బాబును మించిన చిన‌బాబు.. ఏ విష‌యంలోనో.. తెలుసా..!

December 8, 2018 at 11:36 am

ఏపీలో పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదు. దీనిపై అనేక ఆరోప‌ణలు, విమ‌ర్శ‌లు సైతం చుట్టుముట్టాయి. ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై నిప్పులు చెరిగారు. స‌త్తా లేక‌నే చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల‌ను వాయిదా వేశార‌ని, త‌న ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ప్ర‌జాప్ర‌తినిధుల అవినీతి వంటివి ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌తాయోన‌ని చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. నిజానికి ఈ ఏడాది జూలై 31తోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయ‌తీ, మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో ప‌ద‌వీ కాలం పూర్త‌యిపోయింది. అయితే, వీటికి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌బుత్వంపైనే ఉంటుంది. అయితే, చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటూ.. ఆయా పంచాయ‌తీల్లో ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించి వారికి అధికారాలు అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో ఇది వివాదానికి దారితీసింది.

ఇక‌, ఈ విష‌యంపై కొంద‌రు పంచాయ‌తీ ప్రెసిడెంట్లు హైకోర్టుకు వెళ్లారు. ఎలాగూ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేదుకాబ‌ట్టి.. త‌మ‌కు ఉన్న అధికారా ల‌ను పొడిగించాల‌ని కోర్టునుకోరారు. అయితే, దీనిని విచారిస్తున్న స‌మ‌యంలోనే ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హించ‌లేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. అయితే, రిజ‌ర్వేష‌న్ల విష‌యాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని కొన్ని రోజులు.. ఎన్నిక‌ల జాబితాలు సిద్ధం కాలేద‌ని కొన్ని రోజులు చంద్ర‌బాబు నేరుగా మీడి యా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చారు. కోర్టు మా్త్రం ఎన్నిక‌లు నిర్వ‌హించి తీరాల‌ని మాత్రం ఆదేశించింది. అయితే, ఏ విష‌యాన్న‌యినా.. త‌న‌కు అనుకూలంగా మార్చుకునే చంద్ర‌బాబు ఈ విష‌యంలోనూ అలానే వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఇదే విష‌యంపై స్పందించిన ఆయ‌న కుమారుడు, మంత్రి లోకేష్‌.. త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించి తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ప‌రిణామంతో అంద‌రూ నివ్వెర పోయారు.

ఇంత‌కీ లోకేష్ ఏమ‌న్నారంటే… ‘రాష్ట్రంలోని అన్ని ఎన్నికలు ఒకేసారి పూర్తికావాలి. ఇలాగైతే నాలుగున్నరేళ్లపాటు పాలన సాగించవచ్చు. ప్రతిసారీ ఎన్నికలు వస్తే.. ఆ కోడ్‌, ఈ కోడ్‌ అంటూ పనులు చేపట్టడం సాధ్యం కావడం లేదు. అందుకే అన్నీ ఒకే షాట్‌లో కొట్టాలి. మనం అందరం ప్రజల్లో ఉండాలి అనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. కాబట్టి త్వరలోనే సాధారణ ఎన్నికలన్నీ పూర్తి చేస్తాం’ అని అసలు విష‌యాన్ని అందంగా దాచేస్తూ.. స‌మ‌ర్ధించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తాజాగా పాల్గొన్న ఆయ‌న ఈ విధంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డాన్ని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే స‌రికి విన్న‌వారికి మ‌తిపోయినంత ప‌నైంది. !! ఏదైనా విత్తు ఒక‌టైతే.. చెట్టు మ‌రొక‌టి వ‌స్తుందా?! అనుకున్నారు విన్న‌వారు!

బాబును మించిన చిన‌బాబు.. ఏ విష‌యంలోనో.. తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts