‌తోనే సాగేలా ఉంది. పాట‌లు ఓకే. వాస్త‌వానికి మ‌రీ దూరంగా హీరో క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు. భువ‌న్ గౌడ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకు కొత్త లుక్‌ను తీసుకొచ్చింది.

పాజిటీవ్ :
కథ, యష్, సినిమాటోగ్రఫీ
నెగిటీవ్ :
క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ , కామెడీ, స్టోరీ ల్యాగ్ చేయడం

బాటం లైన్ : యాష్..చించేశాడు
రేటింగ్ : 2.5/5

యాష్ వన్ మ్యాన్ షో ..కె.జి.ఎఫ్ మూవీ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts